దోహా ఎయిర్ పోర్టులో దుస్తులు విప్పించి.. మహిళలకు అవమానం.. ఖతార్ క్షమాపణలు

  • Published By: sreehari ,Published On : October 28, 2020 / 09:36 PM IST
దోహా ఎయిర్ పోర్టులో దుస్తులు విప్పించి.. మహిళలకు అవమానం.. ఖతార్ క్షమాపణలు

Qatar apologizes to Australia  : ఖతార్ రాజధాని దోహాలో విమానాశ్రయంలో మహిళా ప్రయాణికులను అవమానించిన ఘటనపై ఖతార్ క్షమాపణలు చెప్పింది. ఎయిర్ పోర్టులోని బాత్ రూంలో శిశువుకు జన్మనిచ్చిన మహిళ కోసం అక్కడి అధికారులు తనిఖీలు చేపట్టారు.



సిడ్నీ ఆధారిత ఖతార్ నుంచి ఆస్ట్రేలియాకు వెళుతున్న QR908 విమానాన్ని ఆపి మహిళా ప్రయాణికులను బలవంతంగా కిందికి దింపేసి దుస్తులు విప్పి తనిఖీల పేరుతో అనుమానించింది.

ఎయిర్ పోర్డు బాత్ రూంలో అప్పుడే పుట్టిన శిశువును ఎవరో వదిలి వెళ్లారనే అనుమానంతో అధికారులు మహిళా ప్రయాణికులను తనిఖీ చేశారు. గర్భానికి సంబంధించిన వైద్య పరీక్షలు చేశారు.



తమ దేశీయ మహిళలను అవమానిస్తారా అంటూ ఖతార్ విమానాశ్రయ అధికారుల చర్యపై ఆస్ట్రేలియా తీవ్రంగా స్పందించింది. మిడిల్ ఈస్ట్ దేశాలైన ఆస్ట్రేలియా, దోహ, కెన్ బెర్రాల మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలో ఖతార్ క్షమాపణలు చెప్పింది.

నేరస్తులు తప్పించుకుని పోకూడదనే ఉద్దేశంతోనే అత్యవసరంగా మహిళలను తనిఖీ చేయాల్సి వచ్చిందని ఖతార్ వివరణ ఇచ్చింది. ప్రయాణికుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినందుకు చింతిస్తున్నామని ఖతార్ ఒక ప్రకటనలో వెల్లడించింది.



ఆస్ట్రేలియా మహిళా ప్రయాణికులను అవమానించిన ఘటనపై సమగ్ర, పారదర్శకంగా విచారణ జరిపిస్తామని ఖతార్ ప్రధాని Sheikh Khalid bin Khalifa bin Abdulaziz Al Thani ఒక ప్రకటనలో వెల్లడించారు.



అక్టోబర్ 2న సిడ్నీకి బయల్దేరిన విమానంలో మొత్తం 18మంది మహిళా ప్రయాణికులు ఉండగా.. వారిలో 13మంది ఆస్ట్రేలియా మహిళలు, ఇతర విదేశీయులు ఉన్నారు. మహిళల పట్ల ఖతార్ చర్యపై ఆస్ట్రేలియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖతార్ విమానాశ్రయ అథారిటీకి లేఖ రాసింది. ఈ క్రమంలో స్పందించిన ఖతార్ క్షమాపణలు తెలియజేసింది.

https://10tv.in/australia-demands-answers-after-women-taken-from-qatar-airways-flight-and-strip-searched/