రెస్టారెంట్లు, జిమ్‌లు, హోటళ్లకు వెళ్తున్నారా? సూపర్ స్ప్రెడర్లతో జాగ్రత్త!

  • Published By: sreehari ,Published On : November 12, 2020 / 08:11 PM IST
రెస్టారెంట్లు, జిమ్‌లు, హోటళ్లకు వెళ్తున్నారా? సూపర్ స్ప్రెడర్లతో జాగ్రత్త!

Highest Covid Superspreader Risk : కరోనా ప్రభావం కాస్తా తగ్గినట్టే కనిపిస్తోంది. నెమ్మదిగా రెస్టారెంట్లు, జిమ్ లు, హోటళ్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కరోనా విజృంభించబోతుందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. 98 మిలియన్ల మంది మొబైల్ ఫోన్ డేటా వినియోగించి వేర్వేరు ప్రదేశాల్లో వైరస్ ముప్పు ఎంత అధికంగా ఉంటుందో అధ్యయనం చేశారు.



Stanford University and Northwestern Universityకి చెందిన పరిశోధకులు.. అమెరికాలో పలు నగరాల్లో మార్చి, మే నెల మధ్య యూజర్ల డేటాను సేకరించారు. ఎవరూ ఎక్కడి వెళ్లారు. ఎంతసేపు ఉన్నారు.. ఎంతమందిని కలుస్తున్నారు.. ఇలా మొత్తం ప్రజల ప్రతి కదిలికను మ్యాపింగ్ చేసి డేటాను సేకరించారు.



చికాగోలోని రెస్టారెంట్లను మళ్లీ తెరిస్తే.. దాదాపు 6 లక్షల కొత్త ఇన్ఫెక్షన్లు నమోదవుతాయని అధ్యయనంలో స్టడీ మోడల్ ఆధారంగా అంచనా వేశారు. ఇతర కేటగిరీల కంటే మూడు రెట్లు వైరస్ అధికంగా వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు. వైరస్ లక్షణాలు కనిపించని వారికంటే సూపర్ స్ప్రెడర్లతోనే హైరిస్క్ ఎక్కువగా ఉంటుందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

ఇప్పటికే 10 శాతం ప్రదేశాలను పరీక్షించగా.. అక్కడ 85 శాతం వైరస్ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఉందని పరిశోధకులు అంచనా వేశారు. కరోనా వైరస్ నియంత్రణకు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ లు అవసరం లేదని అధ్యయనం సూచిస్తోంది. మాస్క్ లు, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించడం ద్వారా కూడా కరోనాను నియంత్రణలో ఉంచవచ్చునని అధ్యయన బృందం పేర్కొంది.



20 శాతం ఆక్సుపెన్సీతో కూడిన ప్రదేశాల్లో కొత్త ఇన్ఫెక్షన్లు 80శాతం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవాలంటే అందుకు అవసరమైన వ్యూహాత్మక ప్రణాళికలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ కంప్యూటర్ సైంటిస్ట్ Jure Leskovec అభిప్రాయపడ్డారు.



కరోనా వ్యాప్తి నియంత్రణలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో అనేక పద్ధతుల్లో పరీక్షించాలని సూచించారు. వైరస్ నియంత్రణ చర్యలు లేకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకోలేమని అన్నారు. మూడో వంతు జనాభా వైరస్ బారినపడే అవకాశం ఉందని హెచ్చరించారు.