వచ్చేవారమే కాన్పూర్‌కు రష్యా కరోనా వ్యాక్సిన్..

  • Published By: sreehari ,Published On : November 15, 2020 / 05:27 PM IST
వచ్చేవారమే కాన్పూర్‌కు రష్యా కరోనా వ్యాక్సిన్..

Russia Covid Vaccine May Reach Kanpur : మొదటి బ్యాచ్ రష్యా స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ వచ్చే వారం కాన్పూర్‌కు చేరుకోనుంది. ట్రయల్ కోసం రష్యా వ్యాక్సిన్‌ను గణేశ్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీకి రానుంది. ఇక్కడే రెండోదశ, మూడో దశ హ్యుమన్ క్లినికల్ ట్రయ్స్ నిర్వహించనున్నారు.



దీనికి సంబంధించి భారతదేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వచ్చే వారం నుంచి రష్యా మొదటి బ్యాచ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయని కాలేజీ ప్రిన్సిపల్ ఆర్బీ కమల్ తెలిపారు.

ఈ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు 180కుపైగా వాలంటీర్లు నమోదు చేసుకున్నారు. రీసెర్చ్ అధికారి సౌరబ్ అగర్వాల్ ట్రయల్స్ లో పాల్గొనే వాలంటీర్లకు ఎంతవరకు డోస్ ఇవ్వాలో నిర్ణయించున్నారు.



వాలంటీర్లు వ్యాక్సిన్ తట్టుకోగల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన తర్వాతే మరో డోస్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించనున్నారు. వ్యాక్సినేషన్ అనంతరం వాలంటీర్లలో అవయవాల పరిస్థితి నిరంతరాయంగా చెకింగ్ చేస్తూనే ఉంటామన్నారు.

అంతేకాదు.. వ్యాక్సిన్ ఎంతవరకు విజయంవంతం అయిందో నిర్ధారించేందుకు ఈ డేటాను విశ్లేషించనున్నారు. వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉందో వీరిపై ఏడు నెలల వరకు పర్యవేక్షిస్తారు. 21 రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు వ్యాక్సిన్ డోస్ ఇచ్చే అవకాశం ఉంది.



ఒక నెలపాటు వ్యాక్సిన్ సమర్థతను పరిశీలించిన అనంతరం వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు. ఇప్పటికే కాలేజీకి చెందిన ఎతిక్స్ కమిటీ కూడా ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చేసింది. రష్యా వ్యాక్సిన్ మైనస్ (-20) డిగ్రీల సెల్సీయస్ నుంచి మైనస్ (-70) ఉష్ణోగ్రతలోనే ఉంచాల్సి ఉంటుంది.