వందలాది పుర్రెలతో ట్రోపీ టవర్.. ప్రాణత్యాగానికి ప్రతీక అంట..!

  • Published By: sreehari ,Published On : December 13, 2020 / 04:03 PM IST
వందలాది పుర్రెలతో ట్రోపీ టవర్.. ప్రాణత్యాగానికి ప్రతీక అంట..!

Scores of skulls kept as trophies :  మెక్సికో నగరంలో పురావస్తు తవ్వకాల్లో పుర్రెల టవర్ ఒకటి బయటపడింది. అజ్ టెక్ టెంపుల్ కు అతిసమీపంలో వందలాది పుర్రెలతో నిండిన టవర్‌ను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. 119 మనిషి పుర్రెలను టవర్ పైభాగంలో అమర్చారు. కొలంబియన్ నాగరికులకు ముందు ప్రాణత్యాగం చేసినవారి పుర్రెలను టవర్ పైభాగంలో ట్రోఫీగా పేర్చినట్టు గుర్తించామని పురావస్తు నిపుణులు వెల్లడించారు. నగరంలో మేయర్ ఆలయం అజ్ టెక్‌కు సమీపంలోని పురాతన భవనాల కింద ఈ పుర్రెలు బయటపడ్డాయి.

ఐదేళ్లుగా కొనసాగుతున్న తవ్వకాల్లో పాత భవనాల్లో ఉంచిన అల్మారాలో దాదాపు 603 పుర్రెలు బయటపడ్డాయి. వాస్తవానికి ఆ పుర్రెలు 1486 కాలం నుంచి 1502 మధ్య కాలానికి చెందినవారివిగా నిపుణులు అంచనా వేశారు. పుర్రెలతో నిండిన టవర్ ఎత్తు 10 అడుగులు (3.5 మీటర్లు) ఉంది. పుర్రెల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులవే ఉన్నాయి. మెక్సికో సిటీలోని టెనోచ్టిట్లాన్ శిథిలాల్లో ఈ పుర్రెలను గుర్తించారు. వీరి త్యాగానికి గుర్తుగా రాసుకున్న మరణ శాసనమని మెక్సికో సిటీ కల్చర్ సెక్రటరీ Alejandra Frausto పేర్కొన్నారు.

హిస్పానిక్ మెక్సోకో ముందుకాలంలో పుర్రెల అల్మారాలను tzompantli అనే పేరుతో పిలిచేవారు. వీటిని ప్రాణత్యాగం చేసిన బాధితుల తలలతో ట్రోఫీలా పేర్చి చెక్క స్తంభాలను ఇరుపక్కల దూర్చి ఉంచినట్టుగా ఉన్నాయి. అంతేకాదు.. అన్ని ర్యాకులపై పెయింటిగ్స్, కొన్ని అక్షరాలను లిఖించారు.

ఇతర ప్రాంతాలతో పోలిస్తే మెక్సికో నగరంలో కాస్తా విభిన్నంగా ఉన్నాయని అల్జెండ్రా పేర్కొన్నారు. పుర్రెలన్నింటిని సర్కిల్ ఆకారంలో పేర్చి ఒకరి తల పుర్రెపై మరొకరి తల పుర్రెను పేర్చి మధ్యలో ఖాళీ సందుల్లో సున్నంతో నింపి ఉన్నాయి. సర్కిల్ ఆకారం మధ్యలోపల ఖాళీ స్థలాన్ని వదిలేసినట్టుగా ఉంది. అందులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.