COVID-19 కంటే ‘సూపర్ బగ్స్’ అత్యంత ప్రాణాంతకం.. యాంటీబయాటిక్స్‌తో జాగ్రత్త..!

  • Published By: sreehari ,Published On : November 22, 2020 / 01:28 PM IST
COVID-19 కంటే ‘సూపర్ బగ్స్’ అత్యంత ప్రాణాంతకం.. యాంటీబయాటిక్స్‌తో జాగ్రత్త..!

superbugs antimicrobial resistance deadly COVID-19 :  ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కంటే సూపర్ బగ్స్ అత్యంత ప్రాణాంతకమైనవి.

యాంటీబయాటిక్ మందులకు కూడా లొంగవు. రోగాన్ని మరింత తీవ్రంగా మార్చగల ప్రాణాంతకమైన బ్యాక్టీరియాలుగా పిలుస్తుంటారు.

అతిగా యాంటీబయాటిక్స్ వాడేవారిలో ఈ అనారోగ్య సమస్యకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.



ఎప్పుడు ఇలా జరుగుతుందంటే.. ఏదైనా బ్యాక్టిరీయా, వైరస్‌లు, ఫంగస్, పారాసైట్లు మ్యూటేషన్ అయితే.. మరింత ప్రాణాంతకంగా మారిపోతాయి. సూపర్ బగ్స్‌ను అంతం చేసే డ్రగ్స్ కూడా వాటిని నాశనం చేయలేవు.

ప్రపంచ ప్రజారోగ్య ముప్పు కలిగించే టాప్ 10 జాబితాలో యాంటీమైక్రోబయల్ నిరోధకత (Antimicrobial resistance) ఒకటిగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో వాడినా కూడా ఈ సమస్య ఎదురవుతుంది. మనుషుల్లో లేదా వ్యవసాయంలో మోతాదుకు మించి వాడితే రోగం తిరగబెడుతుంది.

మహమ్మారిగా మారి ప్రాణాలను బలితీసుకుంటుంది. యాంటీమైక్రోబయల్ నిరోధకత ఇన్ఫెక్షన్ల కారణంగా 2050నాటికి ఒక ఏడాదిలో 10 మిలియన్ల మరణాలు సంభవించే ముప్పు ఉందని ఓ రివ్యూ వెల్లడించింది.



2019లో ఈ మరణాల సంఖ్య 7 లక్షలు‌గా ఉంది. ఈ ఆరోగ్య ముప్పును పరిమితం చేయడమే వరల్డ్ యాంటీమైక్రోబయల్ ఎవేర్‌నెస్ వీక్ లక్ష్యంగా పేర్కొంది.

కరోనా మహమ్మారి సమయంలో యాంటీబయోటిక్ మందులను తప్పుగా వినియోగించడం వల్ల నిరోధకత పెరగొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

వాస్తవానికి సూపర్ బగ్స్ అంటే వినే ఉంటారు.. ప్రపంచ ప్రజారోగ్యానికి వీటితోనే అతిపెద్ద ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. డ్రగ్ రెసిస్టెంట్ బగ్స్.. వీటినే సూపర్ బగ్స్ అంటారు.

ప్రతి ఏడాదిలో మిలియన్ల మందిని బలితీసుకుంటున్నాయి. కరోనా కంటే అత్యంత ప్రాణాంతకమైన ప్రాణ నష్టాన్ని కలిగించగలవని AMR Action fund పేర్కొంది.



బలమైన వ్యాధినిరోధకత :
పాక్షికంగా నిరోధకత పెరిగిందంటే.. యాంటీమైక్రోబయల్ అధిక మోతాదులో వాడారని అర్థం.. జంతువుల పెంపకంలో కూడా యాంటీబయాటిక్స్ తరచుగా వాడుతుంటారు.

జంతువులు తొందరగా పెరగడానికి లేదా వ్యాధులు సోకకుండా ఉండేందుకు కోసం యాంటీబయాటిక్స్ వాడుతుంటారు.

వాస్తవానికి కరోనావైరస్ ఒక వైరస్ వల్ల సోకుతుంది.. కానీ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా వైరస్‌కు యాంటీబయాటిక్స్ తోనే ట్రీట్ మెంట్ చేస్తున్నారని నివేదిక చెబుతోంది.

యాంటీబయాటిక్ రిసిస్టెంట్ ఇన్ఫెక్షన్ల కారణంగా 2050నాటికి ఏడాదిలో 10 మిలియన్ల మరణాలు ముప్పు ఉందని AMR Action Fund అంచనా వేస్తోంది. యాంటీమైక్రోబయల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రతిరోజు 2వేల మంది మరణిస్తున్నారని పేర్కొంది.



ఈ ఆరోగ్య విపత్తుపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని WHO గ్లోబల్ యాక్షన్ ప్లాన్ అభిప్రాయపడుతోంది.

పరిశోధనలతోపాటు మెరుగైన శానిటైజేషన్, మనుషుల్లో, జంతువుల ఆరోగ్యం కోసం యాంటీమైక్రోబయల్ మందులను పరిమితంగా వాడటం చేయాలి.

అలాగే సూపర్ బగ్స్ అంతం చేసే కొత్త మందులపై పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం వంటి అనేక అంశాలపై గ్లోబల్ యాక్షన్ ప్లాన్ పలు సూచనలు చేస్తోంది.



వ్యాప్తి నివారణపై దృష్టి పెట్టాలి :
ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాక్టీరియాలదే పైచేయి అని చెప్పాలి. డ్రగ్స్ కంటే వేగంగా మ్యూటేషన్ అయిపోతున్నాయి. డ్రగ్స్ అభివృద్ధికి అయ్యే ఖర్చును విక్రయాలతో సర్దుబాటు చేయలేమని AMR యాక్షన్ ప్లాన్ అంటోంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ రేసులో పోటీపడుతున్నాయి.



కొత్త యాంటీబయాటిక్స్ అభివృద్ధి చేయడంలో నెమ్మదిగా ఉన్నాయని Pew research తెలిపింది. కొత్త మందులతో బ్యాక్టీరియా, వైరస్ లను అంతం చేయడంపై దృష్టిపెట్టాలని WHO సూచిస్తోంది.

ప్రధాన ఫార్మా కంపెనీలు బయోటెక్‌లో 1 బిలియన్ వరకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించింది. ఈ ప్రణాళికలో భాగంగా 2030 నాటికి నాలుగు కొత్త యాంటీబయాటిక్స్ డ్రగ్స్ అందుబాటులోకి రానున్నాయి.


కొత్త యాంటీబయాటిక్స్ డ్రగ్స్ అభివృద్ధికి ప్రస్తుత మార్కెట్ ఆమోదయోగ్యం కాదని Novo Holdings సీఈఓ కాసీం కుటాయ్ తెలిపారు. అందుకే కొత్త యాంటీబయాటిక్స్ మార్కెట్లోకి వచ్చేంతవరకు ప్రతిఒక్కరూ తమ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.



అలాగే.. వ్యాక్సినేషన్ వేయించుకోవడం, అవసరనమైనప్పుడే యాంటీబయాటిక్స్ వాడాలి. పరిశుభ్రమైన మార్గంలోనే ఆహారాన్ని తయారుచేసుకుని తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.