Swarnim Vijay Varsh : లొంగిపోండి.. లేదంటే మట్టుబెడతాం.. 1971వార్‌లో పాక్ ఆర్మీకి భారత్ వార్నింగ్

Swarnim Vijay Varsh : లొంగిపోండి.. లేదంటే మట్టుబెడతాం.. 1971వార్‌లో పాక్ ఆర్మీకి భారత్ వార్నింగ్

1971 War of Surrender or be wiped Out : 1971 బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన యుద్ధంలో దయాది పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని జ్ఞాపకార్థంగా భారత్ డిసెంబర్ 16న 50వ వార్షికోత్సవాన్ని ‘Swarnim Vijay Varsh’గా జరుపుకుంటోంది. 1971 భారత-పాకిస్తాన్ యుద్ధానికి 50వ వార్షికోత్సవం సందర్భంగా విజయ్ దివాస్ గుర్తుగా ‘స్వర్నిమ్ విజయ్ వర్ష్’ లోగోను ఆవిష్కరించారు. 1971 భారత-పాకిస్తాన్ యుద్ధంలో దయాది పాక్‌పై భారత్ అతిపెద్ద విజయాన్ని సాధించింది. అప్పుడే బంగ్లాదేశ్ ఆవిర్భావించింది. బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం(1971)లో పాల్గొన్న భారత ఆర్మీ మొదటి ఫీల్డ్‌ మార్షల్‌ శామ్‌ మానెక్‌ షా… పాక్ పై యుద్ధంలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత్‌కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టిన ఆయన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఆద్యుడయ్యాడు. 50వ వార్షికోత్సవం సందర్భంగా భారత ఆర్మీకి చెందిన అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ (ADGPI) బుధవారం 1971 నాటి ఏకైక ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మానెక్ షాతో పాటు అప్పటి సైనికులను ఫొటోలను కూడా షేర్ చేసింది. డిసెంబర్ 13, 1971లో భారత్-పాక్ యుద్ధ సమయంలో తన సైనిక దళానికి నాయకత్వం వహించిన మానెక్ షా.. పాక్ ఆర్మీకి హెచ్చరించారు.. లొంగిపోండి.. లేదంటే పాక్ ను మట్టుపెడతాం అంటూ మెసేజ్ ద్వారా దయాది ఆర్మీని హెచ్చరించారు.

అప్పటి యుద్ధంలో ఆయన మాటలు పాక్ గుండెల్లో దడ పుట్టించాయి. ఆ యుద్ధంలో పాక్‌ చిత్తుగా ఓడిపోవడమేకాదు.. 45,000 మంది పాక్‌సైనికులు, మరో 45,000 మంది పౌరులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. ఆ తరువాతే బంగ్లా ఆవిర్భావం జరిగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై విజయానికి గుర్తుగా భారత్ 50వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ‘స్వర్నిమ్ విజయ్ మషాల్’ వెలిగించారు. అమర సైనిక జవాన్లకు పీఎం మోడీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా పలువురు అధికారులు దండలు వేసి నివాళులర్పించారు.

1971లో పాకిస్తాన్ సైన్యం, బంగ్లాదేశ్ ముక్తిబాహిని మిత్రరాజ్యాల దళాలు, ఫీల్డ్ జనరల్ సామ్ మనెక్ షా నేతృత్వంలోని భారత సైన్యం మధ్య యుద్ధం జరిగింది. 1970 ఎన్నికలలో అవామి లీగ్ విజయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం గుర్తించకూడదని నిర్ణయించుకుంది. ఆ తరువాత అవామి లీగ్ నేత షేక్ ముజిబుర్ రెహ్మాన్ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు.

తూర్పు పాకిస్తాన్ స్వయంప్రతిపత్తిని కోరుతుందనే భయంతో పాకిస్తాన్, రెహమాన్‌ను అరెస్టు చేసి దేశద్రోహ ఆరోపణలపై లాహోర్‌లో ఖైదు చేసింది. రెహమాన్‌ను అరెస్టు చేసిన తరువాత.. పాకిస్తాన్ ప్రధాన మంత్రి యాహ్యా ఖాన్ తిరుగుబాటును నిరోధించడానికి జనరల్ టిక్కా ఖాన్‌ను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు పంపారు. మార్చి 1971లో జనరల్ టిక్కా ఖాన్ బంగ్లాదేశ్ రాజకీయ నేతలు, విద్యార్థులు, మైనారిటీలపై అణిచివేత చర్యలకు పాల్పడ్డారు.

 

View this post on Instagram

 

A post shared by Indian Army (@indianarmy.adgpi)


డిసెంబర్ 3న పాకిస్తాన్ వైమానిక దళం అమృత్ సర్, అంబాలా, ఆగ్రా, అవంతిపూర్, బికానెర్, హల్వారా, జోధ్పూర్, జైసల్మేర్, పఠాన్‌కోట్, భుజ్, శ్రీనగర్, ఉత్తరాయ్‌లలోని భారత వైమానిక స్థావరాలపై దాడికి పాల్పడింది. అప్పుడు పాకిస్తాన్ ప్రధాని భారతదేశాన్ని యుద్ధానికి పురిగొల్పారు. భారత వైమానిక దళం ఈ దాడులను దీటుగానే తిప్పికొట్టింది. ఏకకాలంలో తూర్పు పాకిస్తాన్‌లోకి దూసుకెళ్లి పాక్ సైనికులను మట్టుబెట్టింది.

డిసెంబర్ 14 నాటికి పాకిస్తాన్ దళాలు హతమయ్యాయనే స్పష్టత వచ్చింది. అప్పుడే ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్ షా హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ దళాల కమాండర్ నియాజీని భారత సైన్యం ఎదుట బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరించారు. 1971లో సరిగ్గా (డిసెంబర్ 16) ఇదే రోజున 93 వేల మంది పాకిస్తాన్ దళాలు భారత సైన్యానికి లొంగిపోయాయి.