బిగ్‌బాస్ 4: నాగార్జున కండీషన్స్ ఇవే.. పార్టిసిపెంట్స్ ఎవరంటే?

  • Published By: vamsi ,Published On : July 23, 2020 / 11:49 AM IST
బిగ్‌బాస్ 4: నాగార్జున కండీషన్స్ ఇవే.. పార్టిసిపెంట్స్ ఎవరంటే?

కరోనా కారణంగా తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 చాలా కాలంపాటు వాయిదా పడింది. అయితే అసలు ఉంటుందా? ఉండదా? అని బిగ్‌బాస్ ప్రేమికులు అనుమానిస్తుండగా.. ఎట్టకేలకు వారందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. స్టార్ మా బిగ్‌బాస్ 4కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.

హోస్ట్ విషయంలో కూడా వచ్చిన ఊహాగానాలకు క్లారిటీ ఇచ్చేసింది. నాల్గవ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా ఉంటాడంటూ ప్రకటించింది. ఇప్పటికే స్టార్ మా నిర్వాహకులు కొంత మంది సెలబ్రిటీలను లిస్ట్ ఔట్ చేసినట్లుగా తెలుస్తుంది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి పెరిగిపోవడంతో ప్రోగ్రామ్ షెడ్యూల్‌ను కుదించిన‌ట్టు చెబుతున్నారు. మామూలుగా అయితే వంద రోజులు సాగే ఈ ప్రోగ్రామ్‌ను 60 నుంచి 70 రోజుల‌కు మించకుండా ప్లాన్ చెయ్యలని కండీషన్ పెట్టారట నాగార్జున.

బిగ్‌బాస్ సెట్ వేసిన ప్రదేశంలో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మంది సభ్యులు ఉండేలా ప్లాన్ చేయాలని, కంటెస్టెంట్స్‌తో డైరెక్ట్ ఇంటారాక్షన్ ఎవరికీ ఉండరాదని చెప్పారట. నాగార్జున కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఇంటి నుంచి సరాసరి ఆ స్పెషల్ రూమ్‌కు వచ్చి షూటింగ్ చేసి వెళ్లిపోతారట.

అంతేకాదు.. షోలో పార్టిసిపేట్ చేసేవాళ్లు.. షో కోసం పని చేసేవాళ్లను షో స్టార్ట్ చేసేదానికి వారం ముందు రోజులు వారి వారి ఇళ్లలో హెల్త్ అబ్జర్వేషన్‌లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఈసారి షో కి పనిచేసేవాళ్లను కూడా లోపలే షో జరిగినన్ని రోజులు ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈసారి బిగ్ బాస్ షో లో.. హీరో తరుణ్, హీరోయిన్ శ్రద్ధాదాస్, యాంకర్లు ఝాన్సీ, రష్మీ గౌతమ్, వర్షిణి, అలాగే కమీడియన్ హైపర్ ఆది, స్టార్ సింగర్స్ సునీత, మంగ్లీ, హీరో నందు, తాగుబోతు రమేష్, వైవా హర్ష, అఖిల్ సార్ధక్ పార్టిసిపేట్ చెయ్యనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తరుణ్ మాత్రం ఇప్పటికే తాను బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చెయ్యట్లేదని క్లారిటీ ఇచ్చారు.

 

View this post on Instagram

 

To all the wonderful ppl out there ❤️ #stayhomestaysafe #positivevibes

A post shared by Tharun (@actortarun) on