రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షాక్ ..దిశ చిత్రంపై షోకాజు నోటీసులు

  • Published By: bheemraj ,Published On : November 24, 2020 / 02:50 PM IST
రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షాక్ ..దిశ చిత్రంపై షోకాజు నోటీసులు

Telangana High Court show cause notices Ram Gopal Varma : వివాదాస్పద నిర్మాత రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. దిశ చిత్రంపై ఆర్జీవీకి షోకాజు నోటీసులు జారీ చేసింది. దిశ సినిమాను నిలిపివేయాలంటూ వచ్చిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం దిశ చిత్రంపై ఆర్జీవీకి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.



ముంబైలోని సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు, హైదరాబాద్ లోని బ్రాంచ్ ఆఫీస్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దిశ చిత్రాన్ని ఆపాలంటూ నిందితుల కుటుంబాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల వాదానలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.



దిశ అత్యాచారం, హత్య, నిందితుల ఎన్ కౌంటర్ కథను ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని నిలిపివేయాలంటూ ఇప్పటికే దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.

https://10tv.in/singer-sona-mohapatra-strong-reply-to-netizen/

మరోవైపు ఎవరైతే నలుగురు ఎన్ కౌంటర్ అయ్యారో వారి కుటుంబ సభ్యులు ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం రామ్ గోపాల్ వర్మతోపాటు దీంట్లో ఉన్న ఏడుగురు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.



ఈ చిత్రం విడుదల కావడం వల్ల దిశ తండ్రి, నిందితుల కుటుంబ సభ్యులు కూడా తమను విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రం వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయి. వెంటనే చిత్రంపై స్టే ఇవ్వాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు వివరించారు.

 

దీనిపై విచారించిన హైకోర్టు..రామ్ గోపాల్ వర్మతో పాటు దీంట్లో ప్రతివాదులు తెలంగాణ ఫిల్మ్ సెన్సార్ బోర్డు, యూనియన్ ఆఫ్ బ్రాడ్ కాస్టింగ్, రామ్ గోపాల్ వర్మ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ లకు నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.



ఇప్పటికే ఈ కేసును జ్యూడీషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. మరోవైపు దిశ తండ్రి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో జ్యూడీషియల్ కమిషన్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. అయినా ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేస్తామని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. మరోవైపు నిందితుల కుటుంబ సభ్యులు ఈ చిత్రాన్ని నిలిపివేయాలని చెప్పారు.



యూట్యూబ్ లో ట్రైలర్స్ ను విడుదల చేశారు… వాటిని కూడా వెంటనే తొలగించాలని రామ్ గోపాల్ వర్మను కోరారు. ఎట్టిపరిస్థితుల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని, న్యాయపరంగా ఏదైనా ఉంటే ఎదురుకుంటామని రామ్ గోపాల్ వర్మతోపాటు ప్రొడ్యూసర్ నట్టే కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రం వివాదాస్పదంగా మారింది. కోర్టు రెండు వారాల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.