తెలంగాణ వ్యక్తికి రెండోసారి కరోనా

  • Published By: sreehari ,Published On : August 25, 2020 / 05:19 PM IST
తెలంగాణ వ్యక్తికి రెండోసారి కరోనా

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మళ్లీ తిరగబెడుతోంది.. కరోనా నుంచి కోలుకున్నవారికి కరోనా మళ్లీ వ్యాపిస్తోంది.. సాధారణంగా ఒకసారి కరోనా సోకితే వారిలో యాంటీబాడీస్ తయారవుతాయి.. కరోనా నుంచి కోలుకున్నవారిలో వైరస్‌ను తట్టుకునేలా యాంటీబాడీస్ సాయపడుతాయి.

కానీ, ఈ యాంటీబాడీస్ ఎక్కువకాలం శరీరంలో ఉండవని ఇప్పటికీ పలు అధ్యయనాలు తేల్చేశాయి.. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మరోసారి వైరస్ సోకుతుందా? లేదా అనేక ప్రశ్నలకు తావిస్తోంది.. ఇప్పుడు అదే నిజమైంది..



కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి రెండోసారి కూడా వైరస్ సోకుతుందని తేలింది.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి రెండోసారి కరోనా సోకింది.. ఒకే వ్యక్తికి రెండు సార్లు కరోనా సోకినట్టు గుర్తించారు.. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు.

మొదటిసారి కరోనా సోకినప్పుడు ఉన్నంత ప్రభావం ఉండదని అంటున్నారు.. రెండోసారి కరోనా సోకినవారిలో వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు.. రీఇన్ఫెక్షన్ వచ్చిన వ్యక్తుల్లో లక్షణాలు చాలావరకు కనిపించడం లేదని డీహెచ్ చెబుతోంది..



మరోవైపు.. కరోనాను రెండుసార్లు సోకే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించిన ఈ కొత్త పరిశోధనలో భాగంగా హాంకాంగ్‌లో నివసిస్తున్న 33 ఏళ్ల వ్యక్తి కేసును పరిశీలించారు.. మొదట మార్చి చివరిలో అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది.. దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి.



అతను పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. కానీ ఆగస్టు మధ్యలో యూరప్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో అతడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈసారి మాత్రం అతనిలో మొదటిసారిలా ఎలాంటి లక్షణాలు లేవని గుర్తించారు.. కరోనా సోకినా ప్రాణాంతకమైతే కాదని చెబుతున్నారు..