నేరం ఒప్పుకున్న సంజయ్, ఉరి వేయాలంటున్న గొర్రెకుంట గ్రామస్తులు

  • Published By: madhu ,Published On : October 28, 2020 / 01:16 PM IST
నేరం ఒప్పుకున్న సంజయ్, ఉరి వేయాలంటున్న గొర్రెకుంట గ్రామస్తులు

Thrill over 9 murder verdict Gorrekunta Case : వరంగల్‌ గొర్రెకుంటలో 9 హత్యల కేసులో తుదితీర్పు వెలువడనుంది. సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. వాదన అనంతరం సంజయ్‌కి శిక్ష ఖరారు చేయనున్నారు సెషన్స్ కోర్ట్ న్యాయమార్తి. 9 మందిని చంపిన నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు గొర్రెకుంట గ్రామస్తులు మాత్రం సంజయ్‌కి ఉరే సరి అని డిమాండ్ చేస్తున్నారు.



సంజయ్ కుమార్ ను దోషిగా తేల్చారు వరంగల్ సెషన్స్ కోర్టు జడ్జి. నిందితుడికి ఉరి శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. తీర్పును జడ్జి జయకుమార్ వెల్లడించనున్నారు. వరంగల్ జిల్లా కోర్టు ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.



హంతకుడికి ఉరి శిక్ష ?
వరంగల్‌ గొర్రెకుంటలో సంచలనం సృష్టించిన 9 హత్యల కేసులో కాసేపట్లో తుది తీర్పు వెలువడనుంది. నిందితుడు సంజయ్ కుమార్‌ యాదవ్‌కి శిక్ష ఖరారు చేయనున్నారు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి. హంతకుడికి ఉరి శిక్ష పడుతుందా..? లేదంటే యావజ్జీవ శిక్ష పడుతుందా అన్నది కాసేపట్లో తేలనుంది.



9 మందికి మత్తు మందు ?
ఈ ఏడాది.. మే 20న సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీలో 9మందికి మత్తుమందు ఇచ్చి సజీవంగా బావిలో పడేసి చంపేశాడు సంజయ్‌. నిందితుడిపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఘటన జరిగిన 25రోజుల తర్వాత కోర్ట్‌లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాసేపట్లో న్యాయమూర్తి ఎలాంటి తీర్పు వెలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.



బావిలో మృతదేహాలు ?
2020, మే 20న ఈ దారుణం జరిగింది. కానీ ఆ రోజు ఆ విషాదాంతం.. బయటి ప్రపంచానికి తెలియలేదు. మే 21న గొర్రెకుంట శివారులోని బావిలో రెండు మృతదేహాలు చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు రెండు మృతదేహాలను బయటకు తీశారు. ఆ మరుసటిరోజు మే 22న అదే బావిలో మరో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మరింత టెన్షన్ మొదలైంది.



శవాల బావి ?
శవాల బావిగా ఎలా మారిందంటూ పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే.. మే 23న మరో మూడు మృతదేహాలు దొరికాయి. ఇలా ఒకదానికి వెనుక మరొకటి.. మొత్తం 9 తదేహాలు బయటపడ్డాయి. బావిలో మృతదేహాల మిస్టరీ పోలీసులకు సవాల్‌గా మారింది. గొర్రెకుంట బావిలో ఒకటి, రెండు కాదు ఏకంగా 9 మంది శవాలు బయటకు తేలాయి. ఆ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వాళ్లంతా ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా చంపేశారన్న అన్న కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.



ప్రాణాలు ఉండగానే..బావిలో పడేశాడు ?
పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్‌ల ద్వారా పోలీసులు కొన్ని క్లూలు దొరికాయి. దీంతో అనుమానితుడ్ని అదుపులోకి ప్రశ్నించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. మే 21 నుంచి 25 వరకు అటు పోలీసులు ఇటు క్లూస్‌ టీంలు ఘటనా స్థలంతో పాటు, పరిసరాలను నిశితంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు. ప్రాణం ఉండగానే బావిలో పడినట్టు పోస్టుమార్టం రిపోర్ట్ తేల్చడంతో కేసు మరో మలుపు తిరిగింది.



విష ఆహారం ?
మృతుల్లో విష ఆహారం ఉన్నట్టు తేలడంతో ఇది ముమ్మాటికీ హత్యేనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుల్లో ఒకరైన బుస్రా ప్రియుడు సంజయ్ కుమార్ యాదవ్ తన స్నేహితులతో కలిసి సామూహిక హత్యలకు పాల్పడినట్లు తేల్చారు. నిద్ర మాత్రలు ఇచ్చి సృహ కోల్పోయాక తొమ్మిది మందిని గోనెసంచుల్లో మూట కట్టి బావిలో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు.



గన్నీ సంచుల తయారీ గోదాం ?
పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వెళ్లాడు. కరీమాబాద్‌ ప్రాంతంలో వీళ్లంతా అద్దె ఇంట్లో ఉండేవాళ్లు. గతేడాది డిసెంబర్ నుంచి.. గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిలో చేరారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌ కుటుంబం ఉండిపోయింది.

బుస్రాకు వివాహేతర సంబంధం ?
భర్తతో విడిపోయిన మక్సూద్ భార్య చెల్లెలు బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో వాళ్ల దగ్గరే ఉంది. వీళ్లతో పాటుగా గన్నీ సంచుల గోదాం పక్కనే ఉన్న పై భవనంలో బీహార్‌కి చెందిన శ్రీరాం, శ్యాంలు ఉన్నారు. ఇక సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితో బుస్రాకు వివాహేతర సంబంధం ఉండగా.. ఈ విషయంలో తరచుగా మక్సూద్ ఇంట్లో గొడవలు జరిగాయి. ఇంటిపై ఉంటున్న శ్రీరాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేశారు.



పక్కా ప్లాన్ ప్రకారం ?
విషయం తెలుసుకున్న సంజయ్ కుమార్ పక్కా ప్లాన్ ప్రకారం తొమ్మిది మందిని హతమార్చాడు. అంతకుముందే బుస్రాం అలం చెల్లెల్ని చంపేశాడు సంజయ్.. ఆ మ్యాటర్‌ బయటపడినా తనను ఎవరూ అనుమానించకూడదన్న కారణంతో ఈ హత్యలకు పథకం రచించాడు సంజయ్. 9 హత్యలు చేసిన సంజయ్.. తనకేం తెలియనట్టే నటించాడు. కానీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అఫీసర్‌గా పనిచేశారు శివరామయ్య. కాల్‌డేటా తోపాటు జీపీఆర్‌ఎస్‌ సహాయంతో ఈ కేసును ఛేదించారు.

జీఆర్ఎస్ డయాగ్రామ్ తో ?
నిందితుడు సంజయ్ ఎక్కడెక్కడ తిరిగాడు..? ఏమేం చేశాడన్న వివరాలను సేకరించారు. పోలీస్ చరిత్రలోనే మొదటిసారిగా జీపీఆర్‌ఎస్‌ సిస్టమ్‌ ద్వారా సేకరించిన ఆధారాలను సాక్ష్యాలుగా సమర్పించారు. జీపీఆర్‌ఎస్‌ డయాగ్రామ్‌తో పాటు నెట్‌ వర్క్ ప్రొవైడర్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ ప్రతినిధులను ప్రత్యక్ష సాక్షులుగా ప్రవేశపెట్టారు. 25 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి.. 485 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 98మంది సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే సెషన్స్ కోర్టు మాత్రం 67 మందిని విచారించింది. 173 డాక్యుమెంట్లను న్యాయస్థానం పరిశీలనలోకి తీసుకుంది.



యూ ట్యూబ్ లో సెర్చ్ ?
హత్యలు చేసేందుకు నిందితుడు సంజయ్‌ ఇంటర్నెట్‌ బాగా వాడినట్టు కూడా పోలీసులు తేల్చారు. ఎలా చంపాలి..? ఒకవేళ చంపితే ఆధారాలు దొరక్కుండా ఏం చేయాలి..? అన్న వివరాలను యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి తెలుసుకున్నాడు. దీనికి సంబంధించి యూట్యూబ్ ఎక్స్‌పర్ట్‌ కూడా ఓ నివేదిక ఇచ్చాడు.
9హత్యల ఎపిసోడ్‌లో నాలుగు ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు కీలక సాక్ష్యాధారాలు సమర్పించాయి.

కడుపులో ఉన్న నీళ్లు, బావిలో ఉన్న నీళ్లు ఒక్కటే ?
భోజనంలో మత్తుమందు, కాల్ డేటా, మహిళలపై అఘాయిత్యం, యూట్యూబ్‌కి సంబంధించి నిపుణులు వేర్వేరుగా నివేదికలిచ్చారు. 9మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు డాక్టర్ రజమాలిక్. డయాటమ్ అనే పద్దతిలో పోస్టుమార్టం చేశారు. శవాల కడుపులో ఉన్న నీళ్లు.. బావిలో ఉన్న నీళ్లు ఒకటేనని తేల్చి చెబుతూ నివేదిక ఇచ్చారాయన. ఐదు గంటల పాటు పోస్టుమార్టం చేసి కీలక ఆధారాలు పోలీసులకు సమర్పించారు.



కాల్ డేటా ఆధారం కీలకం ?
మే 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య 9మందిపై విష ప్రయోగం జరిగినట్టు తేలింది. ఇక మృతుల సెల్‌ఫోన్లతో పాటు.. నిందితుడి కాల్‌ డేటా ఆధారం కీలకంగా మారింది. నిందితుడు చాలా ప్లాన్డ్‌గా ఢిల్లీకి చెందిన వేరే వ్యక్తి పేరుతో ఉన్న సిమ్‌ వాడాడు. అది కూడా విచారణలో గుర్తించారు.



25 రోజుల వ్యవధిలో విచారణ
కేవలం 25 రోజుల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ కోర్టుకి సమర్పించారు. నివేదికలు, సాక్ష్యాలన్నింటిని పరిశీలించిన సెషన్స్ కోర్టు ఈ కేసులో తుది తీర్పు వెల్లడించనుంది. నిందితుడు సంజయ్‌కి ఉరి శిక్ష పడుతుందా.. లేదంటే యావజ్జీవ శిక్ష పడుతుందా అన్నది ఉత్కంఠగా మారింది.