ట్విటర్‌కు ఊహించని షాక్..కనిపెడితే 10లక్షల డాలర్లు బహుమతి

  • Published By: venkaiahnaidu ,Published On : July 16, 2020 / 06:54 PM IST
ట్విటర్‌కు ఊహించని షాక్..కనిపెడితే 10లక్షల డాలర్లు బహుమతి

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌కు ఊహించని షాక్‌ తగిలింది. అంతర్జాతీయ ప్రముఖులు, సంపన్నులే లక్ష్యంగా ట్విటర్‌ ఖాతాలను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేయడంతో అమెరికాలో పెద్ద సంచలనమే కలుగుతోంది. అమెరికా టాప్ క్యాడర్, హైప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్లలో చొరబడిన హ్యాకర్లు..క్రిప్టోకరెన్సీ స్కామ్‌కి తెర తీసారు..ఐతే వెంటనే స్పందించిన ట్విట్టర్ ఈ హైపై ప్రొఫైల్స్‌ ట్వీట్లను డిలీట్ చేయడంతో పాటు..మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ చేపట్టింది

ట్విట్టర్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్

కరోనా కాలంలో సైబర్ అటాక్స్ చేస్తూ..టెర్రర్ క్రియేట్ చేస్తోన్న హ్యాకర్లు ఏకంగా ట్విట్టర్‌కే తమ టార్గెట్ పెట్టారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా మొదలుకుని..టెక్ దిగ్జజం బిల్‌గేట్స్, అమెరికా ప్రెసిడెన్షియల్ కాండిడేట్ జో బిడెన్..టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్, అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్..ఇలా అమెరికాలో టాప్ అనదగ్గ ప్రొఫైల్స్‌ని హ్యాక్ చేశారు..తమకి కావాల్సిన మెసేజ్‌ను వారి అక్కౌంట్ల ద్వారా ట్విట్టర్ యూజర్లకి పాస్ చేసారు

ముందు ఇదంతా మామూలు ట్వీట్లు అనుకున్నారు..కానీ అందరి అక్కౌంట్లలో ఒకటే మాట..సమాజానికి తిరిగి ఇవ్వదలిచాం..కాబట్టి త్వరపడండి..కింద ఇచ్చిన లింక్‌కి మీరు పంపించే బిట్‌కాయిన్లకి రెట్టింపు సంఖ్యలో డాలర్లు ఇస్తామంటూ ఆ ట్వీట్‌లో నీట్‌గా పొందుపరిచారు హ్యాకర్లు. అంతా అరగంటలోనే జరిగిపోవాలంటూ ట్వీట్లలో ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది..అసలు కరోనా కాలంలో ఇలాంటి పిలుపు ఏంటని..వెంటనే అలర్ట్ అయిన నెటిజన్లు కంప్లైంట్లు చేసేలోపే..ట్విట్టర్ యాజమాన్యానికి విషయం తెలిసింది.

చిన్న చిన్న హ్యాకింగ్‌లు అప్పుడప్పడూ ట్విట్టర్లో సహజమే అయినా… ఏకంగా ఇలా హై ప్రొఫైల్ అక్కౌంట్లు హ్యాక్ అవడం పెద్ద సంచలనమే కలిగిస్తోంది..వెంటనే ఎంక్వైరీకి దిగిన ట్విట్టర్ సదరు ట్వీట్లను డిలీట్ చేసింది..అలానే హ్యాకింగ్‌కి గురైనవారితో పాటు..మిగిలిన వారు కూడా తమ పాస్‌వర్డ్స్ మార్చుకోవాలంటూ సూచించింది.

10లక్షల డాలర్లు బహుమతి

ట్రాన్ అనే సంస్థ ఫౌండర్ జస్టిన్ సన్ ఈ హ్యాకర్లు ఎవరో కనిపెడితే..పదిలక్షలడాలర్లు ఇస్తామంటూ ప్రకటించాడు.ఐతే ఈ హ్యాకింగ్ వెనుక ట్విట్టర్ ఉద్యోగులే ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఇంటర్నల్‌గా ట్విట్టర్ వాడే టూల్‌ తెలిస్తేనే ఇలా హై ప్రొఫైల్ అక్కౌంట్లు హ్యాక్ చేయడం కుదురుతుందని అంటున్నారు..ట్విట్టర్ పానెల్‌లో ఉండే ఈ టూల్ అక్కౌంట్ వెరిఫికేషన్ సమయంలో ఉద్యోగులకు మాత్రమే తెలుస్తుంది..కాబట్టి..ట్విట్టర్ ఉద్యోగే ఇలా టూల్ లీక్ చేసి ఉండొచ్చని లేదంటే స్వయంగా ట్విట్టర్ ఉద్యోగే హ్యాక్ చేసి ఉండొచ్చని అనుమానాలు బయలుదేరాయ్.

ఈ ట్విట్టర్ హ్యాకింగ్ అంతా కూడా బిట్‌కాయిన్ స్కామ్‌గా తెలుస్తోంది. ఎవరో కావాలనే ఇలా హై ప్రొఫైల్ అక్కౌంట్లను ఎంచుకున్నట్లు అర్ధమవుతోంది. బిట్ కాయిన్ రూపంలో తమ ఖాతాలకు వెయ్యి డాలర్లను పంపించాలని, ఆ అమౌంట్.. వెంటనే డబుల్ అవుతుందని హ్యాకర్లు మెసేజ్ చేసారు. బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి అపర కుబేరులు వెయ్యికి రెండువేలను ఇస్తామంటే వెనుకాముందు ఆలోచించరు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లల్లో చోటు చేసుకున్న అతిపెద్ద హ్యాకింగ్‌కా అమెరికాలో దీన్ని అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. తాజా పరిణామంతో మాన్యువల్‌గా అక్కౌంట్లను వెరిఫై చేసిన తర్వాత హై ప్రొఫైల్‌ ఎక్కౌంట్లుగా చెప్పేవారి ఖాతాలను కూడా ఈజీగా హ్యాక్ చేయవచ్చని ప్రూవ్ అయింది.ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది.