ఫైజర్ వ్యాక్సిన్‌ వచ్చేసింది.. డిసెంబర్ 7 నుంచి అందుబాటులోకి

  • Published By: sreehari ,Published On : December 2, 2020 / 01:13 PM IST
ఫైజర్ వ్యాక్సిన్‌ వచ్చేసింది.. డిసెంబర్ 7 నుంచి అందుబాటులోకి

Pfizer-BioNTech COVID-19 Vaccine: కరోనావైరస్ పై ప్రపంచానికి గుడ్ న్యూస్.. ఫైజర్ వ్యాక్సిన్ కు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే వారం డిసెంబర్ 7 నుంచి వ్యాక్సిన్ బ్రిటన్‌లోని ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ముందుగా వైద్య సిబ్బంది, 80ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.


కరోనా వ్యాక్సిన్ కు లైసెన్స్ పొందిన మొదటి వెస్టరన్ కంట్రీగా యూకే అవతరించింది. ఫైజర్/బయోటెక్ వ్యాక్సిన్ ను ఇప్పటివరకూ డ్రగ్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ (MHRA)తో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది.



జనవరి 1 ముందు ప్రత్యేక నిబంధనల కింద ప్రభుత్వానికి MHRA అధికారాన్ని ఇచ్చింది. రష్యా తర్వాత కరోనా వ్యాక్సిన్‌కు యూకే ఆమోదం తెలిపింది. యూకేలో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.



రాబోయే రోజుల్లో తొలి డోస్ వ్యాక్సిన్ అందించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకూ యూకే మొత్తం 40 మిలియన్ల డోస్ లను కొనుగోలు చేసింది. ఫైజర్ వ్యాక్సిన్ తుది ట్రయల్ ఫలితాల్లో వ్యాక్సిన్ 95 శాతం కన్నా ఎక్కువగా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.