అన్‌లాక్ 4.0 : ఏవి తెరుస్తారు? ఏవి తెరవరు?

  • Published By: venkaiahnaidu ,Published On : August 25, 2020 / 03:13 PM IST
అన్‌లాక్ 4.0 : ఏవి తెరుస్తారు? ఏవి తెరవరు?

TELANGANA

సెప్టెంబర్-1,2020నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. అన్‌లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్-1 నుంచి అన్నీ తెరిచేస్తారనీ, ఇక అసలు ఎలాంటి కండీషన్లూ ఉండవని చాలా మంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. అవి నిజం కావు. అందువల్ల సెప్టెంబర్ 1 నుంచి ఏవి తెరుస్తారో, ఏవి తెరవరో, టోటల్‌గా ఏ రూల్స్ అమల్లో ఉంటాయో పక్కా క్లారిటీతో తెలుసుకుందాం.



సెప్టెంబర్ 1 నుంచి  మెట్రో రైళ్ల సర్వీసులను కేంద్రం తిరిగి ఓపెన్ చెయ్యాలనుకుంటున్నట్లు తెలిసింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో గత మార్చి నెల చివరి నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్-1,2020నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రం ఇప్టటికీ సంప్రదింపులు జరుపుతోంది. మెట్రో సర్వీసులు తెరిచాక… ఎలాంటి రూల్స్ పాటించాలో… ఈవారాంతంలో గైడ్‌లైన్స్ వస్తాయని తెలిసింది.

-ఇప్పటివరకూ మెట్రో రైళ్లలో వెళ్లేవారు టోకెన్లను వాడారు. ఈసారి వాటిని వాడేందుకు అనుమతి ఉండదని తెలుస్తోంది. ఎక్కడా టచ్ లేకుండా ఉండే కాంటాక్ట్ లెస్ టికెట్ సిస్టంను కేంద్రం తేబోతోందనీ, మెట్రో రైలు కార్డుల్ని మాత్రమే వాడేందుకు అనుమతి ఇస్తుందని సమాచారం.



-ఈ సారికి థియేటర్లకు ఛాన్స్ లేనట్లే అని తెలిసింది. థియేటర్లు, ఆడిటోరియంలు మరో నెలపాటూ మూసే ఉంచుతారని తెలిసింది.

– ఈసారి బార్లలో కౌంటర్ దగ్గర లిక్కర్ అమ్మేందుకు అనుమతి ఇస్తారనీ అయితే… టేక్ ఎవే సర్వీసులకు మాత్రమే అనుమతిస్తారని తెలిసింది. బార్లు కూడా మార్చి 25 నుంచి మూసి ఉన్నాయి.

– స్కూళ్లు, కాలేజీలు మాత్రం సెప్టెంబర్‌లో కూడా మూసే ఉంటాయని తెలిసింది. IITలు, IIMలు మాత్రం తెరుస్తారని సమాచారం.



– సోషల్, పొలిటికల్, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, అకడమిక్, కల్చరల్, మతపరమైన సమావేశాలు, సభలు, ఫంక్షన్లు, వేడుకలు, పెద్ద ఎత్తున జనం గుమికూడటాలు వంటివాటికి… సెప్టెంబర్ తర్వాత కూడా అనుమతి ఉండదని తెలుస్తోంది.- కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రకారం… కంటైన్‌మెంట్ జోన్లలో… అన్‌లాక్-4లో కూడా కఠినమైన లాక్‌డౌన ఉంటుంది. వాటిని నిరంతరం మానిటరింగ్ చేస్తూనే ఉంటారు.

– కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేశాక… వాటిపై ఫైనల్ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. అందువల్ల కేంద్రం అనుమతించినా… కొన్ని రాష్ట్రాలు అనుమతించకపోవచ్చు. అలాగే… కేంద్రం అనుమతించనివాటిని రాష్ట్రాలు కూడా అనుమతించకపోవచ్చు.