లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

బిగ్ థాంక్స్ : ఎస్పీజీ భద్రత తొలగింపుపై రాహుల్ ట్వీట్

Published

on

A big thank you to all my brothers & sisters in the SPG Rahul Tweet

ఇన్ని సంవత్సరాలు తనకు, కుటుంబానికి రక్షణగా నిలిచిన ఎస్పీజీ సిబ్బందికి బిగ్ థాంక్స్ చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు ఇస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (SPG) భద్రతను కేంద్రం ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. 

సుదీర్ఘ ప్రయాణంలో వారితో పెనవేసుకున్న బంధం తనకు ఎన్నో విషయాలు నేర్పిందని, తనను, తన కుటుంబాన్ని రక్షించేందుకు ఎస్పీజీ సిబ్బంది సోదరులు, సోదరీమణులకు పెద్ద ధన్యవాదాలు అని వెల్లడించారు. గొప్ప భవిష్యత్ కోసం ఆల్ ది బెస్టు అని ట్వీట్ చేశారు. 
Read More : అయోధ్య కేసు : కమిటీ అంగీకరిస్తే..రివ్యూ పిటిషన్ – ముస్లిం పర్సనల్ లా బోర్డు
28 ఏళ్లుగా గాంధీ ఫ్యామిలీకి ఎస్సీజీ భద్రత ఉందని, ప్రస్తుతం వారికి ప్రాణహానీ తగ్గినట్లు తేలడంతోనే భద్రతను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. 1991లో ఎల్టీటీఈ తీవ్రవాదులు రాజీవ్ గాంధీని హతమార్చిన తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు. కేంద్రం నిర్ణయంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కక్షాపూరిత రాజకీయాలు చేస్తోందంటూ మండిపడుతున్నారు. 

A big thank you to all my brothers & sisters in the SPG who worked tirelessly to protect me & my family over the years. Thank you for your dedication, your constant support & for a journey filled with affection & learning. It has been a privilege. All the best for a great future.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *