139మంది అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్.. 139మంది రేప్ చెయ్యలేదు, యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు అమాయకులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

139 People Rape Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 139మంది అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితురాలు సంచలన నిజాలు బయటపెట్టింది. తనను 139 మంది అత్యాచారం చేయలేదని బాధితురాలు చెప్పింది. అంతేకాదు యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు అమాయకులు అని చెప్పింది. డాలర్ భాయ్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసి తనతో వారిపై కేసు పెట్టించాడంది. సంబంధం లేదని చెప్పినా సెలబ్రిటీల పేర్లను డాలర్ భాయ్ చేర్చాడని వాపోయింది. తనకు, తన ఫ్యామిలీకి డాలర్ భాయ్ నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని బాధితురాలు వేడుకుంది. సోమవారం(ఆగస్టు 31,2020) సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడింది.

డాలర్ భాయ్ బ్లాక్ మెయిల్ చేశాడు:
పంజాగుట్ట యువతి కేసు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 139మంది అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ వ్యవహారం వెనుక డాలర్ భాయ్ అనే వ్యక్తి ఉన్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బాధితురాలు మీడియా ముందుకు కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. డాలర్‌ భాయ్‌ పెట్టమంటేనే తాను కేసులు పెట్టానని బాధిత యువతి చెప్పుకొచ్చింది. డాలర్‌ భాయ్‌ తన పట్ల సైకోలా వ్యవహరించాడని తెలిపింది.

షాకింగ్ ట్విస్ట్.. డాలర్ భాయ్ చెప్పినట్టే చేశాను:
‘నాతో ప్రమేయం లేనివారిపై కూడా కేసులు పెట్టించాడు. మొత్తం డాలర్‌ భాయ్‌ చెప్పినట్లే చేశాను. ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పాలో రాత్రిపూట డిక్టేట్‌ చేసేవాడు. నా వల్ల అమాయకులకు శిక్ష పడకూడదనుకున్నాను. ఫొటోలు, వీడియోలు తీసి నన్ను బెదిరించారు. 139మంది నాపై అఘాయిత్యానికి పాల్పడలేదు. నాతో ప్రమేయం లేనివారిపై కూడా కేసులు పెట్టించాడు. మొత్తం డాలర్‌ భాయ్‌ చెప్పినట్లే చేశాను. డాలర్‌ భాయ్‌తో నాపట్ల అమానుషంగా వ్యవహరించాడు. నాకు జరిగిన అన్యాయం, మరెవరికీ జరగకూడదు. చెప్పినట్లు చేయకపోతే నా కుటుంబాన్ని చంపుతామని బెదిరించాడు.

Anchor Pradeep: డాలర్ భాయ్ ఒత్తిడి వల్లే యాంకర్ ప్రదీప్ పేరు చేర్చాల్సి వచ్చింది. అంతేకాదు నటుడు కృష్ణుడికి కూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. నన్ను కొట్టి సెలబ్రిటీలతో ఫోన్‌లో మాట్లాడించాడు. నాతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా ట్రాప్ చేశాడు. సంబంధం లేదని చెప్పినా సెలబ్రిటీల పేర్లు చేర్చాడు’ అని బాధిత యువతి చెప్పింది. ఈ కేసులో 139మందిలో 30శాతం మంది మాత్రమే తనను అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టారని బాధితురాలు చెప్పింది. మీసాల సుమన్, డాలర్ భాయ్ ని అదుపులోకి తీసుకుంటే అన్ని నిజాలు బయటపడతాయంది.

READ  రాచకొండ పరిధిలోని 25 చెరువుల్లో గణేష్ నిమజ్జనం : సీపీ భగవత్

Related Posts