కూకట్‌పల్లిలో యువతి అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

kukatpally girl gang rape : నగరంలోని కూకట్ పల్లిలో యువతిపై అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురూ మేజర్లేనని నిర్ధారణ అయింది. అత్యాచార బాధితురాలి స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.మూడు నెలల క్రితం జోసెఫ్ తో తనకు పరిచయం అయిందని అత్యాచార బాధితురాలు పేర్కొంది. బర్త్ డే పార్టీ ఉందని చెప్పి తనను తీసుకెళ్లారని వాపోయింది. కేక్ తిన్నాక ఏం జరిగిందో తనకు తెలియదని  చెప్పింది.జరిగిన ఘటన ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని తెలిపింది. ఇంటికి వచ్చాక తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని పేర్కొంది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులకు కఠినంగా శిక్ష పడాలని బాధిత యువతి డిమాండ్ చేసింది.

కేక్ కట్ చేసి బర్త్ డే పార్టీ అంటూ లాడ్జ్‌కు :
బాధిత యువతి జూబ్లీ హిల్స్ లో నివాసం ఉంటోంది. సికింద్రాబాద్ లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమె ఇంటికి సమీపంలో ఉండే ముగ్గురు కుర్రాళ్లు స్నేహంగా ఉండేవారు. కాలేజీ ఫీజు కట్టేందుకు వెళ్లిన యువతికి ముగ్గురు కుర్రాళ్లు ఫోన్ చేసి బర్త్ డే పార్టీ అని చెప్పారు. కాసేపు ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం దగ్గర మాట్లాడుకున్నారు. కేక్ కట్ చేసి బర్త్ డే పార్టీ చేసుకుందామని, కూకట్ పల్లిలోని ఓ లాడ్జ్ కు తీసుకెళ్లారు.

కేక్ తెస్తానని చెప్పి వెళ్లిన ఓ కుర్రాడు.. ముందుగా ప్లాన్ చేసిన ప్లాన్ ప్రకారం.. కేక్ పై మత్తు మందు చల్లాడు. నువ్వే గెస్ట్ ముందు.. నువ్వు కేక్ కట్ చేయాలని చెప్పి తినిపించారు. యువతి కళ్లు తిరిగి పడిపోగానే యువకులు ముగ్గురు ఆమెపై అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని ముగ్గురు నిందితులు బెదిరించారు. లాడ్జ్ నుంచి ఆటోలో బాధిత యువతిని ఇంటికి పంపించారు.

ఇంటికి వెళ్లాక యువతికి అస్వస్థత :
ఇంటికి వెళ్లాక బాధిత యువతి తీవ్ర అస్వస్థతకు గురయింది. ఏం జరిగిందని తల్లిదండ్రులు అడగడంతో అసలు విషయాన్ని వారికి బాధిత యువతి చెప్పింది. జూబ్లీహిల్స్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ కేసును కూకట్ పల్లి పోలీసులకు అప్పగించారు. యువతిపై అత్యాచార ఘటనకు సంబంధించి కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

హోటల్ నిర్వాకంపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు పోలీసులు స్పందించారు. అత్యాచారం జరిగిన హోటల్ ను పోలీసులు పరిశీలించారు. ఎవరి పేరుతో హోటల్ రూం బుక్ చేశారో యువకుల వివరాలపై హోటల్ సిబ్బందిని ఆరా తీశారు. సీసీ కెమెరా ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలించారు.

Related Tags :

Related Posts :