bigg boss 4 telugu : అమ్మయ్యా… దివి వైద్య మాట్లాడిందోచ్.. నెటిజన్ల ట్రోల్స్
తెలుగు బిగ్ బాస్ నాల్గో సీజన్ కాస్త చప్పగా సాగుతోందనే భావన కలుగుతోంది ప్రేక్షకుల్లో.. ఈ సీజన్లో చాలామంది కొత్తవారు కావడంతో అంత పస లేదంటున్నారు.. ఏదైనా ఎంటర్ టైన్మెంట్ చేసేవాళ్లుంటే బాగుండు.. అనిపిస్తోంది ప్రేక్షకుల్లో.. అప్పడప్పుడు కాస్తా గంగవ్వ నవ్విస్తోంది..
Game gurinchi okkokkariki vere opinion undi vere Strategy undi? #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/w5b3umcuYR
— starmaa (@StarMaa) September 10, 2020
https://10tv.in/test-must-for-symptomatic-but-negative-covid-cases-centre-tells-states/
బిగ్ బాస్ హౌస్లో యాక్టివ్గా ఉంటూ అందరిని ఎంటర్ టైన్ చేస్తేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.. ప్రతిదానికి అందరి మీద అరుస్తూ కరాటే కల్యాణి ఏడుస్తుంటే.. అదేపనిగా ఏడుస్తూనే ఉంది మోనాల్ గజ్జర్..
అమ్మ రాజశేఖర్.. మూడో సీజన్ బాబా బాస్కర్ మాదిరిగా కాస్తా అందరితో కలుపుగోలుగా కనిపిస్తున్నాడు.. జోకులు వేస్తూ తన డ్యాన్సులతో ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.. లాస్య, హారిక ముచ్చటలతో కాలక్షేపం చేసేస్తున్నారు.. గంగవ్వ మాత్రం పంచులు విసురుతూ అందరిని ఆకర్షిస్తోంది.. ఇలా కంటెస్టెంట్లు ఏదో రకంగా యాక్టివ్గా కనిపిస్తూనే ఉన్నారు.
కానీ హౌస్లో ఉండే కంటెస్టెంట్ దివి వైద్య మాత్రం ఈ మూడు రోజుల్లో మాట్లాడినట్టు ప్రేక్షకులకు కనిపించనేలేదు.. ఇంతకీ ఆమె హౌస్లో ఉందా లేదా అన్నట్టుగా అనిపిస్తోంది.. ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. దీంతో దివిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుస్తున్నారు నెటిజన్లు.. మెమీలతో దివి మాట్లాడిందోచ్ అంటూ వైరల్ చేసేస్తున్నారు.. ఎట్టకేలకు దివి మాట్లాడింది.. బిగ్ బాస్ షోలో దివి నోరు విప్పింది..
స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో దివి వైద్య మాట్లాడినట్టు కనిపించింది. అంతే.. నెటిజన్లు దివిపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేశారు.. ఈ ప్రోమోలో దివి.. అమ్మ రాజశేఖర్ గేమ్ గురించి మాట్లాడుతుంటే.. నాకు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది అంటూ మాట్లాడింది.. ఈ ఒక్క మాటతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.. ఫన్నీ కామెంట్లు, మీమ్స్ తో ట్రోలింగ్ చేస్తున్నారు..