బిగ్ బాస్-4 ‘దత్తపుత్రిక’ మోనాల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

  • Published By: sreehari ,Published On : December 15, 2020 / 08:08 AM IST
బిగ్ బాస్-4 ‘దత్తపుత్రిక’ మోనాల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

Monal Gajjar Remuneration For Bigg Boss-4 : బిగ్ బాస్ దత్తపుత్రికగా పేరొందిన మోనాల్ గజ్జర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా? బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ మోనాల్ తీసుకుందని టాక్.. సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరికి వారానికి ఇంతా అని ఒక రెమ్యూనరేషన్లు ఫిక్స్ చేస్తారు. అయితే అందులో ఒక్కొక్కరి రెమ్యూనిరేషన్ ఒక్కోలా ఉంటుంది. అది వారి పాపులారిటీ, గ్లామర్ బట్టి వారి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఎన్నివారాలు హౌస్‌లో ఉంటే ఆ అన్ని వారాలకు కలిపి రెమ్యూనిరేషన్ ముట్టచెబుతారు బిగ్ బాస్.

మరికొంతమందికి ముందుగానే డీల్ కుదుర్చుకుంటారంట.. హౌస్‌లో ఎంతకాలం ఉంచుతారో కూడా ముందే డీల్ ఉంటుందంటూ పుకార్లు లేకపోలేదు. అలా మొదటి నుంచి ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్లొచ్చిన మోనాల్‌ను ప్రతివారం బిగ్ బాస్ కాపాడుకుంటూ వచ్చాడనే టాక్ నడిచింది. దత్తపుత్రిక మోనాల్ ను బిగ్ బాస్ ప్రీ-ఫైనల్ వరకు ఉంచారనే టాక్ ఉంది. ఎట్టకేలకు దత్తపుత్రిక మోనాల్‌ను ఫైనల్‌కు ముందే హౌస్ నుంచి బయటకు పంపించేశారు బిగ్ బాస్.

ఫైనల్ కు వెళ్లాలన్న కల నేరవేరకపోయినా భారీ మొత్తంలో మోనల్ రెమ్యూనరేషన్ దక్కించుకుందనే టాక్ జోరుగా నడుస్తోంది. మోనాల్ కు బిగ్ బాస్ వారానికి మూడున్నర లక్షల వరకు రెమ్యూనరేషన్ చెల్లించారని టాక్. దాదాపుగా యాభై లక్షల వరకు దక్కిందంట.. వాస్తవానికి బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కూడా అక్షరాల రూ.50 లక్షలే.. విన్నర్ కాదు.. రన్నరప్ కాకపోయినా మోనాల్ కు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ దక్కిందింట..

అదే విన్నర్ అయితే మోనాల్ ఈ రెమ్యూనరేషన్ తో పాటు ఇంకెన్నో వరించేవి.. ఎప్పుడో తెలుగు సినిమాల్లో కనిపించినా మోనాల్.. ఆ తర్వాత ఆమె మళ్లీ నటించలేదు. ఒకవేళ సినిమాల్లో నటించినా ఆమెకు ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ రావడం కష్టమే.. ఫామ్ లో ఉన్న హీరోయిన్లకే అది దక్కుతుంది. బిగ్ బాస్ లోనుంచి బయటకు వచ్చేశాక.. మోనాల్ కు ఏమైనా కొత్త చాన్స్ లు వస్తాయో లేదో చూడాలి.