‘బిగ్ బాస్’ హౌస్ ‘బొమ్మరిల్లు’.. అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువే ఇచ్చారు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bigg Boss 4- Surya Kiran about his Remuneration: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 మొదట్లో కాస్త నెమ్మదించినా మెల్లగా ట్రాక్ ఎక్కుతోంది. ఈ సీజ‌న్‌లో రెండో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టాడు డైరెక్టర్, నటి కళ్యాణి భర్త సూర్య‌ కిర‌ణ్‌. తన బిహేవియర్ వల్ల ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయ్యాడు.


తాజాగా బిగ్‌బాస్ షో గురించి, వాళ్లిచ్చే రెమ్యూన‌రేష‌న్ గురించి ఓ ఇంటర్వూలో మాట్లాడాడు సూర్య కిరణ్.. ‘‘కరాటే క‌ళ్యాణిని ఇత‌ర ఇంటి స‌భ్యులు ఆడుకుంటున్నా, అది ఆమెకు అర్థం కావ‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు. ఇక‌ మొద‌టి వారంలో లవ్ స్టోరీలేవీ స్టార్ట్ కాలేదంటూనే అభిజిత్‌‌, మోనాల్‌, అఖిల్ మ‌ధ్య ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ న‌డుస్తుంద‌ని.. దీని గురించి ఇంట్లో నుంచి వ‌చ్చేముందు మోనాల్‌ను తన స్టైల్లో హెచ్చ‌రించాన‌న్నాడు.


ఈ డ‌బ్బుతో 5,6 నెలలు హాయిగా బతికేయొచ్చు..

‘‘రెమ్యూన‌రేష‌న్ ఎంత ఇచ్చార‌నేది బయటకు చెప్పొచ్చో, లేదో నాకు తెలీదు. కానీ నాకైతే చాలానే ఇచ్చారు. అడిగిన దానికి 10 రెట్లు ఎక్కువే స‌మ‌ర్పించుకున్నారు. ఒక్క వారం రోజులు ఉన్నందుకు ల‌క్ష‌ల్లో ఇచ్చారు. ఈ డ‌బ్బుతో ఐదారు నెల‌లు కులాసాగా బతికేయొచ్చు. నాకొక్క‌రికి మాత్ర‌మే కాదు, అంద‌రికీ బాగానే ఇచ్చారు. నిజానికి ఒక వార‌మే క‌దా ఉన్న‌ది.. ఏమైనా ఇస్తారా అని కొంత అడిగితే, ఇచ్చేది చాలా వుందంటూ పెద్ద మొత్తంలో స‌ర్దారు.


కానీ తొలివారం ఎలిమినేష‌న్ ఉండ‌ద‌నుకున్నాను. ఇక‌పోతే అమ్మ రాజ‌శేఖ‌ర్ జెన్యూన్ ప‌ర్స‌న్, నాలాంటి వాళ్లు ఒకరు లోప‌ల అత‌డికి సాయంగా ఉంటే బాగుండు. లేదంటే హౌస్‌లో ఉన్న‌వాళ్లు ఆయ‌న‌పై ఎ‌క్కేస్తారు. అనుకున్నంత అమాయకులెవరూ లేరు హౌస్‌లో’’ అ‌ని చెప్పుకొచ్చాడు సూర్య‌ కిర‌ణ్.


Related Posts