లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Bigg Boss 4

Bigg Boss Telugu Vote : గంగవ్వ సేఫ్, దివి‌కి క్రేజ్. అభి సూపర్, ఆ నలుగురిలో ఒకరు ఎలిమినేట్

Published

on

BIgg Boss 4 Telugu Voting: బిగ్‌‍బాస్ హౌస్లో మూడో ఎపిసోడ్ నుంచి సాగుతున్న కట్టప్ప ఇష్యూకి ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. ఇటు బిగ్ బాస్ హౌస్లో స్పెషల్ కంటెస్టెంట్ అవ్వ.. తన కొత్త స్టెప్పులతో అదరగొట్టింది. మరోవైపు దివి ధ్యాసలో వంట చేసిన రాజశేఖర్ మాస్టర్ ఎప్పటిలాగే కామెడీ పండించారు.

ఎప్పటిలాగే ఉదయాన్నే వేకప్ సాంగ్‌తో రీఛార్జ్ అయిపోయారు. పకడో పకడో అంటూ జులయ్ మూవీ సాంగ్స్కు కొత్త స్టెప్పులతో అదరగొట్టారు. ఇక హౌస్లో సంథింగ్ స్పెషల్ గంగవ్వతో కల్యాణి చేయించిన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నా.. తమ చూపును మాత్రం గంగవ్వ చేస్తున్న డ్యాన్స్పైనే పెడుతూ తెగ ఎంజాయ్ చేశారు. దీనికి తగినట్లే అవ్వ కూడా హుషారుగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేసింది.

ఇటు ఎలిమినేషన్లో ఉన్న దివి ఇపుడు బాగానే యాక్టివ్ అయిపోయింది. దీంతో ప్రేక్షకులే కాదు, ఇంటి సభ్యుల్లోనూ దివికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. కిచెన్లో, అమ్మ రాజశేఖర్ ఆమెతో క్లోజ్ అయ్యే సీన్స్ ఆకట్టుకున్నాయి.

దివితో పులిహోర కలిపిన అమ్మరాజశేఖర్
మంచి క్యారెక్టర్, అందం ఉంది, మనందరితో బిగ్‌బాస్‌లో ఉంది. నువ్వు హీరోయిన్, నేను హీరో.. సరేనా అని కబుర్లు చెప్పడం ప్రారంభించారు. దీంతో తానూ కూడా తనకు నిజంగా వంట చేసే అబ్బాయిలంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. దీంతో ముసిముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయిన మాస్టర్.. పొరపాటున కూరలో టీ పొడి వేసి హౌస్లో నవ్వులు పూయించారు.మరోవైపు బిగ్ బాస్ హౌస్లో ఉన్న కట్టప్పపై మళ్లీ పంచాయితీ పెట్టారు బిగ్ బాస్. ఒక్కొక్కరు మీలో ఎవరు కట్టప్ప అని భావిస్తున్నారో వాళ్ల పేర్లు చెప్పడంతో పాటు. కారణాలు కూడా వివరించాలని కోరారు బిగ్ బాస్ . దీంతో సోహైల్.. అఖిల్పై, లాస్య, హారిక, కల్యాణి.. సూర్యకిరణ్పై, మోనాల్, గంగవ్వ.. అమ్మ రాజశేఖర్పై, అరియానా, దేవి, దివి, అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్,.. నోయల్పై, అఖిల్, మెహబూబ్, సుజాత, అభిజిత్.. లాస్యపై స్టాంపు గుద్దారు.

నోయల్ వంతు వచ్చేసరికి మాత్రం కాస్త సీన్ క్రియేట్ చేశాడు. తనకు ఎవరినీ బాధపెట్టడం ఇష్టం లేదని అందుకే తన ముఖంపైనే ముద్ర వేసుకుంటున్నట్లు చెప్పాడు. ఈ నిర్ణయాన్ని ఇంటి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.నోయల్ ఏమాత్రం తగ్గకుండా తన ముఖంపై తనే స్టాంప్ కొట్టుకున్నాడు. అయితే బిగ్ బాస్ ఎవరి ముఖంపై వాళ్లు స్టాంప్ కొట్టుకునే అవకాశం లేదని చెప్పడంతో రాజశేఖర్ మాస్టర్ని కట్టప్పగా భావిస్తూ స్టాంప్ వేశాడు నోయల్.

ఈ స్టాంప్లు కొట్టే కార్యక్రమం ముగియడంతో కట్టప్ప ఎవరో ఇంకా చెప్పమని త్వరలో రివీల్ చేస్తామని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో లాస్య ఇంకా ఎన్ని రోజులు బిగ్‌బాస్ ఇది అని కామెంట్ చేసింది. తర్వాత రాజశేఖర్ మాస్టర్ ఇంటి సభ్యుల్లో గ్రూప్లు మొదలయ్యాయని వాళ్లు ఎలా మాట్లాడుకుంటారో కామెడీ టచ్ ఇచ్చి ఫన్ జనరేట్ చేశారు.మొత్తానికి శుక్రవారం ఎపిసోడ్ కూడా చప్పగానే సాగిందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అయితే ఈరోజు, రేపు మాత్రం నాగ్ రావడం ఎలిమినేషన్ కార్యక్రమం ఉండటం నామినేట్ అయిన గంగవ్వ, సూర్యకిరణ్, సుజాత, దివి, అభిజిత్, మొహబూబా, అఖిల్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే టాక్స్ మాత్రం బాగానే నడుస్తున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *