Bigg Boss 4: మెహబూబ్‌ అవుట్.. కెప్టెన్‌గా అఖిల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bigg Boss 4 elimination: బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో ఎప్పుడో మూడవ వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సిన మెహబూబ్‌ బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాడు. మొదట్లో మెహబూబ్‌పై పెద్దగా నెగిటివ్ లేనప్పటికీ.. ఉక్కు హృదయం టాస్క్‌లో‌ ఓవరాక్షన్‌ చేసినప్పటి నుంచి అతనిపై నెగెటివిటీ బాగా వచ్చేసింది. అయితే వివిధ కారణాలతో సేఫ్ అవుతూ వస్తున్న మెహబూబ్.. ఇప్పుడు ఎట్టకేలకు బయటకు వచ్చేస్తున్నాడు.



బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్ప‌టికే ప‌ది మంది కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. సూర్య‌కిర‌ణ్‌, కరాటే కళ్యాణి, దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్‌, సుజాత‌, కుమార్ సాయి, దివి, అమ్మ రాజ‌శేఖ‌ర్ ఎలిమినేట్ అయ్యారు. అనారోగ్య కార‌ణాల‌తో గంగ‌వ్వ‌, నోయ‌ల్ హౌస్‌లో నుంచి బయటకు వ‌చ్చేశారు. ఇక ఇవాళ(15 నవంబర్) ఎపిసోడ్‌లో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ప‌క్క‌న పెట్టి అస‌లు ఎలిమినేష‌న్ ఉంటుందా? లేదా? అని అంద‌రూ అయోమ‌యంలో ప‌డిపోయారు.



అయితే చివరకు అందరూ అనుకున్నట్టు దీపావళి సందర్భంగా ‘నో ఎలిమినేషన్’ అని ప్రకటించలేదు. ‘మెహ‌బూబ్ దిల్‌సే’ని అవుట్ చేసేశారు. సూప‌ర్ హిట్ పాటలకు త‌న‌దైన స్టైల్‌లో అదిరిపోయే స్టెప్పులు వేసే మెహబూబ్.. బిగ్‌బాస్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. నామినేష‌న్‌లో ఉన్న‌వాళ్ల‌లో అరియానా మీద వ్య‌తిరేక‌త ఎక్కువగా ఉన్నా కూడా.. మెహ‌బూబ్ మీద అంత‌క‌ంటే ఎక్కువే ఉండ‌టంతో ఓట్లు రాక బయటకు వచ్చేశాడు.



మెహ‌బూబ్ ఫిజిక‌ల్ టాస్క్‌ల్లో ఇర‌గ‌దీస్తాడు. మిగ‌తావాళ్ల‌కు గెలిచే అవ‌కాశాన్నే ఇవ్వ‌డు. అయితే టాస్క్‌ల్లో త‌ప్పితే సాధార‌ణ స‌మ‌యాల్లో ఎక్కువ‌గా కనిపించడు. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించేందుకు ఏం చేయాల‌ి అనేదానిపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు.. ఇక రోబో టాస్క్‌లో అతి ఆవేశ‌ం.. ఇలా కొన్ని ఎలిమెంట్స్ అతను ఎలిమినేట్ అవ్వడానికి కారణం అయ్యాయి.



ఇక సీక్రెట్ రూం వెళ్లినందుకు కానుకగా.. అఖిల్ మళ్లీ హోజులోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా కెప్టెన్ అయిపోయాడు. అప్పుడు కాస్త డ్రామా నడిచిందిలేండి. ఆ డ్రామా లేకపోతే బిగ్‌బాస్ షో ఎందుకు అవుతుంది. ఇక ఇంట్లో ఉన్నవాళ్లలో అరియానా, మోనాల్, హారిక వీక్‌గా కనిపిస్తున్నారు. వాళ్లు రాబోయే వారాల్లో కచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక మిగిలింది టాప్ 5 కంటెస్టెంట్స్.. వాళ్లు అఖిల్, అభిజీత్, అవినాష్, లాస్య, సోహైల్. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎటువంటి మార్పులు వస్తాయో?

Related Tags :

Related Posts :