లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Bigg Boss 4

నా బిడ్డను నేనే చంపుకున్నా.. జున్ను వ‌చ్చాకే లైఫ్ మారింది : లాస్య‌

Published

on

Bigg Boss 4 Telugu : ఒకప్పుడు టీవీ యాంకర్‌గా రాణించి పెళ్లి చేసుకుని సెటిల్ అయిన లాస్య బిగ్‌బాస్ ఎంట్రీతో మళ్లీ లైమ్ లైటులోకి వచ్చింది. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మిగిలిన కంటెస్టెంటులతో పోటాపోటీగా ఆడుతోంది.బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు ఇచ్చిన పల్లెకు పోదాం ఛలో ఛలో అనే టాస్కులో ఊరి సర్పంచ్ భార్య పాత్రలో లాస్య ఆకట్టుకుంది. సోహైల్ ఊరి పెద్దగా.. అతడి భార్యగా లాస్య పోషించింది. బిగ్‌బాస్ ఆదేశాల ప్రకారం.. హారిక ముగ్గురిని హత్యలు చేస్తూనే ఏమీ ఎర‌గ‌న‌ట్టు న‌టించింది. టాస్క్ విజ‌య‌వంతంగా పూర్తి చేసింది.

హ‌త్య‌ల‌న్నీ జ‌రిగిపోయాక సోహైల్ హంత‌కురాలు హారిక అని తీర్పు చెప్ప‌డంతో టాస్క్ కూడా ముగిసింది. ఆ తర్వాత ఇంటిసభ్యులు తమ జీవితంలో జరిగిన అనుభవాలను గురించి ఒక్కొరు చెప్పుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యారు. యాంక‌ర్‌గా లాస్య త‌న జీవితంలో చీక‌టి రోజుల‌ను మ‌రోసారి గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది.2010లో తనకు పెళ్లి అయిందని, 2012లో క‌లిసే ఉన్నాం. 2014 జ‌న‌వ‌రిలో నాన్న ద‌గ్గ‌రి నుంచి ఫోన్ వ‌చ్చింది. ముందు సెటిల్ అవండి. ఆ త‌ర్వాత తామే పెళ్లి చేస్తామని చెప్పాడంతో హ్యాపీగా ఫీల‌య్యాను. అదే వారం తాను ఆరోగ్యం బాగోలేదని, ఆస్ప‌త్రికి వెళ్లడంతో తాను ప్రెగ్నెంట్ అని వైద్యులు చెప్పారని లాస్య తెలిపింది.

బిగ్‌బాస్‌ ఆరోవారం నామినేటెడ్ క్యాండెట్స్ వీళ్లే..


ఫ్యామిలీకి చెప్పుకోలేక తాను వెంటనే అబార్ష‌న్ చేయించుకున్నట్టు తెలిపింది. 2017లో మ‌ళ్లీ పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నామని, ఐదు నెల‌ల‌కే తాను మ‌ళ్లీ గ‌ర్భ‌వ‌తిన‌య్యానంటూ చెప్పుకొచ్చింది. అప్పుడు కూడా మళ్లీ నిలవలేదని దాంతో తాను మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపింది. వరుసగా రెండు సార్లు బిడ్డను పోగట్టుకున్నానని వాపోయింది.ఆ తర్వాత 2018లో తన పొట్ట‌లోకి జున్ను వ‌చ్చాడంటూ ఆనంద బాష్పాలను కార్చింది. ఆ తర్వాత నుంచే తన లైఫ్ మారిపోయిందని చెప్పింది. నా మొద‌టి బిడ్డ‌ను నేనే చంపేసుకున్నాననే బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉందని బోరున ఏడ్చేసింది.లాస్య చెప్పింది విన్న తోటి కంటెస్టులంతా భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత అందరూ లాస్యనే బెస్ట్ అంటూ ఫైనల్ చేయడంతో ఒప్పో దివాలి ఎడిషన్ ఫోన్ బహుమతిగా అందించారు.

మరోవైపు వరుస హత్యలతో హరిక బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసింది. వచ్చే వారం కెప్టెన్ పోటీదారులుగా మాస్ట‌ర్‌, సీక్రెట్ టాస్క్‌ గెలిచి హారిక‌, కెప్టెన్ అరియానా కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *