గంగవ్వకు కరోనా టెస్ట్.. నిర్వాహకులే పంపించేస్తారా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bigg Boss-4-Gangavva undergoes Covid Test: లాక్‌డౌన్ సమయంలో సరైన ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు బిగ్‌బాస్ నాలుగవ సీజ‌న్ ఘ‌నంగా ప్రారంభ‌మైంది. షోలో పాల్గొనే కంటెస్టెంట్ల‌ను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, అంద‌రికీ ప‌రీక్ష‌లు చేసి నెగెటివ్ అని నిర్దారణ అయిన తర్వాతే హౌస్‌లోకి పంపించారు.


షో కోసం పనిచేసేది తక్కువ సిబ్బందే అయినా కరోనా నిబంధ‌న‌లు తూ.చ త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ క‌రోనా క‌న్ను బిగ్‌బాస్‌పై ప‌డింది. తాజాగా షోలో ప‌నిచేసే కొంద‌రు టెక్నీషియ‌న్ల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు సమాచారం.


మ‌రోవైపు గంగ‌వ్వ కూడా కాస్త అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే కొద్ది రోజులుగా ‘వెళ్లిపోతా బిడ్డా’ అని మొత్తుకుంటోంది. కానీ నాగ్, ఆమె వెళ్లాలా, ఇంట్లోనే ఉండాలా అనేది ప్రేక్ష‌కుల నిర్ణయానికే వ‌దిలేస్తున్నానంటూ తేల్చి చెప్పేశారు. ఇదిలా ఉంటే టెక్నీషియ‌న్ల‌కు క‌రోనా సోకిన నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త‌గా గంగ‌వ్వ‌కు కూడా కోవిడ్‌-19 ప‌రీక్ష చేయించార‌ట‌. రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉందంట.


కాగా గంగ‌వ్వ వ‌రుస‌గా రెండోసారి కూడా ఎలిమినేష‌న్ రేసులో నిల‌బ‌డింది. కానీ ఆమెకు వస్తున్న ఓట్ల‌ు చూస్తే ఇప్ప‌ట్లో ఇంటికి వెళ్లే ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు. అయితే గంగవ్వ హౌస్‌లో ఉండ‌లేన‌ని మాటిమాటికీ చెప్తుండ‌టంతో బిగ్‌బాస్ నిర్వాహ‌కులే ఓ అడుగు ముందుకేసి ఆమెను త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు పంపించేందుకు ఆలోచ‌న చేస్తున్నారని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..


Related Posts