మోనాల్ హాట్ డ్యాన్స్.. కెప్టెన్‌కు మాస్టర్ అదిరిపోయే పంచ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Ismart Sohail, Monal Dance Performance: బిగ్‌బాస్-4 షో స్టార్ట్ అయిన కొత్తలో మోనాల్ గజ్జర్ కారణం లేకుండా ఏడుస్తూ ఉండడం చూసి.. ఈమెను ఎందుకు తీసుకొచ్చార్రా బాబోయ్ అని ప్రేక్షకులు తలలు ప‌ట్టుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. నత్తనడకన సాగుతున్న‌ బిగ్‌బాస్ షో కాస్తా మోనాల్ వల్ల అనుకోని మ‌లుపు తిరిగి ఎంట‌ర్‌టైన్‌మెంట్ దిశగా సాగుతోంది.


చూడకుండానే ఆమెను పెళ్లి చేసుకుంటాన‌న్న అభిజిత్‌తో క‌లిసిపోయిన మోనాల్ అతనితో ప‌ర్స‌న‌ల్ విష‌యాలు షేర్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. మరోవైపు అఖిల్‌తోనూ బాగానే మూవ్ అవుతోంది.


ఇక తాజా ప్రోమోలో మోనాల్ ‘వానా వానా వెల్లువాయే’ పాటకు ఇస్మార్ట్ సోహైల్‌తో క‌లిసి హాట్ హాట్ స్టెప్స్ వేసింది. అందరూ ఆమె అఖిల్‌, అభితో క‌లిసి డ్యాన్స్ చేస్తుందనుకున్నారు కానీ ఇక్కడే మోనాల్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో అఖిల్ ముఖం మాడిపోయింది.


ఆ త‌ర్వాత దివి, క‌ళ్యాణితో క‌లిసి అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్టర్ మాస్ స్టెప్పులేశాడు. ఈ డ్యాన్స్‌కు ఫిదా అయిన కెప్టెన్ లాస్య‌.. ‘అబ్బబ్బబా.. ఏం చేస్తిరి ఏం చేస్తిరి’ అని కామెంట్ చేస్తుండగా ‘ఇప్పుడే ఇస్త్రీ’ చేశానంటూ మాస్టర్ పంచ్ విస‌ర‌డంతో అంద‌రూ పగలబడి నవ్వారు.

Related Posts