నాగ్ సార్‌కు కథ చెప్తా..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bigg Boss 4- Sai Kumar Pampana 1st wild card Contestant: బిగ్‌బాస్ సీజన్-4 ఫస్ట్ వీక్ ఎలిమినేష‌న్ పూర్తైన రోజే మొద‌టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు యువ నటుడు, కమెడియన్ సాయికుమార్ పంప‌న‌. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన సాయికుమార్ పంప‌న‌ కు న‌టుడు అవ్వాల‌నేది చిన్న‌నాటి కోరిక‌. పెద్ద‌య్యాక ఆ క‌ల నెర‌వేరింది.


ల‌క్కీ(2012) సినిమాతో వెండితెర‌పై ప్ర‌వేశించిన‌ప్ప‌టికీ, ‘‘ఈ రోజుల్లో’’ చిత్రంతో గుర్తింపు వచ్చింది. ‘బస్‌స్టాప్‌, ల‌వ్ ట‌చ్‌, నా సామిరంగ‌, ఆడు మ‌గాడ్రా బుజ్జి, ప్రెజెంట్ ల‌వ్’ వంటి ప‌లు ‌చిత్రాల్లో న‌టించినా కానీ, కెరీర్‌లో పెద్ద బ్రేక్ అయితే రాలేదు.


డైరెక్షన్ కల..

దీంతో ఈ మ‌ధ్య అవకాశాలు తగ్గాయి. అందుకే బిగ్‌బాస్ రియాలిటీ షోతో మ‌ళ్లీ ఫామ్‌లోకి రావాల‌నుకుంటున్నాడు. కానీ ఈ సారి న‌టుడిగా కాకుండా ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకోవాల‌నుకుంటున్నాడట.


అది కూడా త‌న అభిమాన హీరో నాగార్జున‌కు క‌థ చెప్పి ఒప్పించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తాను అంద‌ర్ని న‌వ్విస్తూ ఎంట‌ర్‌టైన్‌ చేస్తాన‌ని ధీమాగా చెప్తున్నాడు. మ‌రి బిగ్‌బాస్ అత‌ని కెరీర్‌కు ప్ల‌స్ అవుతుందా?, తన డైరెక్షన్ కల నెరవేరుతుందా లేదా? అనేది చూడాలి.

పేరు: కుమార్ సాయి పంప‌న‌
వృత్తి: న‌టుడు, క‌మెడియ‌న్‌, ద‌ర్శ‌కుడు
స్వ‌స్థ‌లం: కొట్టార‌క్క‌ర‌, కేర‌ళ‌
విద్య‌: గ్రాడ్యుయేష‌న్‌
పుట్టిన తేదీ: 18 ఫిబ్ర‌వ‌రి 1990


Related Posts