లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Bigg Boss 4

బిగ్‌బాస్‌ ఆరోవారం నామినేటెడ్ క్యాండెట్స్ వీళ్లే..

Published

on

bigg boss 4 హౌస్‌లో ఆరో వారం నామినేషన్‌ ప్రక్రియ గత వారాలతో పోలిస్తే ప్రశాంతంగానే ముగిసింది. హౌజ్‌లో మెంబర్స్ అంతా మెహబూబ్‍‌ని టార్గెట్ చేస్తే.. చివరికి ఫ్రెండ్‌షిప్ అతణ్ని సేఫ్ అయ్యేలా చేసింది.

నవ్వుల సుజాత విసిరిన బిగ్ బాంబుతో సొహైల్‌ గిన్నెలు కడగటానికి నానా తంటాలు పడుతున్నాడు. కెప్టెన్‌ అయ్యాక కాలు మీద కాలేసుకొని కూర్చుందాం అనుకుంటే.. పాత్రలు తోమిస్తున్నారంటూ కడిగేశాడు. కప్‌లు మాత్రం కడగను అనడంతో అఖిల్ కప్పు నేను కడుగుతా తీసి పక్కన పెట్టు అంటూ చెప్పింది మోనాల్.అమ్మా నువ్వే కడుగు:
సొంతంగా వాడుకున్న కప్పులు కూడా ఎవరు కడగడం లేదని, వాటిని దాచిపెడతానని సోహైల్‌ చెప్పాడు. అలా వద్దని, దానివల్ల గొడవలు అవుతాయని అమ్మ రాజశేఖర్‌ చెప్పాడు. ఇంటిలో ఎవరు పాత్రలను క్లీన్ చేసినా ప్రాబ్లం రాలేదు. నువ్వు మొదలుపెట్టిన తర్వాత శుభ్రంగా ఉండటం లేదంటూ అమ్మా రాజశేఖర్ అన్నారు.

అమ్మా రోజూ నువ్వే కడుగు:

దానికి సమాధానమిస్తూ.. రోజు నువ్వే వంట పాత్రలు శుభ్రం చేయి. ఇప్పటి నుంచి కప్పులు ఎవరూ కడగకండి. మాస్టర్ కడిగేస్తాడంటూ బిగ్గరగా అరిచాడు. దాంతో నేను కడిగేస్తానని మాస్టర్ జవాబిచ్చాడు.

మళ్లీ మోనాల్ తో అభి డిస్కషన్:

గతవారం నామినేషన్‌ ప్రక్రియలో జరిగిన గొడవ గురించి అభి మళ్లీ మోనాల్‌ ముందు చర్చించాడు. మనిద్దరి మధ్య ఏం లేదా మోనాల్ అంటూ ఆ టాపిక్ తీసుకొచ్చాడు. అమ్మాయి కోణం నుంచి ఆలోచించు అని మోనాల్‌ చెప్పబోతుండగా.. దీన్ని ఉమెన్ ఇష్యూలా చూపించకు.

మనం మాట్లాడుకోవద్దు:

అఖిల్‌కి నీ మీద ప్రేమ ఉంటే.. నేషనల్ టీవీలో వచ్చేస్తుందని.. నామినేషన్ ప్రక్రియలో నీ పేరు ఎందుకు ప్రస్తావించాడు. బెడ్ రూంలో కూర్చుని అఖిల్‌ది తప్పని అన్నావ్.. నాగ్ సార్ ముందు ఇద్దరిదీ తప్పు అంటావా? నువ్ ఏం చేస్తున్నావో అర్థం అవుతుందని అనడంతో మళ్లీ మోనాల్‌ ఏడుస్తూ కోపాన్ని ప్రదర్శించింది. అభిమాత్రం ఆ టాపిక్‌ని వదలేదు. నీతో మాట్లాడకపోతేనే బెటర్ అనిపిస్తుంది.. ఏదో ఒకటి చెప్పు.. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు.. నా పని నేను చూసుకోవచ్చు.. నన్ను నువ్ తప్పుపట్టడం.. నేను నిన్న తప్పుపట్టడం వేస్ట్.. అంటూ ఆమె ముఖం మీదే చెప్పేశాడు అభి. అది విన్న మోనాల్‌.. కనీసం గుడ్ మార్నింగ్, హాయ్‌‌లు చెప్పుకుందాం అని అభిని అడిగింది.. కాసేపు ఆలోచించుకుని చెప్తా అని బర్త్‌డే వేడుకకి వెళ్లాడు అభి.

అఖిల్ రాలేదు.. 

అభిజిత్ బర్త్ డే కావడంతో అరియానా స్పెషల్ కేక్ తయారుచేసి కట్ చేయించింది. హౌస్‌మేట్స్‌ అందరూ వచ్చి అభిని విష్‌ చేశారు. ఇంటి సభ్యులంతా కేక్ కటింగ్‌కి వచ్చినా అఖిల్ మాత్రం దూరంగానే ఉన్నాడు. మోనాల్‌ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.

మోనాల్.. అఖిల్ ఓదార్పు

మోనాల్‌కి హెల్త్ బాలేదని సెలైన్‌ ఎక్కించారని bigg boss అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఉదయాన్నే మోనాల్ దగ్గరకు వెళ్లిన అఖిల్.. ఆమె చేతికి ఉన్న సూదిని చూసి తెగ ఫీల్ అయ్యాడు.. మోనాల్ ఎప్పటిలాగే అఖిల్‌ని తనపైకి లాక్కుని గట్టి హగ్ ఇచ్చేసింది.

వేలు చూపించిన కుమార్ సాయి:

కెప్టెన్‌ సోహైల్‌ కేబినెట్‌ మీటింగ్‌ రేంజ్‌లో.. హౌస్‌మేట్స్‌తో ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడు. అక్కడే కుమార్‌ సాయి, సోహైల్‌కు గొడవ జరిగింది. కెప్టెన్ అంటే గర్జించి ఏదో చేయడం కాదు. మనమంతా ఒక క్యాటగిరినే. అర్ధమవుతుందా? కుమార్ సాయి చేయి చూపిస్తూ మాట్లాడుతుండగా.. సోహైల్ రెచ్చిపోయి వేలు దించు అంటూ ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. దానికి సమాధానంగా ఎంత దించాలి. ఇంత సరిపోతుందా అంటూ కుమార్‌సాయి కౌంటర్‌ ఇచ్చాడు. మెహబూబ్‌ కలజేసుకొని గొడవలు పెట్టుకోవడానికి ఈ మీటింగ్‌ కాదు.

bigg boss హౌస్‌లో ఆరోవారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగానే నామినేట్‌ చేయాలనుకునే వ్యక్తి మెడలో ఎండు మిర్చిల దండ వేసి.. అనంతరం కారణం చెప్పాలి. అరియానాతో నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది.
అరియానా- మెహబూబ్‌, మోనాల్‌
దివి – నోయల్, మెహబూబ్‌
నోయల్ – దివి, అభిజిత్‌
హారిక – అరియానా, కుమార్ సాయి
అభిజిత్ – మెహబూబ్, అఖిల్‌
లాస్య – మెహబూబ్, దివి
మెహబూబ్ – దివి, అరియానా
సొహైల్ – అరియానా, కుమార్ సాయి
అమ్మ రాజ శేఖర్ – లాస్య, అభిజిత్‌
అవినాష్ – దివి, అభిజిత్‌
మోనాల్ – అరియానా, దివి
అఖిల్ – అభిజిత్, అరియానా
కుమార్ సాయి – హారిక, సొహైల్‌

సేఫ్ అయిన మెహబూబ్

ఇలా నామినేట్ చేయగా.. bigg boss హౌజ్ లో చాలామంది మెహబూబ్ నే నామినేట్ చేశారు. bigg boss కెప్టెన్ సొహైల్‌ కు ప్రత్యేక అధికారం ఇవ్వడంతో నామినేట్ అయిన సభ్యుల్లో ఒకర్ని సేవ్ చేసే అవకాశం దొరికింది. అందరూ టార్గెట్‌ చేసిన తన ఫ్రెండ్‌ మెహబూబ్‌ని సేవ్‌ చేశాడు. దీంతో ఈవారం ఎలిమినేషన్‌ నుంచి మెహబూబ్ సేవ్‌ అయ్యాడు. ఈ వారం అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *