బయటకంటే బిగ్ బాస్ హౌస్‌ లోనే హ్యాపీ అనిపించింది.. 10టీవీతో సోహెల్..

బయటకంటే బిగ్ బాస్ హౌస్‌ లోనే హ్యాపీ అనిపించింది.. 10టీవీతో సోహెల్..

Sohel Exclusive Interview: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫైనల్ వరకు వెళ్లి, రూ.25 లక్షలతో వెనుదిరిగాడు సోహెల్.. అతను టైటిల్ గెలవకపోయినా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. తనకి లభించిన రెస్పాన్స్ చూస్తే ఆ విషయం అర్ధమవుతోంది. హౌస్‌లో తన ఎక్స్‌పీరియెన్స్‌ని తాజాగా 10టీవీతో షేర్ చేసుకున్నాడు సోహెల్..

‘‘దాదాపు 123 రోజులు బిగ్ బాస్ హౌస్‌లో గడిపాను.. చిన్న ప్రపంచం.. ఒక రకంగా అక్కడే హ్యాపీగా ఉందనిపించింది.. ఇప్పుడు బాధ్యత కూడా పెరిగింది.. నాకొచ్చిన పేరుని జాగ్రత్తగా కాపాడుకోవాలి.. నెగెటివ్స్‌ని దూరం పెట్టి పాజిటివ్ విషయాలే మాట్లాడతాను.. నేనే వీక్ అనుకున్నా కానీ అందరి పేరెంట్స్ నేను టాప్ 5లో ఉంటానని నా ఫొటో చూపించాక అనిపించింది నాకు..

మా ఇంట్లో ఫ్రీడం ఇస్తారు.. నేను ఎప్పుడు సెటిలవుతానా అని పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు.బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత తెలిసింది.. అరే ఇంత క్రేజ్ ఉంటుందా అని.. నన్ను ఇంతమంది లైక్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు.. వచ్చిన తర్వాత మూడు రోజుల్లో కేవలం 5, 6 గంటలే నిద్రపోయాను.. అన్ని కాల్స్, మెసేజెస్ వచ్చాయి.. ఇప్పుడు బయటకి ఎందుకొచ్చానురా బాబు.. మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిపోదాం అనిపిస్తుంది’’.. అంటూ 10టీవీ లైవ్‌లో చెప్పుకొచ్చాడు సోహెల్..

సోహెల్ ఇంటర్వూ ఇక్కడ చూడండి..