బిగ్‌బాస్ టైటిల్ రాకపోవడమే బెటరా.. సొహైల్ టైటిల్ వదిలేసుకున్నదెందుకు?

బిగ్‌బాస్ టైటిల్ రాకపోవడమే బెటరా.. సొహైల్ టైటిల్ వదిలేసుకున్నదెందుకు?

bigg boss: ఇండియా వ్యాప్తంగా ఫ్యామస్ అయిన బిగ్ బాస్.. తెలుగులో నాలుగో సీజన్ ను పూర్తి చేసేసుకుంది. విన్నర్ ఎవరా అని చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే అంతకంటే ముందు సొహైల్ టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో డ్రాప్ అయ్యాడు. తనకు ప్రైజ్ మనీలో సగం అమౌంట్ రూ.25లక్షలు చాలని వెనక్కు వచ్చేశాడు. ముందుగానే అఖిల్.. తానూ దాని గురించి మాట్లాడుకున్నామని రూ.25లక్షలతో వెళ్లిపోతానని చెప్పాడు.

హోస్ట్ నాగార్జున ఒకవేళ ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం కూడా ఉంది కదా అని అడిగినా సమాధానం చెప్పలేదు. బయటకు వచ్చాక ప్రైజ్ మనీలో రూ.10లక్షలు అనాథాశ్రమానికి ఇస్తా అనడంతో నాగ్.. ‘నేనే ఇస్తాను నువ్వు ఇంటికి రూ.25లక్షలు తీసుకెళ్లాల్సిందే’ అని చెప్పడంతో రూ.35లక్షలు గెలుచుకున్నట్లు అయింది. అయితే టైటిల్ పై ఇంట్రస్ట్ చూపించింది అఖిల్, అభిజిత్ మాత్రమే.

నిజానికి టైటిల్ అంటేనే అంతా భయపడిపోతున్నారు. బిగ్‌బాస్ విజేతలుగా నిలవాలని హౌస్‌లోకి వస్తున్నా.. బిగ్‌బాస్ విన్నర్ టైటిల్‌ రాకపోతేనే మంచిది అనుకుంటున్నారు.

ఇంతకు ముందు బిగ్‌బాస్ మొదటి సీజన్, రెండో, మూడో సీజన్ టైటిల్స్ విజేతలైన శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్‌ల జాడ.. ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.ఇక బిగ్‌బాస్ సీజన్ వన్‌లో గెలిచిన శివ బాలాజీకి సినిమాలో ఏమన్న పెద్దగా పొడించింది ఏమి లేదు. గెలిచాకా రెండు మూడు ఛానెల్స్ తిరిగి వారం రోజులు మాత్రమే కాస్త హడావుడి కనబరిచాడు.

శివ బాలాజీ తర్వాత ఏం చేస్తున్నాడనేది ప్రజలకు తెలియదు. బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లే ముందు కాస్తో కూస్తో సినిమాల్లో కనిపించిన శివ బాలాజీ.. బిగ్‌బాస్ సీజన్ వన్ విజేతగా నిలిచిన తర్వాత ఆ ఛాన్సులు కూడా లేకుండా పోయాడు.