రెచ్చిపోయిన అభి-అఖిల్.. క్యారెక్టర్‌తో ఆడుకోవద్దంటూ మోనాల్ కంటతడి

రెచ్చిపోయిన అభి-అఖిల్.. క్యారెక్టర్‌తో ఆడుకోవద్దంటూ మోనాల్ కంటతడి

నాలుగు వారాలుగా హై రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తున్న BIGGBOSS‌ సీజన్‌ 4.. అసలైన స్టేజికి చేరుకుంది. చిన్నపాటి గొడవలు, బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫన్నీ టాస్కులు, వైల్డ్‌ కార్డు ఎంట్రీలతో వేడెక్కిన షోలో కంటెస్టెంట్లు నిప్పు రాజేసుకుంటున్నారు. మాస్కులు తీసేసి ఒరిజినల్‌ ఆటను ప్రారంభించారు. సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ ఉంటుందనేది తెలిసిందే.




నామినేషన్‌ ప్రక్రియ మొదలైందంటే.. హౌస్‌లో గొడవలు జరగడం సహజం. అదే తరహాలో ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ కాస్త సీరియస్‌గా జరిగింది. అభిజిత్‌ – అఖిల్‌ మధ్య మాటల యుద్దం, మోనాల్‌ భావోద్వేగం, సోహైల్‌ ఫైర్‌ వాటితో ఎపిసోడ్‌ రసవత్తంగా సాగింది.

బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రక్రియ కోసం అందరినీ గార్డెన్‌ ఏరియాలోకి పిలిచాడు. ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి వారి ముఖంపై స్నోను పూయాలని.. అలాగే ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాలు కూడా చెప్పాలని ఆదేశించాడు. ఇంటి కెప్టెన్‌ కారణంగా నామినేషన్‌ నుంచి కుమార్‌ సాయికి మాత్రమే మినహాయింపు లభించింది.




నన్ను ఒరేయ్ అన్నావ్:
అఖిల్‌తో నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. అభిజిత్‌, అమ్మ రాజశేఖర్‌ ముఖాలకు స్నో పూసి నామినేట్‌ చేశారు. ‘ఒరేయ్‌’అన్న విషయంలో హర్ట్‌ అయ్యానని, నేను పర్మిషన్‌ తీసుకొనే అలా అన్నానని అఖిల్‌ చెప్పుకొచ్చాడు. ఏజ్, ఎడ్యుకేషన్ విషయంలో కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదని వాటివల్ల నేను హర్ట్ అయ్యానని ఇక్కడ క్వాలిఫికేషన్ అవసరం లేదని అఖిల్ అన్నాడు. నువ్వు ఒరేయ్ అనడం నాకు నచ్చలేదు.. క్వాలిఫికేషన్ విషయంలో కూడా నీకు క్లారిటీ లేదంటూ అభి వాదించడంతో ఇద్దర మధ్య చాలాసేపు మాటల యుద్దం నడిచింది. అరియానాను కూడా నామినేట్‌ చేశాడు.

షాపింగ్ సరిగా చేయలేదు:
అఖిల్‌ ముఖానికి, అమ్మా రాజశేఖర్‌ ముఖానికి స్నో పూసి నామినేట్‌ చేసింది. లగ్జరీ బడ్జెట్‌ విషయంలో అఖిల్‌ చేసిన షాపింగ్‌ తనకు నచ్చలేదని, ఇంట్లో ఉన్న 16 మందికి పుడ్‌ వచ్చేలా కాకుండా.. కొంతమంది పేర్లు మాత్రమే రాసి మిగిలిన వారికి రాకుండా చేశాడని చెప్పుకొచ్చింది. అమ్మ రాజశేఖర్‌ గురించి చెబుతూ.. వంట చేయడం లేదని అనడం కాస్త బాధగా ఉందని చెప్పింది.




దివి గిన్నెలు కడగదట:
కిచెన్‌లో పాత్రలు కడగమంటే దిని ఆ పని చేయనని చెప్పిందని, అలా చెప్పడం నచ్చలేదని చెప్పింది. హౌజ్‌లో అందరూ అన్ని పనులు చేయాలని గుర్తు చేసింది. నోయల్‌ నామినేషన్‌కు రీజన్‌ చెబుతూ.. లాస్య బావోధ్వేగానికి లోనయ్యింది. గత వారం నాగ్‌ సర్‌ లాస్య ఫేక్‌గా ఉంటుందా అని అడిగి నోయల్‌ ఎస్‌ చెప్పాడని, అందరి కంటే నోయల్‌ అలా చెప్పడం బాధగా ఉందని చెప్పి ఏడ్చేసింది. తనకు ముందు నుంచి తెలిసిన వ్యక్తి అలా అనడంతో ప్రస్తుతం అతనితో సరిగా ఉండలేకపోతున్నానని చెప్పింది.

అరియానా మాటలే అవినాష్ నోటి నుంచి:
అరియానా చెప్పినట్లుగానే లగ్జరీ బడ్జెట్‌ విషయంలో అఖిల్‌ కొందరి పేర్లు మాత్రమే ఇచ్చాడంటూ అవినాష్ ఆరోపించాడు. దీనివల్ల కొంతమంది పస్తులు ఉండాల్సి వచ్చిందని అఖిల్‌ని నామినేట్‌ చేశాడు. సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నావని అనడంతో అవినాష్‌ ఫైర్‌ అయ్యారు. హిట్‌ మ్యాన్‌ గేమ్‌లో సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నానని చెప్పినందుకు మోనాల్‌ని నామినేట్‌ చేశాడు.




సొంతగా ఆడటం లేదు:
కుమార్ సాయి.. నోయల్‌ని నామినేట్ చేస్తూ ఫస్ట్ నామినేషన్ లో చెప్పిన రీజన్‌నే మళ్లీ మళ్లీ చెప్తున్నారని అందుకే తనకు నచ్చలేదని చెప్పాడు. ఇక రెండో వ్యక్తిగా సుజాతను నామినేట్ చేస్తూ.. ఒకరిపై ఆధారపడి ఆడుతుందని.. సొంతంగా ఆడట్లేదని.. నచ్చిన వాళ్ల విషయంలో సెల్ఫిష్‌గా అనిపిస్తున్నారని చెప్పారు.

వాష్ రూం క్లీనింగ్ సరిగా లేదు భయ్యా:
సొహైల్.. అభిజిత్‌ని నామినేట్ చేస్తూ వాష్ రూం క్లీనింగ్‌ విషయంలో నీ ప్రవర్తన నాకు నచ్చలేదని చెప్పాడు. రెండో వ్యక్తిగా నోయల్‌ని నామినేట్ చేస్తూ కాయిన్ టాస్క్ విషయంలో సపోర్ట్ చేస్తాడని అనుకున్నానని కానీ వివాదానికి అతనే కారణం అయ్యాడని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు.




కిచెన్‌లో పనిచేయడం లేదు:
గంగవ్వ.. నోయల్‌ని, అభిజిత్‌ని నామినేట్ చేసింది. అభిజిత్‌ ఎవ్వరితోనూ సరిగా మాట్లాడడు అందుకే నామినేట్ చేసినట్టు చెప్పింది. రాజశేఖర్.. అఖిల్‌, అరియానాలను నామినేట్ చేశారు. లాస్య.. చేసినట్లుగా అరియానా కిచెన్‌లో సరిగా పనిచేయడం లేదని చెప్పారు.

అమ్మాయిల గురించి అభి-అఖిల్ గొడవ:
మొదటి వ్యక్తిగా సోహైల్‌ని నామినేట్‌ చేసిన అభి.. కోపం తగ్గించుకోవాలని సూచించాడు. రెండో వ్యక్తిగా అఖిల్‌ని నామినేట్‌ చేస్తూ గట్టి క్లాస్ పీకాడు. ‘మామాలుగానే నువ్వు కన్ఫ్యూజ్‌ అవుతావని తెలుసు. కానీ పచ్చి అబద్ధం ఆడుతావని ఇప్పుడే తెలుసుకున్నా. కళ్లు ఇలా చేసి, ఇలా చూసి మాట్లాడితే ఎదుటివాడు భయపడడు. యాటిట్యూడ్‌ కూడా నచ్చలేదు, దేనికైనా లిమిట్స్ ఉంటుంది’ అంటూ అభి మాట్లాడుతుండగా.. అఖిల్ రెచ్చిపోయాడు.




ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ ఆమె ఐ లక్ యూ అంటే అదరికీ చెప్పుకోవడమే కాకుండా, సుజాత గురించి కూడా బ్యాడ్‌గా మాట్లాడుతున్నావ్.. ఇది నేషనల్ ఛానల్ ఒక అమ్మాయి గురించి ఇలా చెప్తే బయటకు ఎలా వెళ్తుంది అంటూ ఫైర్‌ కాగా, మోనాల్‌, సుజాత గురించి నీకెందుకని, ఏదైనా ఉంటే వాళ్లతో మాట్లాడుకుంటానని అభి కౌంటర్‌ ఇచ్చాడు.

నాకు ఇద్దరూ ఇష్టమే: మోనాల్‌
అభి, అఖిల్‌ పదే పదే తన పేరు ప్రస్తావించడంతో మోనాల్‌ హర్ట్ అయింది. దయచేసి నా పేరుని తీయకండి. ఐ లైక్ యు అన్నానంటే ఇద్దరూ ఇష్టమే అని.. ఎవరైనా ఇష్టమే అని.. మీరు మీరూ చూసుకోవాలని కాని.. నేషనల్ ఛానల్‌లో నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసి.. జీవితాలతో ఆడుకోకూడదని ప్రతి విషయం టెలికాస్ట్ అవుతుందని.. నా క్యారెక్టర్‌ జడ్జి చేయడానికి మీరు ఎవరు?? అంటూ గట్టిగా అరుస్తూ బోరున ఏడ్చేసింది. గంగవ్వ వెళ్లి మోనాల్‌ను ఓదార్చింది.




మొక్క ఎదగకుండానే పంపించేశారు:
నోయల్.. అమ్మ రాజశేఖర్‌, సోహైల్‌ను నామినేట్‌ చేశాడు. నామినేషన్ అంటే పాయింట్ ఉండాలని.. ఇంటి నుంచి వెళిపోవడానికి సరైనా పాయింట్ ఉండాలని చెప్పాడు. స్వాతిని మాస్టర్‌ అకారణంగా నామినేట్‌ చేశాడని, అతని వల్ల ఒక మొక్క ఎదగకుండానే వెళ్లిపోయిందని అందుకే ఎలిమినేట్ చేస్తున్నట్టు చెప్పాడు నోయల్. అయితే నువ్ స్వాతి విషయం మాట్లాడితే తప్పని అన్నావు.. మరి నువ్ ఇప్పుడు స్వాతి గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అని సొహైల్ పాయింట్ రైజ్ చేయడంతో హర్ట్ అయిన నోయల్ తిరిగి సొహైల్‌నే నామినేట్ చేశాడు.

ఐదోవారం నామినేషన్స్‌లో అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా‌లు నిలిచారు.