బిగ్‌బాస్ వేడుకల్లో నాగవల్లి అందుకే కనిపించలేదా..?

బిగ్‌బాస్ వేడుకల్లో నాగవల్లి అందుకే కనిపించలేదా..?

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌ నుంచి ఫుల్ జోష్ తో ఆరంభమైంది. వేడుకలకు సంబంధించి.. స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోలో కనిపించని దేవీ నాగవల్లి షోలో అయినా కనిపిస్తుందని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఫైనల్ ఈవెంట్‌లోనూ ఎక్కడ ఆమె పార్టిసిపేషన్ లేదు.

హీరోయిన్లు ప్ర‌ణీత‌, మెహ‌రీన్ డ్యాన్సులు, అనిల్ రావిపూడి పంచ్ ప‌టాకాల‌తో షో డ‌బుల్ జోష్‌తో ముందుకు సాగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అంద‌రూ ఒకే వేదికపై డ్యాన్స్ చేశారు. అక్కడ కూడా దేవి నాగ‌వ‌ల్లి ఆచూకీ లేదు. ఇప్ప‌టికే రీ యూనియ‌న్‌లో మోనాల్‌, లాస్య‌, సుజాత‌, గంగ‌వ్వ‌, నోయ‌ల్‌, కుమార్ సాయి, అవినాష్‌, దివి, మెహ‌బూబ్‌, క‌ల్యాణి హౌస్‌లోకి వె‌ళ్లి వ‌చ్చారు. సూర్య కిర‌ణ్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, దేవి నాగ‌వ‌ల్లి మాత్రం వెళ్ల‌లేదు.

లేడీ బిగ్‌బాస్ అవుతానంటూ షోలో ఎంట్రీ ఇచ్చిన దేవి నాగ‌వ‌ల్లి మూడో వారంలోనే ఎలిమినేట్ అయింది. అప్ప‌టివ‌ర‌కు ఆమెతో పెద్ద‌గా క‌లిసిన‌ట్లు క‌నిపించ‌ని ఇంటిస‌భ్యులు దేవి వెళ్లిపోతుంటే మాత్రం కంట‌త‌డి పెట్టుకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కోల్పోయింద‌ని ఎంతోమంది ఫీల‌య్యారు. హౌజ్‌లో ఉన్న రోజులు దేవి బిగ్‌బాస్ నిబంధ‌న‌లను తూచా త‌ప్ప‌కుండా పాటించేది. చాలామంది మొద‌ట్లో రూల్స్ బ్రేక్ చేసి ‌బిగ్‌బాస్ చేత అక్షింత‌లు వేయించుకునేవారు.

ఓ సందర్భంలో ఇంటి స‌భ్యుల నిర్ల‌క్ష్యానికి బిగ్‌బాస్ అంద‌రికీ చివాట్లు పెట్టాడు. క్ష‌మాపణలు చెప్పుకుంటూ కంటెస్టెంట్లు నిల్చొని రెండు చేతులు జోడించారు. అయినప్పటికీ దేవి నాగ‌వ‌ల్లి మాత్రం ఏ త‌ప్పూ చేయ‌లేద‌ంటూ ద‌ర్జాగా కూర్చొని ఉంది. ఏ విష‌యంలోనైనా త‌న‌కంటూ ఓ క్లారిటీ ఉంటుంది. అదే స్పిరిట్‌తో సింగ‌ర్‌, డ్యాన్స‌ర్‌గా త‌న‌లోని కొత్త కోణాల‌ను అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసింది.

‘బిగ్‌బాస్‌ను న‌మ్మి వెళ్లాను. ఓట్లు త‌క్కువ వ‌చ్చాయి, కాబ‌ట్టి ఎలిమినేట్ అయ్యాన‌న్నారు. బ‌య‌ట మాత్రం నాకు ఓట్లు ఎక్కువ వ‌చ్చాయ‌ని చాలామంది అంటున్నారు. నాకంటే వెన‌క ఉన్న‌వాళ్ల‌ను వ‌దిలేసి న‌న్ను ఎలిమినేట్ చేయడం షాకింగ్‌గా ఉంది. నా వ‌ల్ల స్క్రిప్ట్ మారిపోతుంద‌ని న‌న్ను పంపించేసి ఉండొచ్చు’ అని బాధ‌పడింది.

మూడో వారంలోనే ఎలిమినేట్ అవడాన్ని దేవీ నాగవల్లి ఊహించ‌లేక‌పోయింది. బ‌య‌ట‌కు వ‌చ్చాక ఇదే అసంతృప్తిని వెల్ల‌గ‌క్కింది. బిగ్‌బాస్ షో త‌న‌కు ద్రోహం చేసింద‌న్న భావ‌న‌తోనే ఆమె ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు వెళ్ల‌డానికి నిరాక‌రించిందేమోన‌ని నెటిజ‌న్లు చ‌ర్చిస్తున్నారు.