‘బాస్’ గెస్ట్‌గా ‘బిగ్ బాస్’ ఫైనల్ ఈవెంట్‌..

‘బాస్’ గెస్ట్‌గా ‘బిగ్ బాస్’ ఫైనల్ ఈవెంట్‌..

Megastar Chiranjeevi: బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4 మరికొద్ది గంటల్లో ముగియనుంది. డిసెంబర్ 20 ఆదివారం ఫైనలిస్ట్ ఎవరనేది తెలిసిపోతోంది. ఎక్కడ చూసినా అభిజిత్ విన్నర్ అంటూ వార్తలు వస్తున్నాయి. హారిక, అఖిల్, ఆరియానా, సోహైల్ కూడా లిస్టులో ఉన్నారు. టైటిల్ గెలిచేది ఎవరనేది చివరివరకు సస్పెన్స్‌గానే ఉంచుతారు బిగ్ బాస్.

విన్నర్ ఎవరు, ఫైనల్ ఈవెంట్‌కి గెస్ట్ ఎవరు అనే విషయంలో రకరకాల అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. మొన్నటివరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథి అన్నారు.. కట్ చేస్తే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 4’ ఫైనల్ ఈవెంట్‌కి గెస్ట్‌గా రానున్నారని తెలుస్తోంది.

లాస్ట్ సీజన్‌లో కూడా ఫైనల్ ఈవెంట్‌కి చిరు విచ్చేశారు. ఈ వార్త నిజమైతే ఆయన ‘బిగ్ బాస్’ ఫైనల్స్‌కి రావడం ఇది రెండోసారి అవుతుంది. పాపులర్ హీరోయిన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌‌తో ఫైనల్ ఈవెంట్‌ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసిందట స్టార్ మా యాజమాన్యం.

Chiranjeevi - Nagarjuna