బిగ్ బాస్-4 నుంచి మెహబూబ్ అవుట్!!

బిగ్ బాస్-4 నుంచి మెహబూబ్ అవుట్!!

వారమంతా ఎంటర్‌టైన్ చేసినా వీకెండ్‌లో ఒకటే డౌట్. ఫుల్ జోష్ తో దూసుకెళ్లిపోతున్న బిగ్ బాస్-4సీజన్లో ఇప్పటికే ఎలిమినేషన్లు జరిగిపోయాయ్. ఈ క్రమంలోనే ఇక వీకెండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే డౌట్ లో ఉండిపోయారంతా. మన లీకు వీరుల ఇన్ఫర్మేషన్ ను బట్టి మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అవ్వొచ్చని చెబుతున్నారు.




క్యాండిట్లు ఓటింగ్ ద్వారా సేఫ్ అవ్వాలి. కానీ, మెహబూబ్ కు వచ్చిన ఓట్లు తక్కువగా ఉండడంతో ఇక ఎలిమినేషన్ తప్పదంటున్నారు. తొలివారం ద‌ర్శ‌కుడు సూర్య కిర‌ణ్‌, తర్వాతి వారం కరాటే కళ్యాణి ఎలిమినేట్ అవగా.. తర్వాత ఎవరా అని మూడో వ్యక్తి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

టాస్క్‌లంటే చాలు త‌న ప్ర‌తాపం చూపించే మెహ‌బూబ్ ఈ వారంలో త‌న పేరు తానే చెడ‌గొట్టుకున్నాడు. దివి కిడ్నాప్ అయిన‌ప్పుడు లోపల ఎటువంటి హింస‌ జ‌ర‌గ‌క‌పోయినా సినిమా డైలాగులు చెప్పి, క‌న్నీళ్లు కార్చేసి బ‌క‌రా అయ్యాడు. మెహ‌బూబ్ అతి చేశాడ‌ని చాలామంది కామెంట్లు చేశారు. మెహ‌బూబ్‌కు త‌క్కువ ఓట్లు రావ‌డంతో బిగ్ బాస్ హౌజ్ నుంచి సొంతింటికి వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ‌గా కనిపిస్తున్నాయి.