Bigg Boss 4: మనాలీ షూటింగులో మామ.. హోస్ట్‌గా కోడలు!

  • Published By: sekhar ,Published On : October 24, 2020 / 08:24 PM IST
Bigg Boss 4: మనాలీ షూటింగులో మామ.. హోస్ట్‌గా కోడలు!

Bigg Boss 4 – Samantha Akkineni Host:‘కింగ్‌’ నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4కి సంబంధించి గతకొద్ది రోజులుగా రకరకాల వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం హోస్ట్‌ చేస్తున్న నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్‌ కోసం మనాలీలో ఉన్నట్లు అక్కడినుంచి వీడియో ద్వారా తెలిపారు.

మరి ఈ వారం బిగ్‌బాస్‌ని హోస్ట్ చేసేది ఎవరు? గత సీజన్‌లో ఒకసారి ఇలాంటి పరిస్థితే వస్తే సీనియర్ నటి రమ్యకృష్ణ షో ని నడిపించారు (ఒక ఎపిసోడ్).. మరిప్పుడెవరొస్తారు?.. రోజా, సమంత, రమ్యకృష్ణ ఇలా పలువురి పేర్లు కూడా వినిపించాయి సోషల్‌ మీడియాలో.. కట్ చేస్తే.. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ.. నాగ్‌ ప్లేస్‌లో ఈ వారం హోస్ట్ ఈవారం హోస్ట్ చేయబోతున్నది ఎవరో తెలుపుతూ.. స్టార్‌ మా ఓ ప్రోమోను విడుదల చేసింది.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4.. ఈ వారం షోని హోస్ట్ చేయబోయేది.. అక్కినేని కోడలు సమంత. తాజాగా సమంత ప్రోమోని విడుదల చేశారు. అయితే బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు కన్ఫ్యూజ్‌ మాత్రం తప్పలేదు. అదేంటంటే.. వీకెండ్‌లో అంటే శని, ఆది వారాలు హోస్ట్ కనిపిస్తారు. కానీ సమంత ప్రోమోలో ఆమె ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఇక్కడివరకు బాగానే ఉది కానీ మరి శనివారం సంగతేంటి?, సాయంత్రం 6గంటల నుంచి అంటున్నారంటే.. శనివారం, ఆదివారం షో కలిపి.. దసరా స్పెషల్‌గా ఈ షోని ప్లాన్‌ చేశారా?.. ఏమో.. ఇది బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు ఇచ్చిన టాస్క్‌లా అనిపిస్తుందండోయ్.. మామ బదులు కోడలుపిల్ల హోస్ట్ చేయబోతుండడంతో రేపటి ఎపిసోడ్ గురించి ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.