శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Nuthan Naidu Arrested: విశాఖ జిల్లా పెందుర్తిలో బిగ్‌బాస్ సీజన్ 2 కంటెస్టెంట్, నటుడు, దర్శకుడు నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియ శిరోముండనం(గుండు గీయించడం) ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా పరారీలో ఉన్న నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపిలో పోలీసులు అరెస్ట్ చేశారు.


శిరోముండనం కేసులో పరాన్నజీవి దర్శకుడు నూతన్‌ కుమార్‌ నాయుడు పరారీలోనే ఉన్నాడు. అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ముంబైకి వెళ్లడానికి ప్లాన్ వేశాడు. ఈ సమయంలోనే కాల్ డేటా ఆధారంగా పోలీసులు పట్టుకున్నారని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు. అక్కడ నుంచి వైజాగ్‌కు తీసుకొస్తున్నారు. శిరోముండనం కేసులో నూతన్‌ నాయుడు పాత్ర ఉందని తేలిన తరువాత, అన్ని ఆధారాలాతో అతన్ని అరెస్ట్‌ చేశామన్నారు.  మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మాట.నూతన నాయుడు భార్య మధుప్రియ తనకు శిరోముండనం చేయించారని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా మధుప్రియపై ఏ 1గా కేసు నమోదు చేసిన పోలీసులు నూతన్ నాయుడు ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా పేర్కొన్నారు.


భార్యను కేసు నుంచి తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవి రమేష్ పేరుతో నూతన్ నాయుడు చాలామంది అధికారులకు ఫోన్‌చేశాడని పోలీసులు కనిపెట్టారు.

Related Posts