Ali Reza Out From House

బిగ్ బాస్ సీజన్ 3.. అలీ రెజా అవుట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్స్ చేరుకుంది. గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. అందరికి ఎవరు విన్నర్.. విన్నర్ తర్వాత పొజిషన్స్ ఎవరెవరికి దక్కాయి అనేది ఆసక్తిగా మారింది. ఎవరు విన్నర్ అనే విషయం కాసేపు పక్కన పెడితే.. టాప్ 5 ప్లేస్ లో ఉన్న అలీ రెజా మొదటిగా హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ప్రేక్షకుల నుండి టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్, వరుణ్, బాబా భాస్కర్‌ల కంటే తక్కువ ఓట్లు రావడంతో ఫిఫ్త్ ప్లేస్ లో అలీ రెజా ఉన్నాడు

దీనికి ముందు రాశీకన్నా, మారుతీ ఎంట్రీ ఇచ్చారు.. ఇక మారుతీ టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత హౌస్ లో ఉన్న ఐదుగురిలో ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారో వారిని తీసుకురమ్మని మారుతీని, రాశీకన్నాను ఇంట్లోకి పంపించారు నాగ్.

దీంతో వారు ఇంట్లోకి వెళ్లి అందరితో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ తర్వత ఇద్దరూ కలిసి అలీని హౌస్ నుంచి బయటకి తీసుకొచ్చారు. ఇక నాగ్ స్టేజ్ పైకి వచ్చిన మారుతి, అలీ, రాశిలతో మాట్లాడారు. మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రెండో సారి బిగ్ బాస్ హౌస్‌కి ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా..విన్నర్ గా బయటకు రాలేకపోయాడు. మరి నెక్ట్స్ ఫోర్త్ ప్లేస్ లో బయటకు ఎవరు రాబోతున్నారు చూద్దాం.

Related Posts