బల్లితెరపై Big Boss 4 సందడి, కంటెస్టెంట్లు వీరేనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

bigg boss telugu season 4 : తెలుగు టెలివిజన్‌లో వినోదానికి సరికొత్త నిర్వచనం చెప్పిన అతిపెద్ద నాన్ ఫిక్షన్ షో ‘బిగ్‌బాస్’. 2020, సెప్టెంబర్ 06వ తేదీ నాలుగో సీజన్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతి సీజన్‌లో విలక్షణత వచ్చినట్లే.. నాలుగో సీజన్‌కి స్టార్ మా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరింత కొత్తగా ప్రచారాన్ని ప్రారంభిస్తోంది.
ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన ప్రచార చిత్రాన్ని స్టార్ మా విడుదల చేసింది. ఇందులో నాగార్జున.. తాత, కొడుకు, మనవడి పాత్రలతో అలరించడమే కాకుండా.. షో‌పై భారీగా అంచనాలు పెంచేశారు. ఇక ఈ షోకి సంబంధించి ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. 15 మంది కంటెస్టెంట్ల పేర్లు నెట్‌లో వైరల్ అవుతున్నాయి.ఇందులో యూట్యూబ్‌ స్టార్స్‌ దేత్తడి హారిక, గంగవ్వ, యాంకర్లు దేవి నాగవల్లి, లాస్య, జబర్దస్త్‌ ఫేం ముక్కు అవినాష్‌, హీరోయిన్‌ మోనాల్‌ గుజ్జార్‌, దర్శకులు అమ్మ రాజశేఖర్‌, సూర్యకిరణ్‌, నటి కరాటే కళ్యాణి, సింగర్‌ నోయల్‌, జోర్దార్‌ యాంకర్‌ సుజాత, టీవీ నటి తనూజ పుట్టస్వామి, టీవీ నటుడు సయ్యద్ సోహైల్, యాంకర్‌ అరియానా గ్లోరీ, లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ సినిమా హీరో అభిజిత్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఓపెనింగ్ సెర్మనీకి సంబంధించిన షూట్ పూర్తయ్యింది. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు. హోస్ట్ నాగార్జునకి సంబంధించి స్పెషల్ వీడియోతో పాటు ప్రత్యేకంగా సాంగ్ రూపొందించినట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టంగా కంటెస్టెంట్స్‌కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డిజైన్ చేశారు.

Related Posts