Bigg Boss Telugu 3: Siva Jyothi to get eliminated? Here’s what the online poll suggests

బిగ్ బాస్-3 : ఈ వారం ఎలిమినేట్ శివజ్యోతేనా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఫైనల్స్ కు వచ్చింది. షో గ్రాండ్ ఫినాలేకు వారం రోజులే మిగిలి ఉంది. టాప్ 5 ఫినాలే కంటెస్టెంట్స్ ల్లో రాహుల్ సిప్లిగంజ్ నేరుగా చేరుకోగా.. బాబా బాస్కర్ ను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసి ఫినాలే పంపాడు. ఇక మిగిలింది అలీ రెజా, శివజ్యోతి, వరుణ్ సందేశ్, శ్రీముఖి నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే మిగిలిన ముగ్గురు ఫినాలేకు అర్హత సాధిస్తారు. 

ఈ నలుగురిలో ఎలిమినేట్ అనేది చర్చ సాగుతోంది. కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో శ్రీముఖి ఎలిమినేట్ అవుతుందనే ఊహాగానాలు వినిపించాయి. గ్రాండ్ ఫినాలేకి వచ్చేసరికి సీన్ మారిపోయింది. టాప్ 5 నుంచి శివజ్యోతి ఎలిమినేట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. శ్రీముఖి యాక్టివ్ గా ఉండటం, అన్ని టాస్క్ ల్లో మెరుగ్గా ఉండటంతో సేఫ్ అవుతుంది అంటున్నారు. అదే విధంగా ఒకసారి వెళ్లిపోయి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అలీ రాజా కూడా సేఫ్ అంటున్నారు.

మొదటి నుంచి పాజిటివ్ గా.. ఫైనల్స్ విన్నర్ అంటూ వరుణ్ సందేశ్ పై టాక్ ఉంది. సో.. ఇక మిగిలింది శివజ్యోతి. లాస్ట్ 2 వారాల నుంచి జ్యోతి ఆటతీరు, వరుణ్ సందేశ్ తో గొడవ, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఎమోషనల్ అవ్వటం, వాగ్వాదం చేయటం వంటివి చూస్తుంటే ఫైనల్స్ నుంచి శివజ్యోతి ఔట్ అని అంటోంది సోషల్ మీడియా. దీనికితోడు ఓట్లు కూడా తక్కువ వచ్చినట్లు సమాచారం. అయితే బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తే చెప్పలేం. స్క్రీన్ పై చూడాలంటే ఆదివారం (అక్టోబర్ 27) ప్రసారమయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే. 

బిగ్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే శివజ్యోతి అక్క.. ప్రతి విషయంలోనూ ఎమోషనల్ కావడం అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో శివజ్యోతికి వ్యతిరేకంగా శివగంగ పేరుతో ట్రోల్స్ కూడా నడిచాయి. టాప్ 5లో  ఉంటుంది.. ఈసారి విన్నర్ జ్యోతక్క అని కూడా టాక్ నడిచింది. ఎందుకో ఏమోగానీ.. చివరి రెండు, మూడు ఎపిసోడ్స్ నుంచి జ్యోతక్క బాగా వెనకబడింది అనే వాయిస్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు తగ్గేకొద్దీ.. శివజ్యోతిపై పాజిటివ్ టాక్ కూడా తగ్గుతూ రావటం విశేషం. ఉన్నది ఉన్నట్లు చెబుతాను అంటూ సుదీర్ఘమైన శివజ్యోతి వివరణలు కూడా ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ అయినట్లు లేవు. అందుకే ఈసారి భారీగా ఓట్లు తక్కువ పడినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరగొచ్చు.. ట్విస్టులు కూడా బోలెడు ఉండొచ్చు.. ఇప్పటి అయితే శివజ్యోతి ఔట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో ప్రసారమయ్యే బిగ్ బాస్ 3 రియాల్టీ షో.. అక్టోబర్ 28 నుంచి (సోమవారం) రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది. బిగ్ బాస్ రియాల్టీ షో ఫినాలే ఆదివారం (నవంబర్ 3) జరుగనుంది. ఆ రోజే బిగ్ బాస్ 3 విన్నర్ ఎవరో ప్రకటిస్తారు. 

Related Tags :

Related Posts :