Home » బిగ్ బాస్ ఫైనల్లో ఎవరు?: శివజ్యోతి సేఫ్.. వితికా షేరు అవుట్
Published
1 year agoon
By
vamsiబిగ్ బాస్3.. కాస్త సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, గొడవలు, కోపాలు, చాడీలు అంటూ ఓ రేంజ్లో సాగుతుంది. బిగ్ బాస్ హౌస్ ఈ వారం మాత్రం కాస్త సీరియస్‌గా కనిపించింది. 90రోజులు పూర్తి చేసుకుని చివరి రెండు ఎలిమినేషన్లకు చేరకుంది బిగ్ బాస్. రెండు సీజన్ల కంటే ఈ సీజన్లో ఎప్పుడూ లేనివిధంగా వరుణ్ సందేశ్, వితికా షెరూ జంటను పంపించారు నిర్వాహకులు. మోస్ట్ లవబుల్ కపుల్‌గా వరుణ్ సందేశ్, వితికా షెరు ఎంట్రీ ఇవ్వగా.. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికి ఇలాంటి అవకాశం రాకపోగా, తొలిసారి ఈ అవకాశం దక్కింది.
అయితే ఫస్ట్ నుంచి సేవ్ అవుతూ.. వస్తున్న వితికా షేరు చివరి నుంచి రెండవ ఎలిమినేషన్లో బయటకు వచ్చేయక తప్పట్లేదు. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్లో అందరూ ఉండగా.. ఇప్పటికే బాబా భాస్కర్, రాహుల్, శ్రీముఖి సేవ్ అయ్యారు. ఇక నామినేషన్లో వితికా, శివజ్యోతి, వరుణ్ సందేశ్, అలీ రెజా ఉన్నారు. వీరిలో వితికా, అలీ కాస్త వీక్‌గా కనిపిస్తున్నారు అందరికీ.
అయితే బిగ్‌బాస్ నుంచి వస్తున్న లీకులను బట్టి వితికనే చివరికి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ వారం వితికా షేరు, శివ జ్యోతి చివరి రెండు ప్లేస్‌లలో ఉండగా.. శివజ్యోతి సేవ్ అయ్యి, వితికా అవుట్ అయ్యినట్లుగా తెలుస్తుంది. వీరిద్దరి మధ్య చాలా తక్కువ పర్సంటేజ్ గ్యాప్ ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఏది ఏమైనప్పటికీ భార్యభర్తలుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వితికా-వరుణ్‌లు విడిపోయారు. వితికా బయటకు రావడంతో వరుణ్ గేమ్ ఎలా ఆడుతాడు అనే విషయం ఆసక్తిగా మారింది. తొంబై రోజులపాటు జంట విడిపోకుండా, కలిసి నడుస్తూనే, కలిసి ఆడుతూనే ఉన్నారు. వరుణ్ కూడా వితికాను సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు.
ఇప్పుడు ఉన్న ఏడుగురిలో వితిక వెళ్లిపోతే ఇక మిగిలేది ఆరుగురు.. అందులో ఆలీ రీఎంట్రీ.. దీంతో ఫైనలిస్టుల్లో శివజ్యోతి, శ్రీముఖి, రాహుల్, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్ ఉండే అవకాశం ఉంది. ఈ వారం ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం శివజ్యోతి కూడా డేంజర్ జోన్లో ఉంది. అంటే చివరకు శివజ్యోతి, అలీ ఇద్దరు రాబోయే నామినేషన్లో లేకుంటే మాత్రం వీరిద్దరు ఫైనల్‌కు వెళ్తారు.
అనధకారికంగా నిర్వహించే ఓట్లలో కూడా రాహుల్, వరుణ్ టాప్‌లో ఉంటున్నారు. మరోవైపు బాబా భాస్కర్ యాక్టివ్నెస్, కామెడీ, ఈజీగోయింగ్, అందరితో కలివిడితనంతో మొదట్లో టాప్‌లో ఉన్నారు. కానీ చివరకు వచ్చేసరికి గేమ్ మారిపోయింది. దాంతో పాపులారిటీలో వెనకబడ్డాడు. శ్రీముఖికి ఈక్వల్‌గా నెట్టుకుని వస్తున్నాడు.