Hyderabad
బీరు బాటిళ్లతో దాడి ఘటనపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్
బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని
Home » బీరు బాటిళ్లతో దాడి ఘటనపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్
బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని
Published
12 months agoon
By
veegamteamబిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని
బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో బీరు సీసాలతో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బుధవారం(మార్చి 5,2020) అర్థరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్(prism) పబ్ లో గొడవ జరిగింది. కొందరు యువకులు రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి చేశారు. ఈ దాడిలో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలకు గాయమైంది. రక్తస్రావం అయ్యింది. రాహుల్ కింద పడిపోయాడు. సకాలంలో పోలీసులు స్పందించడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాహుల్ చికిత్స తీసుకున్నాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
పబ్ లో గొడవపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. తనపై ఓ యువకుడు బీరు బాటిల్ తో దాడి చేశాడని, తలకు చిన్న గాయం మాత్రమే అయ్యిందని వివరించాడు. ఆసుపత్రిలో కూడా ఇదే విషయాన్ని చెప్పి.. వెంటనే డిశ్చార్జ్ అయ్యాడు రాహుల్ సిప్లిగంజ్. కాగా, ఈ గొడవపై రాహుల్ సిప్లిగంజ్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం చర్చకు దారితీసింది. రాహుల్.. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేది ఆసక్తికరంగా మారింది.
రాహుల్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు:
పబ్ లో రాహుల్ పై దాడి చేసింది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి అని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం దుమారం రేపడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దాడిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పబ్ లో గొడవను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయనున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన ఇద్దరు స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని ప్రిజమ్(PRISM) పబ్ కి వెళ్లాడు. ఒంటి గంట ప్రాంతంలో రాహుల్, యువకులు మధ్య గొడవ జరిగింది.
రాహుల్ వెంట వచ్చిన అమ్మాయిని వేధించారు?
ఈ గొడవకు సంబంధించి రెండు వర్షన్లు వినిపిస్తున్నాయి. రాహుల్ స్నేహితులు ఒకలా, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి మరోలా చెబుతున్నారు. రాహుల్ వెంట పబ్ కి వచ్చిన అమ్మాయి పట్ల కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. ఆ యువకులను రాహుల్ నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అరగంట పాటు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇరు వర్గాలు దాడులకు దిగాయి. రితేష్ రెడ్డి బీరు సీసాలతో రాహుల్ పై దాడి చేశాడు. ఈ దాడిలో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది మొదటి వర్షన్.
రాహుల్ అనుచితంగా ప్రవర్తించాడు?
ఇక రెండో వర్సన్ విషయానికి వస్తే.. రాహులే తమను వేధించాడని ఎమ్మెల్యే రోహిత్ సోదరుడు రితేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రతిఘటించడంతో గొడవ మొదలైందన్నాడు. ఇది రెండో వర్షన్. దాడిలో తీవ్రంగా గాయపడినా కేసు పెట్టకుండానే రాహుల్ వెళ్లిపోవడం ఈ ఆరోపణలకు బలాన్ని ఇస్తోంది. ఇలా రెండు వర్షన్లు వినిపిస్తుండటంతో.. రాహుల్ పై దాడి ఘటన చర్చనీయాంశంగా మారింది. అసలు తప్పు ఎవరిది? ఎవరు ఎవరిని వేధించారు? ఎవరు అనుచితంగా ప్రవర్తించారు? దాడికి అసలు బాధ్యులు ఎవరు? గొడవకు కారణం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పబ్ లోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గొడవకు కారణం తెలుసుకునే పనిలో పడ్డారు.
See More :
* రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి చేసింది ఎమ్మెల్యే బంధువులు, కారణం ఇదే
* బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి ఘటనలో ట్విస్ట్
జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడు దాడి : బైక్ సైలెన్సర్ తీసేసి మితిమీరిన శబ్దంతో బైక్ నడుపుతూ రచ్చ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాలపై పులుల దాడులు.. భయాందోళనల్లో ప్రజలు
మహబూబ్‌నగర్ జిల్లాలో సర్పంచ్ దాష్ఠికం : అక్రమాలను ప్రశ్నించినందుకు యువకుడిపై దాడి
తిండికి తిమ్మరాజులు.. పనికి పోతరాజులు.. మన ‘జాతిరత్నాలు’..
చలసాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మహత్య
ఎన్నికల్లో ప్రత్యర్థికి ఓట్లు వేయించారని..గ్రామ సేవకుడి కుటుంబంపై వైసీపీ నేతలు దాడి