లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Bigg Boss 4

‘నోర్మూయ్ హారిక.., మోర్ కావాలి కదా అందుకేనేమో’

Published

on

bigg boss 4: బిగ్‌బాస్ సీజన్ 4లో మిగిలిన నామినేషన్స్‌ కంటే 9వ నామినేషన్స్ కాస్త భిన్నంగా సాగుతోంది. ప్రతివారం మొదటి రోజు సోమవారం మాత్రమే నామినేషన్ పక్రియ జరుగుతుండగా.. ఈ సారి రెండో రోజు కూడా కొనసాగింది. సోమ‌వారం గ‌రంగ‌రంగా ప్రారంభ‌మైన నామినేష‌న్ ప్ర‌క్రియ మంగళవారానికి పీక్స్‌కు చేరింది. 58వ ఎపిసోడ్‌లో అరియానా, అభిజిత్, సొహైల్‌, అవినాష్, అభిజిత్ లు తమ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.

సోమవారం ఎపిసోడ్‌లో అవినాష్‌ను నామినేట్ చేస్తూ గుడ్డు పగలగొట్టిన అభిజిత్.. రెండో గుడ్డును మాస్టర్ తలపై పగలగొట్టి నామినేట్ చేశాడు. దాంతో ఇద్దరి మధ్య ఓ రేంజ్‌లో వార్ జరిగింది. నామినేషన్స్ సందర్భంగా నోయల్‌ ఇష్యూని హైలెట్ చేశాడు అభిజిత్.మాస్టర్ పై అభి ఫైర్:
‘మాస్టర్ మీరు ఎదుటి వాళ్లని అంటారు కానీ, తిరిగి అంటే రిసీవ్ చేసుకోలేరు. నోయల్ ఎవర్నో నామినేట్ చేస్తే అరగంట నిలబెట్టి క్లాస్ పీకారు. కాలు నొప్పి ఉన్నా అలాగే విన్నాడు’ అని అభిజిత్ చెప్తుండగా.. ‘తనని ఒంటికాలిపై నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని అసలు వాడెవడు నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి.. నేను ఈ విషయాన్ని వదిలేద్దాం అనుకున్నా.. కానీ నువ్ కెలికావ్’ అంటూ మధ్యలోనే అడ్డుతగిలాడు అమ్మా.

దీంతో నన్ను మాట్లాడనీయండి మాస్టర్ అంటూ అభిజిత్.. ‘మీరు చెప్పిందే తప్ప ఎదుటివారిని చెప్పనివ్వరు.. ఈ రీజన్‌తోనే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా’ అని చెప్పాడు అభిజిత్. దీంతో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది.

అభి-అమ్మా మధ్యలో అవినాశ్:
నోయల్ మా పొట్టకొట్టడానికి ప్రయత్నించాడు. . వాడ్ని నువ్ సపోర్ట్ చేస్తున్నావ్ అంటూ అమ్మా రాజశేఖర్ సీరియస్ అయ్యాడు. మధ్యలో అవినాష్ ప్రస్తావన రావడంతో అవినాష్ కూడా ఇన్వాల్వ్ కావడంతో రచ్చ మరింత పెరిగింది.

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఫ్యామిలీ స్పందన


నోర్మూయ్ హారిక:
అభిజిత్‌ని టార్గెట్ చేసేసరికి సీన్‌లోకి హారిక ఎంట్రీ ఇచ్చింది. అవినాష్ నువ్వు ఎందుకు వచ్చావ్ అని హారిక పైకి లేచి రావడంతో.. రాజశేఖర్ మాస్టర్‌కి చిర్రెత్తికొచ్చింది.

‘నువ్ నోర్ముయ్.. నీకేంటి సంబంధం’అంటూ హారికపై ఫైర్ అయ్యారు. మొదట నుంచి అభిజిత్‌ని చిన్న మాట అనేసరికి దూసుకొచ్చేస్తున్న హారికకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు మాస్టర్. అక్కడితో వాదన మాత్రం ఆగలేదు. ఆ తరువాత కూడా.. అభిజిత్-మాస్టర్‌ల మధ్య గొడవ పెద్దదైంది.

కుర్చీలో కూర్చోవడం కాదు:
నేను కష్టపడి వచ్చా.. నీలా కాదు.. అని మాస్టర్ అంటే నేనూ కష్టపడుతున్నా అని అభిజిత్ చెప్పాడు.. ఏం కష్టపడుతున్నావ్.. కుర్చీలో కూర్చుని సొల్లు కబుర్లు చెప్పడం కాదు.. ఒక్క టాస్క్ అయినా ఆడావా? ఇప్పటివరకూ అని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు అమ్మా.

నేను హర్ట్:
అనంతరం నేను నామినేట్ చేయను.. వీళ్లంతా నన్ను బయటకు పంపడానికి ప్లాన్ చేశారు అంటూ అలిగి లోపలికి వెళ్లిపోయారు మాస్టర్. ఆ తరువాత సొహైల్, మెహబూబ్‌లు బ్రతిమాలి బయటకు తీసుకొచ్చారు.

అభిని ఫాలో అయిపోతూ:
ఈ నామినేషన్స్‌లో హారిక వంతు రావడంతో అభిజిత్‌ని ఫాలో అయిపోతూ.. మొదటి గుడ్డును అవినాష్‌ తలపై కొట్టి నామినేట్ చేసింది హారిక. నువ్ నా హైట్ గురించి మాట్లాడటం నాకు నచ్చలేదు.. మొన్న నాగార్జున ముందు కూడా నువ్ నా హైట్ గురించి మాట్లాడావు అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది హారిక.

ఇక రెండో గుడ్డు అభిజిత్ మాదిరే అమ్మా రాజశేఖర్ తలపై కొట్టింది. నేను మొదట మోనాల్‌ని నామినేట్ చేద్దాం అనుకున్నా కానీ.. మీరు నన్ను నోరు మూయ్ అన్నారు అందుకే నామినేట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది హారిక. అయితే ఈ ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.

కాపీ కొట్టిన లాస్య:
నోయల్ బ్యాచ్‌లోని హారిక, అభిజిత్‌లు అవినాష్‌ని నామినేట్ చేయగా.. మిగిలిన లాస్య కూడా అవినాష్ తలపై గుడ్డు కొట్టి ఒకే మాట.. ఒకే ఆట అన్నట్టు చేసింది. ఇక రెండో గుడ్డును మోనాల్‌ తలపై కొట్టింది లాస్య.

ఇక మోనాల్ వంతు రావడంతో గుడ్డు కొట్టడం ఇష్టం లేని మోనాల్ అవినాష్ హెల్ప్ తీసుకుంది. మొదటి గుడ్డును సొహైల్ తలపై కొట్టించింది. రెండో గుడ్డుని లాస్యపై కొట్టించింది మోనాల్.

టచ్ చేయొద్దనుకున్నా:
రాజశేఖర్ మాస్టర్.. రెండో ఆలోచన లేకుండా అభిజిత్ తలపై గుడ్డు కొట్టాడు. మాస్టర్ తన తలపై గుడ్డు పగలకొట్టుతుంటే.. ఇది మీ ఆశీర్వాదం మాస్టర్ అని అన్నాడు అభి. ‘అసలు నీ తలను నేను టచ్ చేయకూడదని అనుకున్నా.. కానీ తప్పలేదు.. నా ఆశీర్వాదం నీకు ఉండదు. నువ్ నోయల్ కోసం ఆట ఆడుతున్నావ్.. నీ కోసం నువ్వు ఆడు.. వెళ్లిపోయిన వాడు స్వాతి కోసం ప్రామిస్ చేశానని నన్ను నామినేట్ చేశాడు.. ఇప్పుడు నువ్ వాడికి ప్రామిస్ చేసి నన్ను నామినేట్ చేశావ్’ అంటూ మళ్లీ గొడవకు దిగారు మాస్టర్. ఇక రెండో గుడ్డును అఖిల్‌ తలపై కొట్టారు మాస్టర్. తనని నామినేట్ చేసినందుకు తిరిగి నిన్ను చేస్తున్నట్టు చెప్పాడు అమ్మా రాజశేఖర్.

మెహబూబ్ ప్రతివారం తనను నామినేట్ చేస్తూ వస్తున్న హారికను నామినేట్ చేసే అవకాశం రావడంతో.. మెహబూబ్ ఫస్ట్ గుడ్డుని హారిక తలపై కొట్టి నామినేట్ చేశాడు. రెండో గుడ్డును అవినాష్ తలపై కొట్టాడు.

అఖిల్.. మొదటి గుడ్డుని మాస్టర్‌కి కొట్టి.. నామినేట్ చేశాడు. మీరు ఈ నామినేషన్‌లో నా టాపిక్‌తో పాటు అభి, మోనాల్‌లను కూడా తీసుకువచ్చారు. నాగార్జున సార్ ఒకసారి చెప్పినా కూడా మీరు మళ్లీ అదే టాపిక్ తీసుకువచ్చారు కాబట్టి.. మిమ్మల్ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు అఖిల్.

ఆ తరువాత రెండో గుడ్డును మోనాల్ తలపై కొట్టి అందరికీ షాక్ ఇచ్చాడు అఖిల్. ‘నీ తలపై గుడ్డు కొట్టాలని కూడా లేదు.. నిన్ను నామినేట్ చేస్తానని కూడా తెలియదు’ అంటూ మోనాల్ తలపై గుడ్డు కొట్టి నామినేట్ చేశాడు అమర ప్రేమికుడు అఖిల్.

మోనాల్‌కి క్లారిటీ లేదట:
లాస్ట్ టాస్క్‌లో నువ్ సరిగా పెర్ఫామ్ చేయలేదు.. లైఫ్‌లో ఒక క్లారిటీ ఉండాలి.. ఆ క్లారిటీ నీలో మిస్ అవుతుంది. లైఫ్‌లోనే మిస్ అవుతున్నప్పుడు గేమ్‌లో చాలా మిస్ అవుతుంది. ఆ క్లారిటీ వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నీకసలు క్లారిటీ లేదు.. కన్ఫ్యూజ్‌లేదు.. ఆనందంలో చేస్తావో.. కోపంలో చేస్తావో తెలియదు.. నిన్ను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నా కానీ.. అసలు నీకే క్లారిటీ లేనప్పుడు నాకేం క్లారిటీ వస్తుంది’ అంటూ మోనాల్‌ని నామినేట్ చేసేశాడు అఖిల్.

బిత్తరపోయిన మోనాల్ ఏం చేయాలో తెలియక ఏడుపు మొఖం పెట్టింది. ‘నువ్వు అనుకుంటున్నావ్.. నేను కన్ఫ్యూజ్‌లో ఉన్నానని.. ఆ విషయంలో నన్ను టార్గెట్ చేయకు.. అది నీ అభిప్రాయం ’ అని సమాధానం ఇచ్చింది మోనాల్.

అంతా షాక్:
ప్రపంచవింతను చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయారు ఇంటి సభ్యులు.. రాజశేఖర్ మాస్టర్ అయితే.. వాడేంట్రా మోనాల్‌ని నామినేట్ చేస్తున్నాడు.. తప్పురా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు రాజశేఖర్ మాస్టర్. ఇక హాట్ హాట్‌గా సాగిన 9వవారం నామినేషన్‌లో… అవినాష్, రాజశేఖర్, అభిజిత్, హారిక, మోనాల్‌‌లు నామినేట్ అయ్యారు.

అమ్మా ఓదార్పు:
సోమవారం నామినేషన్ ప్రక్రియలో అఖిల్.. మోనాల్‌ను నామినేట్ చేయడంతో షాక్‌కి గురి అయి అమ్మా రాజశేఖర్ దగ్గరకు వచ్చింది. ఇక ఇదే అవకాశంగా రాజశేఖర్ ఆమెకు హితోపదేశం చేయడం మొదలుపెట్టాడు. ‘నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా.. ప్లే యువర్ గేమ్ అని.. కానీ నువ్ వాడి కోసం నామినేట్ అయ్యావ్.. ఇప్పుడు వాడే చేశాడు.. నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది. నేను హౌస్‌లో ఉన్నన్నాళ్లు నీకు సపోర్ట్‌గా ఉంటా.. గేమ్ ఆడలేదని నామినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పడంతో.. మోనాల్ తనను అఖిల్ ఎందుకు నామినేట్ చేశాడో ఓపెన్ అయ్యింది.

ఇంకా కావాలి కదా అందుకే:
నేను ఎవర్ని నమ్మినా ఇలాగే చేస్తున్నారు.. అమ్మాయితో ఫ్రెండ్ షిప్ అంటే వేరే మీనింగ్ ఉంటుంది.. అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు.. కొంచెం మోర్ కావాలి కదా.. ఆ మోర్ లేదు కదా.. అదే అఖిల్ ప్రాబ్లమ్ అందుకే నామినేట్ చేశాడు. ఈ హౌస్‌లో అందరికీ గ్రూప్‌లు ఉన్నాయి.. నేను ఒక్కదాన్నే ఉండిపోయా. కానీ నాకు ప్రాబ్లమ్ లేదు.. ఇక నుంచి గట్టిగా మాట్లాడతా అంటూ ఒంటరిగా కన్నీళ్లు కార్చింది మోనాల్.

అవ‌మానాలు ప‌డి వ‌చ్చా: అవినాష్‌
ఇంత‌వ‌ర‌కు ప‌డ్డ క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరు అయ్యింద‌ని అవినాష్ బాధ‌ప‌డ్డాడు. ఎన్నో అవ‌మానాలు ప‌డి వ‌చ్చాను. మ‌ళ్లీ ఆ షో(జ‌బ‌ర్ద‌స్త్‌)లోకి తీసుకోమ‌ని చెప్పారు. అవ‌న్నీ గుర్తొచ్చాయ‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ త‌న‌లాగే ఇక్క‌డ అంద‌రూ స్ట్రాంగ్‌గా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంద‌న్నాడు. మ‌రోవైపు అఖిల్ చేసిన మోసానికి మోనాల్ కుంగిపోయింది. నేను హ‌ర్ట్ అయ్యాను అఖిల్, నువ్వు న‌న్ను న‌మ్మ‌నందుకు బాధ‌ప‌డుతున్నాన‌ని ఒంటరిగా త‌న క‌న్నీళ్ల‌ను జార‌విడిచింది.

నామినేష‌న్‌లో ఉన్న‌వారికి బిగ్‌బాస్ ఆఫ‌ర్‌
ఇమ్యూనిటీ పొంది సేవ్ అయ్యేందుకు బిగ్‌బాస్‌ “ముఖం జాగ్ర‌త్త” అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా నామినేట్ అయిన వాళ్లు టీ స్టాండ్ మీద ముఖం పెట్టాలి. ఎండ్ బ‌జ‌ర్‌కు ఎవ‌రి త‌ల స్టాండ్ మీద ఉంటే వారు నామినేష‌న్ నుంచి సేఫ్. చివరి వరకూ ఉండడానికి నామినేషన్లో ఉన్న సభ్యులు అందరూ ప్రయత్నించగా మిగిలిన వారు వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. చివరికి ఒకరి కంటే ఎక్కువ మంది ఉండటంతో ఆ ఆఫర్ ను కూడా కోల్పోయారు కుటుంబ సభ్యులు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *