లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Bigg Boss 4

గంగవ్వను లైట్‌గా తీసుకోవద్దు, బిగ్‌బాస్ ఫైనల్ కెళ్లే ప్లాన్ రెడీ

Published

on

Bigg Boss 4 Telugu : Gangavva అచ్చమైన పచ్చని పల్లెటూరి అమాయకత్వం ఆమె సొంతం. విలేజ్ షోలో అవతలి వ్యక్తి ఏం చెప్తే అది చేసుకుపోయే బోళాతనమే ఆమెకు తెలుసు. అక్షరాల రూపంలో నేర్చుకున్నదానికంటే జీవితంలో ఎదురైన పాఠాలతోనే పరిచయం ఎక్కువ.

తికమకపెట్టే టాస్క్‌లు ఆమెకు తెలీదు.. మైండ్ గేమ్స్ అంతకంటే తెలీదు. ఏం అనుకుంటుందో అది చెప్పడం. ఏం చేయాలనుకుంటుందో అది చేసేయడం .. అదే గంగవ్వ స్పెషాలటీ. ఇపుడు ఇవే బిగ్‌బాస్ ప్రేక్షకులకు గంగవ్వను దగ్గర చేశాయి. కాకపోతే ఆమె వెనుక ఓ టీమ్ ఉందని.. వాళ్లు అహోరాత్రులు కష్టపడైనా మా అవ్వను విన్నర్ను చేస్తామని తిరుగుతున్నారని కొద్ది మందికే తెలుసు..

మొదట్లో Gangavvaను చూసిన వారంతా అవ్వకు ఏం తెలియదు. అమాయకురాలు అనుకున్నారు. నిజమే ఆమెకేం తెలియదు. నిజంగానే అక్కడేం చేయాలో కూడా క్లారిటీ లేదు. అందరిలా ఆమెకు రాజకీయాలు చేయడం రాదు.. అక్కడ స్టైల్‌గా ఉండటం తెలియదు. అందరితో కలిసిపోవడం ఎక్కడా నేర్చుకోలేదు.Gangavva BiggBoss రూల్స్ కూడా పట్టించుకోదు. మనసులో ఏం ఉంటే అది కుండలు బద్దలు కొట్టేలా చెబుతుంది. ఎవరు ఏమనుకున్నా.. తాను చెప్పాలనుకుంది మాత్రం చెప్పేస్తుంది. అంతే వేగంగా ఎదుటవాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటే తట్టుకోలేక వాళ్లతోపాటే ఏడ్చేస్తుంది. సరిగ్గా ఆ పల్లె అమాయకత్వానికే ఆమెకు రోజురోజుకు ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. ఎలిమినేషన్లో ఉన్న ఆమెకు ఓట్లు మీద ఓట్లు గుద్దుతున్నారు.BiggBoss show కు Gangavva కంటెస్టెంట్ అని నాగ్ ప్రకటించగానే.. చాలామంది ఎవరీ గంగవ్వ అని విచిత్రంగా చూశారు. కొద్ది మంది యూట్యూబర్స్కు తప్ప మిగిలిన వాళ్లు మిగతా సభ్యులూ ఈమెనూ కొత్తగానే చూసారు. కొద్దిరోజుల్లోనే తనేంటో ..తనెలా ఉంటుందో చూసిన BiggBoss ప్రేక్షకులు.. ఆమె కోసమే ప్రొగ్రామ్ ను చూడటం ప్రారంభించారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆమె అందరిని ఎంత దగ్గర చేసుకుందో.

స్వచ్ఛమైన పల్లెటూరి అమాయకత్వం, ఏమీ తెలియని బోళాతనంతో.. ఈ తరం వారికి కొత్తగా ఉండే కట్టూబొట్టూతో ఇప్పటికే ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది గంగవ్వ.నిజంగా BiggBoss తనకు నచ్చినట్లుగా తాను ఉంటుంది గంగవ్వ. BiggBoss కూడా ఈమెకు అలాంటి వెసలుబాటు ఇచ్చాడు.ఆమెకు సపరేట్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఇటు ఏ కష్టం రాకుండా చూసుకోవాలంటూ మిగిలినవాళ్లకు చెప్పాడు నాగార్జున. ఆమెకేం కష్టమొచ్చినా మీ తాట తీస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు నాగ్.

Telugu Bigg Boss – 4 : ఎలిమినేట్ అయ్యేది ఎవరో


ఇదిలా ఉంటే BiggBoss అవ్వ మాత్రం మంచి ప్లాన్‌తోనే వచ్చింది. అది ఆమె వేసిన ప్లాన్ మాత్రం కాదు. ఈ షోకు రాక ముందే గంగవ్వకు సోషల్ మీడియాలో భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. మై విలేజ్ షోకు చాలా పాపులారిటీ.

అక్కడ ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ కూడా చేసింది గంగవ్వ. మై విలేజ్ షోకు వచ్చి తమ సినిమాల ప్రమోషన్ చేయించుకున్నారు. అలా సోషల్ మీడియాలో గంగవ్వకు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది.గంగవ్వకు తెలియకుండానే బయట ఓ సామ్రాజ్యమే వచ్చేసింది. గంగవ్వ ఆర్మీ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆమెకు గుంపగుత్తగా ఓట్లు గుద్దేస్తున్నారు. ఏ కంటెస్టెంట్‌కు లేని సోషల్ మీడియా ఫాలోయింగ్ గంగవ్వకు ఉంది. అందుకే ఆమెకు ఏం తెలియకపోయినా ఆమె వెనక మాత్రం ఫస్ట్ డే నంచి ఓ టీం పని చేస్తుంది.

మై విలేజ్ షో అనిల్ ..ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడట. BiggBossలోకి అడుగు పెట్టిన గంగవ్వను విన్నర్ చేసేదాకా శ్రమిస్తామంటున్నాడట.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *