బిగ్‌బాస్ రెమ్యూనరేషన్‌లో మామను మించిపోయిన సమంత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Samanta సినిమా హీరోయిన్‌గానే కాదు యాంకర్‌గానూ టాప్ అనిపించుకుంది. తెలుగులో టాప్ రియాలిటీ షోకు యాంకర్ గా వ్యవహరించి.. అత్యధిక రెమ్యూనరేషన్ ను అందుకుంది. దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో కనిపించిన సమంత.. ఏ మాత్రం బోర్ కొట్టకుండా వ్యవహరించింది.

కంటెస్టెంట్ల సీక్రెట్లు, వారి రిలేషన్ గురించి అన్నింటినీ తెలుసుకుని అడుగుపెట్టిన ఆమె.. సమయానుగుణంగా పంచ్ లు విసురుతూ ఆకట్టుకుంది. జూ.ఎన్టీఆర్, నాని, నాగార్జునలు సీజన్ మొత్తం హోస్ట్ గా వ్యవహరించగా ప్రత్యేక ఎపిసోడ్ లో రమ్యకృష్ణ తర్వాత సమంతానే బిగ్ బాస్ హోస్ట్ గా వచ్చారు.మూడు గంటల ఎపిసోడ్‌లో కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, హైప‌ర్ ఆదిలాంటి సెల‌బ్రిటీల సాయంతో షోను హిట్ చేశారు. అలా ద‌స‌రా ఎపిసోడ్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్ చేసిన స‌మంత‌నే మిగ‌తావారాల‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తే బాగుంటుందని బిగ్ బాస్ మేనేజ్మెంట్ అడుగుతుందట.

వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ప్ర‌స్తుతం నాగర్జున హిమాల‌యాల్లో 21 రోజులు ఉండ‌బోతున్నారు. అందుకే బిగ్‌బాస్ బాధ్య‌త‌ను కోడ‌లుపిల్ల సామ్ భుజాల‌పైన వేశారట. ఈ క్ర‌మంలోనే ద‌స‌రా ఎపిసోడ్‌ను క‌లుపుకుని మొత్తంగా 5 ఎపిసోడ్ల వరకూ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం బిగ్‌బాస్ టీమ్ నుంచి సామ్‌ రూ.2.10 కోట్లు వరకూ వసూలు చేస్తున్నట్లు టాక్.

అంటే ఎపిసోడ్‌కు రూ.40 ల‌క్ష‌లు పైనే. ఓ సినిమాకు తీసుకోవాల్సినంత రెమ్యూన‌రేష‌న్‌ను బిగ్‌బాస్ నుంచే వ‌సూలు చేస్తోంద‌న్న‌మాట‌. పారితోషికం విష‌యంలో మామ కంటే కోడ‌లే ముందుంది. నాల్గో సీజ‌న్ మొత్తానికి గానూ ఎనిమిది కోట్ల రూపాయ‌లను నాగ్ తీసుకుంటుంటే స‌మంత కేవ‌లం మూడు వారాల‌కే 2 కోట్లకు పైగా అందుకుంటూ మామ‌ను మించిన కోడ‌లు అనిపించుకుంది.

Related Tags :

Related Posts :