లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

బిగ్‌బాస్‌లో బాలుకి ఘన నివాళి: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

Published

on

BiggBossTelugu4 Tribute To SPB గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు ఎస్పీ బాలు మృతికి సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్పీ బాలును గుర్తు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటుండగా.. తెలుగు బిగ్‌బాస్ షో లో బాలు గారిని గుర్తు చేసుకుంటున్నారు.లోపల ఉన్న బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు నేటి ఎపిసోడ్‌లో ఈ బాధాక‌ర‌మైన విష‌యాన్ని కింగ్ నాగార్జున తెలియజేయబోతున్నారు. నేటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అంద‌రి చేతా బాలుకు నివాళుల‌ు అర్పించ‌నున్నారు. ఈ మేర‌కు ఓ ప్రోమో వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఎస్పీ బాలు చిత్రానికి నాగార్జున‌ నివాళులు అర్పిస్తూ కనిపించారు.

“ఆ స్వ‌రం ఇక ప‌ల‌క‌ద‌ని, ఆ వ‌రం మ‌న‌కిక‌ లేద‌ని స‌రిగ‌మ‌లు క‌న్నీళ్లు పెట్టాయి. రాగాల‌న్నీ బాధ‌ప‌డ్డాయి. దాచుకో స్వామి.. దాచుకో, మా బాలును జాగ్ర‌త్త‌గా దాచుకో” అంటూ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఈ ఉద్వేగ‌భ‌రితంగా ఉంది.Bigg Boss 4 elimination: ఇక ఇదిలా ఉంటే ఈ వారం హౌస్ నుంచి మూడో ఎలిమినేషన్ ఉండబోతోంది. ఈ వారానికి గానూ మోనాల్, లాస్య, దేవి, కుమార్ సాయి పంపన, మెహబూబ్, అరియానా, హారికలు ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ఈ క్రమంలో ముందుగా వస్తున్న లీక్‌ల ప్రకారం.. మెహబూబ్‌ దిల్ సే ఈ వారం ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది.

మొదట్లో మెహబూబ్‌పై పెద్దగా నెగిటివ్ లేనప్పటికీ.. ఉక్కు హృదయం టాస్క్‌లో‌ ఓవరాక్షన్‌ చేయడంతో అతనిపై నెగెటివిటీ బాగా వచ్చేసింది. ఈ క్రమంలోనే అతనికి బాగా ఓటింగ్ తక్కువగా పడినట్లు అర్థం అవుతుంది.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *