లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

వైట్ కాలర్ జాబ్ మార్కెట్లో భారీగా పెరిగిన ఉద్యోగ నియామకాలు

Published

on

white-collar job market : కరోనా సంక్షోభంతో ప్రధానంగా ఐటీ సహా ఇతర రంగాల సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా అనేక కంపెనీలు తమ ఉద్యోగాల్లో కోత విధించాల్సి వచ్చింది. రానురాను లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా ఎత్తివేయడంతో పలు టాప్ కంపెనీలు, ఇతర స్టార్టప్ కంపెనీల్లో వైట్ కాలర్ ఉద్యోగ నియమాకాలు భారీగా పెరిగాయని కంపెనీ డేటా సర్వేలో వెల్లడైంది.క్యాప్ జెమిని, వర్ల్ పూల్, టాటాస్టీల్, వేదాంత, ఫిలిప్స్, నెస్లే, డెలాయిట్, లివ్ స్పేస్, పెప్సికో, మైంత్రా సహా పలు కంపెనీల్లో గత నెలగా భారీగా నియామకాలు జరిగాయి. టాప్ లెవల్ నుంచి ఎంట్రీ లెవల్ ఉద్యోగాల వరకు అన్ని స్థాయిల్లో ఉద్యోగ నియామకాలు జరిగాయని సర్వే డేటా వెల్లడించింది. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో స్టార్టప్ కంపెనీలు బాగా దెబ్బతిన్నాయి. జూలై-అక్టోబర్ కాలంలో ఇంటర్నెట్ కంపెనీల్లో భారీగా నియామకాలు జరిగాయి.

అందులో ప్రత్యేకించి అతిపెద్ద కంపెనీలు అయిన యూనికార్న్, సూనీ కార్న్స్ కంపెనీల్లో నియామకాలు జరిగాయి. సర్వే ప్రకారం.. 80 స్టార్టప్ కంపెనీల్లో Xpheno ద్వారా నియామాకాలు జరిగాయి. అందులో పేటీఎం, బైజు డెల్హివెరీ, ఉడాన్, పోన్ పే, అన్ అకాడమీ, బిగ్ బాస్కేట్, జొమాటో మీడియా, వేదంతా సహా ఇతర కంపెనీలు ఉన్నాయి.వాస్తవానికి స్టార్టప్ కంపెనీల్లో వార్షిక ఉద్యోగాల వృద్ధి 20 శాతానికి ఎక్కువగా పెరిగింది. అత్యధికంగా నియామకాల వృద్ధి డిజిటల్ కంటెంట్ లోనే పెరిగిందని సర్వేలో తేలింది. డిజిటల్ కంటెంట్‌లో అత్యధిక నియామక వృద్ధితో పోల్చి చూస్తే, ఇంటర్నెట్ కంపెనీల్లో 2019లో వార్షిక నియామక వృద్ధి 14శాతం మేర పెరిగింది. అక్టోబర్ 2019 నుంచి 2020 కాలానికి మొత్తంగా 40వేల ఉద్యోగాలను ఆఫర్ చేశాయి. బ్రిక్స్ మోర్టార్, క్యాప్ జెమినిలో 2020 మొదటి భాగంలో 9,500 మందిని నియమించింది.

మరోవైపు నెస్లే కంపెనీ తమ కంపెనీలో ఫ్యాక్టరీలు, బ్రాంచులు, హెడ్ ఆఫీసుల్లో అన్ని లెవల్స్ ఉద్యోగాలకు నియామకాలు చేపడుతోంది. డిజిటల్ కంటెంట్, ఈ-లెర్నింగ్ రంగాల్లోనే అత్యధికంగా నియామకాల వృద్ధి 78శాతం మేర పెరిగింది.ప్రస్తుతం ఆఫ్ లైన్ మర్చెంట్ నెట్ వర్క్ 13 మిలియన్లకు చేరిందని 2021 నాటికి గ్రామీణ, ఉప నగర ప్రాంతాల్లో 25 మిలియన్లకు విస్తరించడమే లక్ష్యమని డిజిటల్ వ్యాలెట్ దిగ్గజం PhonePe చీఫ్ పీపుల్ ఆఫీసర్ మన్ మీత్ సాందూ అన్నారు. ఇందులో 10వేల ఉద్యోగాలను సృష్టించనున్నట్టు తెలిపారు.ఈ ఏడాదిలో 700కు పైగా నియామకాలు చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు. ఇప్పటికే తమ కంపెనీల్లో 200కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని.. వచ్చే ఏడాదిలోగా మరో 200 నుంచి 250 మంది ఉద్యోగుల నియామకం కోసం చూస్తున్నామని అర్బన్ కంపెనీ హెచ్ ఆర్ డైరెక్టర్ సుహైల్ వద్గాకర్ చెప్పారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *