లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు

బిగో లైవ్.. ఇదొక లైవ్ స్ట్రీమింగ్ యాప్.. ఈ యాప్ ను చైనీస్ కంపెనీ రూపొందించింది. చైనా రూపొందించిన పబ్ జీ వీడియో గేమ్ ఎంత పాపులర్ అయ్యిందో ఈ బిగో లైవ్ స్ట్రీమింగ్ యాప్ కూడా అంతే పాపులర్ అయింది.

Published

on

Bigo Live captures Most Indian Users with lasciviously content

బిగో లైవ్.. ఇదొక లైవ్ స్ట్రీమింగ్ యాప్.. ఈ యాప్ ను చైనీస్ కంపెనీ రూపొందించింది. చైనా రూపొందించిన పబ్ జీ వీడియో గేమ్ ఎంత పాపులర్ అయ్యిందో ఈ బిగో లైవ్ స్ట్రీమింగ్ యాప్ కూడా అంతే పాపులర్ అయింది.

బిగో లైవ్.. ఇదొక లైవ్ స్ట్రీమింగ్ యాప్.. ఈ యాప్ ను చైనీస్ కంపెనీ రూపొందించింది. చైనా ప్రవేశపెట్టిన పబ్ జీ వీడియో గేమ్ ఎంత పాపులర్ అయ్యిందో ఈ బిగో లైవ్ స్ట్రీమింగ్ యాప్ కూడా అంతే పాపులర్ అయింది. ఇప్పుడు యువతలో చాలామంది బిగో.. బిగో.. అంటూ జపం చేస్తున్నారు. బిగో లైవ్ హోస్ట్ లలో ఎక్కుమంది అమ్మాయిలే ఉన్నారంట. ఈ యాప్ ద్వారా బాలీవుడ్ స్టార్లలా తమను తాము ఊహించుకుంటూ అందాలు ఆరబోస్తూ డబ్బులు సొమ్ము చేసుకుంటుంటారు. బిగో లైవ్ స్ట్రీమింగ్ యాప్ నెట్ వర్క్ కు భారత్ లో మొత్తం 10వేల మంది పేయిడ్ బ్రాడ్ క్యాస్టర్లు ఉన్నారు. ఇందులో ఎక్కువమంది అమ్మాయిలే ఉన్నారు. డ్యాన్స్ లు, పాటలు, డర్టీగా మాట్లాడుతూ మిలియన్ల మంది మగాళ్లను ఆకర్షిస్తుంటారు. బిగో లైవ్ హోస్ట్ కోసం 300 ఏజెన్సీలను వెబ్ ద్వారా రిక్రూట్ చేసుకుంటుంది. అందులో ఎక్కువ మందిని చిన్న నగరాలు, టౌన్ల నుంచి రిక్రూట్ చేసుకుని బ్రాడ్ క్యాస్టింగ్ లో శిక్షణ ఇప్పిస్తారు. 
Read Also : అకౌంట్ unlock కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్

ఇండియాలో 6 కోట్లకు పైగా : 
బిగో లైవ్ అకౌంట్లలో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉంటే.. వారిలో ఒక్క భారత్ నుంచే 6కోట్ల మందికి పైగా బిగో లైవ్ అకౌంట్ దారులు ఉన్నారు. ఇందులో 5లక్షల మంది యూజర్లు నిత్యం యాక్టివ్ గా ఉంటున్నట్టు ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. బిగో లైవ్ నెట్ వర్క్ పై ఎలాంటి వల్గారిటీ, పోర్న్, అసభ్యకరంగా ప్రవర్తించడం, కాఫీరైటెడ్ అతిక్రమణ వంటి చర్యలకు పాల్పడినట్టు గుర్తిస్తే సదరు అకౌంట్ దారులకు బిగో లైవ్ నుంచి వార్నింగ్ వస్తుంది. రూల్స్ ను బ్రేక్ చేసినవారిని బిగో లైవ్ స్ట్రీమింగ్ కు అనుమతించకపోవడం గానీ, బ్యాన్ చేయడం గాని చేస్తారు. లైవ్ బ్రాడ్ క్యాస్టింగ్ ను 24 గంటల పాటు మానిటర్ చేస్తుంటారని, లోకల్ నియమనిబంధనలను తప్సనిసరిగా పాటించాలని ఓ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఒకరు తెలిపారు. బిగో లైవ్ స్ట్రీమింగ్ యాప్ లో అప్ డేట్ చేసే కొందరి కంటెంట్ అభ్యంతరకరంగా వివాదాస్పదంగా కనిపిస్తుంటుందని, అలాంటి కంటెంట్ ను మోడ్రేట్ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. 

రూ.70 నుంచి డిమాండ్ :
ఒక బ్రాడ్ క్యాస్టింగ్ లో.. ఓ యువతి బెడ్ పై నైట్ డ్రెస్ లో ఉంటుంది.. ఈ లైవ్ స్ట్రీమింగ్ వీడియోను ఆన్ లైన్ లో 2వేల 080 మంది యూజర్లు వాచ్ చేస్తుంటారు. ఈ క్రమంలో యువతి అందాల ఆరబోతపై తమకు నచ్చిన విధంగా డిమాండ్ చేస్తుంటారు.. ఇందుకు సదరు వ్యక్తికి గిఫ్ట్స్ పంపిస్తుంటారు. మరో ఛానళ్లలో.. లైవ్ గర్ల్స్.. ఒక యువతి వైట్ నైట్ గౌన్ ధరించి ఉంటుంది.. ఏదో బాలీవుడ్ సాంగ్ కు పెదాలు కదిలిస్తూ డ్యాన్స్ చేస్తుంటుంది. ఆమె అందచందాలను వీక్షించే వారిలో ఎక్కువమంది అబ్బాయిలే ఉంటారు. కొన్నిసార్లు డిమాండ్ బట్టి రూ.100 వరకు పేటీఎం ద్వారా పేమెంట్ చేస్తుంటారు. వీక్షకుల కామెంట్లు మరింత ఇబ్బందిగా ఉంటే.. బ్రాడ్ క్యాస్టర్లు ఫాలోవర్లను మ్యూట్ లో పెడుతుంటారు. గిఫ్ట్ ల రేంజ్ రూ. 70 నుంచి రూ.6వేల 400 వరకు ఉంటుంది. ఈ అమౌంట్ ఎంతవరకు హోస్ట్ కు, బిగోకు వెళ్తుందనేదానిపై క్లారిటీ లేదు. బిగో లైవ్ నుంచి మల్టీ గెస్ట్ లైవ్ స్ట్రీమింగ్స్ సౌకర్యం ఉంది. 

నెలకు రూ.లక్ష సంపాదన :
ఒకేసారి వీక్షకులు హోస్ట్ లతో లైవ్ లో జాయిన్ కావొచ్చు. నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం కామెంట్లను బ్యాన్ చేస్తారు.  రిక్రూట్ మెంట్ యాడ్స్ లో హోస్టులు ఎవరైతే ఉంటారో వారికి నెలకు రూ.1 లక్ష వరకు సంపాదించుకోవచ్చునని కంపెనీ తెలిపింది. ఫాలోవర్లతో లైవ్ మీటింగ్ టార్గెట్, గిఫ్ట్ ల ఆధారంగా ఉంటుంది. అంతేకాదు.. హోస్ట్ లకు ఫిక్సడ్ శాలరీ కూడా కంపెనీనే పే చేస్తుంది.  

150కు పైగా దేశాల్లో సర్వీసు :
150కు పైగా దేశాల్లో ఈ బిగో లైవ్ స్ట్రీమింగ్ సర్వీసు నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. వారిలో 60 మిలియన్ల మంది భారత్ నుంచే ఉన్నారు. రోజువారీగా బిగో లైవ్ పై యాక్టివ్ గా ఉండేవారు భారత్ లో 0.5 మిలియన్ల మంది ఉన్నారు.  2017లో భారత్ లో బిగో లైవ్ ప్రారంభమైంది. పుణె, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబైలోని జేడబ్ల్యూ మెరియట్ హోటల్లో బ్రాడ్ క్యాస్టర్ల కోసం ఆడిషన్స్ నిర్వహించారు. 

బిగో లైవ్ ను బ్యాన్ చేయాలి :
బిగో లైవ్ యాప్ స్ట్రీమింగ్ నెట్ వర్క్  సర్వీసును ఇండియన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . యువతను భ్రష్టు పట్టిస్తోన్న ఇలాంటి చైనా యాప్ లను వెంటనే బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ యాప్ ను ఎవరూ డౌన్ లోడ్ చేసుకోవద్దని, దీనిమాయలో పడి యువత చెడిపోతుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇండియాలో ఈ తరహా యాప్ లను పూర్తిగా నిషేధం విధించాలని లేదంటే యువత మరింత చెడుకు బానిసలుగా మారే ప్రమాదం ఉందని మరికొందరు హెచ్చరిస్తున్నారు. బిగో లైవ్ యాప్ ను దేశం నుంచి తరిమికొట్టాలని డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. 
Read Also : దేన్నీ వదలటం లేదు : రైల్వేలో టీ కప్పులపై మోడీ చౌకీదార్

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *