లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

బీహార్ అసెంబ్లీ పోలింగ్ లో విషాద ఘటనలు

Published

on

Polling agent, dies of cardiac arrest, man collapses while waiting to vote in Patna :  బీహార్లో అసెంబ్లీకి తొలివిడత పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. 71 స్ధానాలకు మొదటి విడతలో పోలింగ్ జరుగుతోంది. 1066 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 2కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా….తొలివిడత పోలింగ్ సందర్భంగా రెండు విషాద సంఘటనలు జరిగాయి.

నవాడా జిల్లాలోని హిసువా అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక విషాద ఘటన జరిగింది. నియోజక వర్గంలోని ఫుల్మా గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 258లో బీజేపీ పోలింగ్ ఏజెంట్ కృష్ణకుమార్ సింగ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందు…. పోలింగ్ బూత్ లో కూర్చోగానే ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చిందని చెప్పారు. వెంటనే ఆయన్నుసమీపంలోని ఆస్పత్రికి తీసుకు వెళ్తండగా మార్గమధ్యలోనే కన్నుమూశారు.మరోక ఘటనలో ససారం నియోజక వర్గం లోని, సంజౌల్ పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబర్ 151 వద్ద ఓటు వేయటానికి క్యూలైన్ లో నిల్చోని ఉన్న హీరా మహాటో అనే 65 ఏళ్ల వృధ్దుడు కుప్ప కూలిపోయాడు. అతడిని అస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. మృతుడిని ఉదయ్ పూర్ నివాసిగా గుర్తించారు.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *