Home » జూదంలో భార్యను ఓడి.. స్నేహితులకు అప్పగించాడు..
Published
3 months agoon
Bihar Alcohol Addict Allegedly Bets Wife During Gambling Bout : జూదానికి బానిసైతే ఓ భర్త ఏకంగా భార్యను స్నేహితులకు అప్పగించేశాడు. దానికి అంగీకరించని భార్యను చిత్రహింసలు పెట్టాడు. యాసిడ్ పోసి చిత్రహింసలకు గురిచేశాడో భర్త. స్నేహితులతో గడపాలని ఆ భర్త పెట్టే హింసలు భరించీ భరించీ చివరకు వ్యతిరేకించేసరికి యాసిడ్ పోసి నానా హింసలకు గురిచేయటంతో తాళలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ దారుణం బైటపడింది. బీహార్ లోని భగల్ పూర్ లో జరిగిన ఈ ఘటన మహాభారతంలో ధర్మరాజు భార్య ద్రౌపతిని జూదంలో పెట్టిన ఘటన గుర్తుకు తెస్తోంది.
ఈ దారుణ ఘటనపై భగల్పూర్ ఎస్ఎస్పీ ఆశిష్ భార్తీ తెలిపిన వివరాల ప్రకారం..తనపై యాసిడ్ పోసి దాడి చేశాడని భర్తపై ఓ మహిళ ఫిర్యాదు చేసిందని దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సదరు నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
భగల్ పూర్ లోని హసంగంజ్ కు చెందిన భర్త రవి (పేరు మార్చాం) జూదానికి, మద్యానికి బానిసయ్యాడు. అన్నీ కోల్పోయాడు.అయినా జూదం ఆడటం మానలేదు. దీంతో మరోసారి జూదం ఆడాడు. మళ్లీ ఓడిపోయాడు. దీతో భార్య ఆశా (పేరు మార్చాం) ను నెల రోజుల పాటు స్నేహితులతో గడపాలని బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆ భర్త రెచ్చిపోయాడు ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. అయినా ఆమె అంగీకరించకపోవటంతో ఆమెపై యాసిడ్ పోసి చిత్రహింసలకు గురి చేసి మొజాహిద్పూర్లోని ఓ ఇంట్లో బంధించాడు. అక్కడకు తన స్నేహితుల్ని పంపించగా..వారంతా..ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు.
అలా ఓ పక్క యాసిడ్ దాడితో జరిగిన గాయాలు..మరోపక్క కామాంధుల దారుణ హింసలతో ఒళ్లంతా పచ్చిపుండుగా మారిన ఆమె బాధ వర్ణనాతీతంగా తయారైంది. ఈక్రమంలో ఆమె అక్కడినుంచి అతి కష్టంమీద తప్పించుకుంది. ఒళ్లంతా గాయాలతో లోధిపూర్లోని తండ్రి దగ్గరకు వెళ్లి గత శనివారం (డిసెంబర్ 13,2020) దీపక్ సింగ్ అనే సామాజిక కార్యకర్త సహాయంతో లోధిపూర్ లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు భర్తను అరెస్ట్ చేశారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.
కాగా గత అక్టోబర్ లో కూడా భర్త స్నేహితులతో జూదం ఆడి ఓడిపోయి భార్యను స్నేహితులకు అప్పగించాడు. అలా రెండు మూడు సార్లు ఆమె భర్త్ స్నేహితుల చేతుల్లో నలిగిపోయింది. అలా ప్రతీసారి భర్త చేసే దారుణాన్ని భరించీ భరించీ చివరకు ఎదురు తిరిగింది. అది తట్టుకోలేని భర్త్ ఆమెపై యాసిడ్తో దాడి చేశాడు. అలా జరిగిన ఘటనలో ఆమె తప్పించుకుని పోలీసులకు ఆశ్రయించింది.
దీనిపై పోలీసులు మాట్లాడుతూ..బాధితురాలు తీవ్ర గాయాలతో ఉందని..ఈ విషయాన్ని బైటకు చెప్పలేమనీ..ఈ కేసు చాలా సున్నితమైనదనీ దీనిపై..ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందుతులను అరెస్ట్ చేశామని తెలిపారు. భర్తను అదుపులోకి తీసుకున్నామని అతని స్నేహితుల కోసం గాలిస్తున్నామని..ఈ కేసులో ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ మొజాహిద్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రాజేశ్ కుమార్ ఝా తెలిపారు. కాగా వీరిద్దరికి వివాహం జరిగి 10 సంవత్సరాలైంది. కానీ పిల్లులు పుట్టలేదు. దీంతో భార్యను తరచూ హింసించటం అతనికి సర్వసాధారణమైపోయింది.ఈ క్రమంలో మద్యానికి, జూదానికి అలవాటు పడి ఏకంగా భార్యనే తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిపోయాడు.