లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

Bihar Cabinet portfolios : మరోసారి నితీష్ వద్దే హోం,తారకిశోర్ కు ఆర్థికశాఖ

Published

on

Bihar Cabinet portfolios జేడీయూ అధినేత నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి బీహార్ సీఎంగా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం(నవంబర్-17,2020)జరిగిన బీహార్ తొలి కేబినెట్ భేటీలో సోమవారం మంత్రులుగా ప్రయాణస్వీకారం చేసిన నాయకులకు శాఖలను కేటాయించారు సీఎం నితీష్ కుమార్. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో బీజేపీ నుంచి ఏడుగురికి మంత్రిపదవులు దక్కగా,జేడీయూకి 5మంత్రి పదవులు,హెచ్ఏఎమ్,వీఐపీ పార్టీలో చెరొక మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.ఎవరెవరికి ఏయే శాఖలు దక్కాయి
నితీష్ కుమర్(జేడీయూ)- ముఖ్యమంత్రి-హోంశాఖ,సాధారణ పరిపాలన శాఖ,విజిలెన్స్ శాఖ మరియు ఇంకా ఏ మంత్రికి కేటాయించని శాఖలు
తారకిశోర్ ప్రసాద్(బీజేపీ)-డిప్యూటీ సీఎం- ఆర్థికశాఖ-ఐటీ,వాణిజ్య పన్నులు-పర్యావరణ మరియు అటవీ-విపత్తు నిర్వహణ-పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలను నిర్వహించనున్నారు.
రేణు దేవి(బీజేపీ)- డిప్యూటీ సీఎం-పంచాయతీ రాజ్,వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు పరిశ్రమల శాఖ బాధ్యతలు నిర్వహించనున్నారు
మంగల్ పాండే(బీజేపీ)- ఆరోగ్యశాఖ-కళా మరియు సంస్కృతిక శాఖ బాధ్యతలను కూడా పాండే నిర్వహించనున్నారు.
రామ్ సూరత్ రాయ్(బీజేపీ)-న్యాయ,రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వహించనున్నారు.
అమరేంద్రప్రతాప్ సింగ్(బీజేపీ)-వ్యవసాయ,సహకార,షుగర్ కేన్ శాఖల బాధ్యతలు నిర్వహించనున్నారు.
జీవేష్ మిశ్రా(బీజేపీ)-పర్యాటక,లేబర్,గనుల శాఖ బాధ్యతలు నిర్వహించనున్నారు.
రామ్ ప్రీత్ పాశ్వాన్(బీజేపీ)-పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖను కేటాయించారు.
బిజేంద్ర యాదవ్(జేడీయూ)-ఇంధన,ఆహార,వినియోగదారుల వ్యవహారాల,ప్రణాళిక శాఖలను నిర్వహించనున్నారు.
అశోక్ చౌదరి(జేడీయూ)-మైనార్టీ మరియు సామాజిక సంక్షేమ శాఖ,బిల్డిండ్ నిర్మాణ శాఖ బాధ్యతలను నిర్వహించనున్నారు.
మేవాలాల్ చౌదరి(జేడీయూ)-విద్యాశాఖ బాధ్యతలు నిర్వహించనున్నారు.
సంతోష్ మాంజీ(హెచ్ఏఎమ్)-మైనర్ ఇరిగేషన్,షెడ్యూల్డ్ కులాల/షెడ్యూల్డ్ తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహించనున్నారు.
ముఖేష్ సాహ్ని(వీఐపీ)-పశుసంవర్థక,మత్య శాఖ బాధ్యతలను నిర్వహించనున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *