లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

Bihar Elections Result: మ్యాజిక్ ఫిగర్ దాటేసిన NDA!

Published

on

Picture

తగ్గుతున్న బీజేపీ ఆధిక్యం

10/11/2020,3:12PM

బీహార్ విధానసభ ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ కాపాడుకుంటూ వస్తుంది. 243 సీట్లకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో 122 సీట్లలో ఎన్డీఏ మెజారిటీగా కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఇంకాస్త ఎక్కువ ఆధిక్యం కనిపించినా క్రమంగా అది తగ్గుతూ వస్తుంది.

Picture

మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ

10/11/2020,1:36PM

బీహార్ 243 స్థానాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఎన్డీఏ 127సీట్లలో రాణిస్తుండగా మహగత్భందన్ 106సీట్లుతో కొనసాగుతోంది. ఇతర పార్టీలు 7సీట్లతో ఉండగా, ఎల్జేపీ 2సీట్లతో రాణిస్తుంది.

Picture

దూసుకెళ్తోన్న ఎన్డీఏ

10/11/2020,12:49PM

ఎన్డీఏ మెజారిటీతో దూసుకుపోతుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఓట్ల కౌంటింగ్ లో ఎన్డీఏ 128 స్థానాల్లో ఉండగా ఎమ్జీబీ 104 స్థానాలతో వెనుకబడింది. ఆ తర్వాత ఎల్జేపీ 3, ఇతరులు 8తో పోటీపడుతున్నారు.

Picture

ముందంజలో NDA

10/11/2020,12:03PM

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు మాత్రం నువ్వా? నేనా? అన్నట్లుగా సాగుతున్నాయి. ఆధిక్యంలో NDA, మహాఘట్ బంధన్‌ కూటమి మధ్య పోరాటం సాగుతుంది. అధికార ఎన్‌డీఏ 130స్థానాల్లో ముందంజలో ఉండగా.. మహాకూటమి 101స్థానాల్లో ముందుంది. ఇక ఎల్‌జేపీ 6స్థానాల్లో ఇతరులు 6స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Picture

అనూహ్యంగా పుంజుకున్న ఎన్‌డీఏ కూటమి

10/11/2020,10:50AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కౌటింగ్‌ మొదలైన దగ్గర నుంచి వెనుకంజలో ఉన్న జేడీయూ-ఎన్‌డీయే కూటమి అనూహ్యంగా పుంజుకుని ఫలితాల్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం 121 సీట్ల ఆదిక్యంలో ఎన్‌డీయే కూటమి కొనసాగుతుంది. ఇక తొలి నుంచి ఆదిక్యంలో కొనసాగుతున్న ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి 109 సీట్లలో మాత్రమే లీడింగ్‌లో ఉంది. ఎల్‌జేపీ 6 స్థానాల్లో, ఇతరులు ఆరు స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు.

Picture

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయా? ముందంజలో NDA!

10/11/2020,10:23AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ సారధ్యంలోని NDA ముందంజలో సాగుతుంది. RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి కూడా గట్టి పోటీ ఇస్తుండగా.. ఎన్‌డీఏ మాత్రం 125సీట్లలో ముందంజలో ఉంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉండగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైనట్లుగా కనిపిస్తుంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేజశ్వీ సారధ్యంలోని మహా కూటమి గెలుస్తుంది అని అంచనాలు ఇవ్వగా.. ఇప్పుడు ఆ అంచనాలకు వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయి.

Picture

బీహార్‌లో బీజేపీ హవా.. JDU కంటే జోరుగా.. ముందంజలో ఎన్‌డీఏ

10/11/2020,10:07AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. బీహార్‌లో JDU కంటే జోరుగా BJP ముందంజలో ఉండగా.. తేజశ్వి సారధ్యంలోని మహాకూటమి కంటే ఎన్‌డీఏ కూటమి ముందుకు సాగుతుంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉండగా… BJP 60, JDU 42, ఎన్‌డీఎలో ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అలాగే మహాకూటమిలో చూస్తే RJD 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా… కాంగ్రెస్ 31స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఎం 3, సీపీఐ 1, సీపీఐఎంఎల్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక LJP 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరుల్లో BSP.. 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా… ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇక, జేడీయూ కూటమికి… 69 స్థానాల్లో లీడ్ ఉండగా… కాంగ్రెస్, ఆర్జేడీ మహాకూటమి 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 1 స్థానంలో, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Picture

మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసిన మహాకూటమి

10/11/2020,9:38AM

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మ‌హాఘ‌ట‌బంధ‌న్ దూసుకుపోతోంది. ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ ఆశ‌లు ఫ‌లించేలా ఫ‌లితాలు వ‌చ్చే ఛాన్స్ ఉంది. ప్ర‌స్తుతానికి మ‌హాఘ‌ట‌బంధ‌న్ మ్యాజిక్ ఫిగర్ 122ను క్రాస్ చేసి మెజారిటీ స్థానాల్లో మొత్తం 124స్థానాల్లో ముందంజ‌లో ఉంది. ఎన్డీయే కూట‌మి 110 స్థానాల్లో లీడ్‌లో ఉండ‌గా, ఎల్జేపీ 5, ఇత‌రులు రెండు స్థానాల్లో ముందంజ‌లో ఉన్నారు.

Picture

బీహార్‌లో హోరాహోరీ పోరు

10/11/2020,9:28AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి గంటలో లెక్కింపు ప్రకారం.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమి.. అధికార NDA పోటాపోటీగా తలపడుతున్నాయి. తేజశ్వి నాయకత్వంలోని మ‌హాఘ‌ట‌బంధ‌న్ ఫలితాల్లో కాస్త ముందంజలో ఉంది. మ‌హాఘ‌ట‌బంధ‌న్‌ 124చోట్ల ముందంజలో ఉండగా.. ఎన్‌డీఏ 111చోట్ల ముందంజలో ఉంది.

Picture

తొలి ఫలితాల్లో ముందంజలో తేజశ్వీ

10/11/2020,9:00AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. కౌంటింగ్‌ స్టార్ట్ అవ్వగా.. తొలి ఫలితాల్లో రాష్ట్రీయజతాదళ్‌(ఆర్జేడీ) యువ నేత తేజశ్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్ ఆధిక్యంలో సాగుతుంది. అధికార ఎన్డీయే 62 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎంజీబీ 84 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఎల్‌జేపీ 5, ఇతరులు ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Picture

10/11/2020,8:57AM

హోరాహోరీగా సాగిన బిహార్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Picture

కౌంటింగ్ ప్రారంభం

10/11/2020,8:08AM

బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం అయ్యింది. 38 జిల్లాల్లో 55 కేంద్రాలను ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవ్వగా.. 243 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) యువనేత తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని ఐదు పార్టీల మహా కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.

Picture

మూడు దశల్లో ఎన్నికలు:

10/11/2020,8:01AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరగగా.. మొదటి దశలో 16 జిల్లాల్లో 71 అసెంబ్లీ స్థానాలకు, రెండవ దశలో 17 జిల్లాల్లో 94 స్థానాలకు, మూడవ దశలో 15 జిల్లాల్లో 78 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. మొదటి దశ అక్టోబర్ 28 న, రెండవ దశ నవంబర్ 3 న, మూడవ దశ నవంబర్ 7న ఓటింగ్ జరిగింది.

Picture

చక్రం తిప్పేదెవరు?

10/11/2020,8:01AM

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ ఎన్నికల ఫలితం కొద్దిసేపట్లో తేలనుంది. పదిహేనేళ్లుగా బీహార్‌ను పాలిస్తున్న నితీశ్ కుమార్ ఒకవైపు.. యువ తేజశ్వి మరోకవైపు. ఎవరు చక్రం తిప్పనున్నారు?

Picture

బీహార్ కా బాద్ షా ఎవరు..?: నేడే ఎన్నికల ఫలితాలు!

10/11/2020,7:48AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. 10Tv న్యూస్ మొత్తం 243 అసెంబ్లీ సీట్ల వేగవంతమైన మరియు ఖచ్చితమైన ఫలితాలను పాఠకులకు మరియు వీక్షకులకు అందిస్తుంది. 10Tv న్యూస్‌లో రోజంతా ప్రత్యేక కవరేజ్ ఉంటుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *