Home » రోజుకు 9 హత్యలు, 4 అత్యాచారాలు..అక్కడంతా భయం భయం
Published
2 months agoon
Bihar Crime 2406 murders, 1106 rapes reported in 9 months : బీహార్ లో రోజు రోజుకు పెరిగిపోతున్న నేరాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ట్రంలో నేరాల గురించి నేర రికార్డుల బ్యూరో (ఎస్ సీఆర్ బీ) డేటాను విడుదల చేసింది. ఈ డేలా వివరాల ప్రకారం బీహార్ లో ప్రతీ రోజూ సగటున 9 హత్యలు జరుగుతుంటే.. నలుగురు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని వెల్లడైంది.
2020 జనవరి నుంచి గత సెప్టెంబర్ వరకు అంటే తొమ్మిది నెలల్లో జరిగిన నేరాల సంఖ్య వింటుంటే వెన్నులోంచి వణుకుపుట్టుకొస్తోంది. ఈ తొమ్మిది నెలల కాలంలో 2వేల 406 హత్యలు జరగ్గా.. 1,106 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. బీహార్ రాజధాని పాట్నా..నేరాలకూ అడ్డాగా మారిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే పాట్నాలోనే నేరాల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. 159 హత్యలతో పాట్నా నగరం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. పాట్నా తరువాత గయ 138 హత్యలు, ముజఫర్ పూర్ 134 హత్యలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని గణాంకాలు తెలిపాయి. హత్యలకు ప్రధాన కారణం భూ వివాదాలు, వ్యక్తిగత కక్షలేనని పోలీసులు చెబుతున్నారు.
నేరాలు పెరుగుతుండడంపై బీహార్ ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీంట్లో భాగంగా ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్.. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. వందల కొద్దీ హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ లు, దోపిడీలు..ఇన్నేళ్ల మీ పాలనలో ఇదే మీరు సాధించింది. నేరాలు పెరగడంపై బాధ్యత వహిస్తూ హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలి’’ అని ఆయన డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.
కాగా..రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల గురించి సీఎం నితీశ్ కుమార్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి అధికారంలోకి వచ్చి ప్రభుత్వ పగ్గాలు అందుకున్న వెంటనే.. పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై..నేరాలను అదుపు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు డిపార్ట్ మెంట్ కు పలు సూచనలు చేశారు.
కోడలిపై మామ అత్యాచారం, హైదరాబాద్ లాడ్జిలో దారుణం
పెళ్లి పేరుతో వ్యాపారి నుంచి 11కోట్లు నొక్కేసిన నకిలీ ఐపీఎస్ స్మృతి కేసులో మతిపోయే వాస్తవాలు
జస్ట్ రూ.5 గమ్‌తో 500మంది బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేసిన కేటుగాడు, యూపీలో ఘరానా మోసం
గ్యాంగ్ రేప్‌కు ఒప్పుకోలేదని కాలేజీ విద్యార్థినికి నిప్పు.. యూపీలో షాకింగ్ ఘటన
నీ గట్స్‌కు హ్యాట్సాఫ్.. రాత్రి వేళ దొంగను వెంటాడి పట్టుకున్న యువతి
తీవ్ర విషాదం.. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కన్నకొడుకు, సోదరి బలయ్యారు